బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టైర్ల వ్యాపారి ఆస్తి రూ. 800 కోట్లు, బినామీ, ఎవరీ గుజరాతీ అగర్వాల్, నాయకులు ఎంట్రీ!

|
Google Oneindia TeluguNews

Recommended Video

బెంగళూరు బౌరింగ్ క్లబ్ లాకర్ లో రూ. 800 కోట్లు లభ్యం

బెంగళూరు: బెంగళూరు నగరంలోని బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లో వ్యాపారి అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు చెందిన లాకర్లలో చిక్కిన నగదు, నగలు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాల విలువ దాదాపు రూ. 800 కోట్లకు పైగా ఉంటుందని ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు అంచనా వేశారు.

రాజకీయ నాయకులు ఎంట్రీ

రాజకీయ నాయకులు ఎంట్రీ

వ్యాపారి అవినాష్ అమర్ పాల్ కుక్రోజాను రక్షించడానికి అనేక మంది రాజకీయ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారని ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ నాయకులు, వారి కుటుంబ సభ్యుల పేర్లు ఆస్తుల పత్రాల్లో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

అవినాష్ ఎవరు ?

అవినాష్ ఎవరు ?

అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ ఎవరు ? అతని చరిత్ర ఏమిటి ? అంటూ ఐటీ శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. బెంగళూరు నగరంలో అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ పేరుకు మాత్రం టైర్ల వ్యాపారం చేస్తున్నాడు.

టైర్ల వ్యాపారికి రూ. 800 కోట్లు ?

టైర్ల వ్యాపారికి రూ. 800 కోట్లు ?

టైర్ల వ్యాపారం చేసే వ్యక్తి రూ. 800 కోట్ల ఆస్తులు సంపాధించడం ఎలా సాధ్యం ? అంటూ ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. టైర్ల వ్యాపారంతో పాటు అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం, వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది.

సమన్లు ఇచ్చినా రాలేదు

సమన్లు ఇచ్చినా రాలేదు


లాకర్లలో స్వాధీనం చేసుకున్న నగదు, నగలు, వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలకు లెక్కలు చూపించాలని అవినాష్ అమర్ లాల్ కుక్రోజా అగర్వాల్ కు ఐటీ శాఖ అధికారులు సమన్లు జారీ చేసినా ఆయన ఇంత వరకూ విచారణకు హాజరుకాలేదు. అవినాష్ ను విచారణ చెయ్యడానికి అధికారులు సిద్దం అయ్యారు.

సాధ్యం కాదు

సాధ్యం కాదు

బౌరింగ్ ఇన్సిట్యూట్ క్లబ్ లాకర్లలో అవినాష్ అమర్ లాల్ కుక్రోజ్ అగర్వాల్ కు చెందిన రూ. వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు వెలుగు చూసినా ఆయన సభ్యత్వం తొలగించడానికి సాధ్యం కాదని క్లబ్ నిర్వహకులు అంటున్నారు. ఎందుకంటే అవినాష్ లైఫ్ టైం సభ్యత్వం తీసుకున్నాడని క్లబ్ నిర్వహకులు అంటున్నారు.

English summary
The Bowring club is currently dominated by a particular community with links to the rich and influential in the city. These people are preventing Avinash’s membership from being scrapped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X