గాలిపై ఐటీ దాడులు అందుకే: ఇదీ లెక్క !
సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో నివాసం ఉండటానికి వీలు లేదు. కుమార్తె పెళ్లి చెయ్యడానికి మాత్రం గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీకి వెళ్లి రావడానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 22వ తేదీ వరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారీలో ఉండటానికి సుప్రీం కోర్టు అవకాశం ఇచ్చింది.
రూ. 200 కోట్లకు పైగా ఖర్చు చేసి గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె పెళ్లి చేశారని ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐటీ శాఖ సెక్షన్ 133(ఎ) ప్రకారం అధికారులు విచారణ మొదలు పెట్టారు.
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లికి భారీ సెట్టింగ్స్ వేయించారని, ఆయన కుమార్తె బ్రహ్మిణి రూ. 90 కోట్లతో ప్రత్యేకంగా తయారు చేయించిన వజ్రాలు, బంగారు నగలు వేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రోజులో గాలి బళ్లారీ నుంచి వెళ్లిపోవాల్సిన సమయంలో ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రికార్డులు పరిశీలిస్తున్నారు.

అదే విధంగా గాలి జనార్దన్ రెడ్డి ఖరీదైన వస్త్రాలు, బహుమతులు ఇవ్వడానికి రూ. 100 కోట్లు, భోజనాల ఖర్చుకు రూ. 20 కోట్లు, పెళ్లికి వచ్చిన అతిథులు బస చెయ్యడానికి స్టార్ హోటల్స్ లో 1,500 గదులు బుక్ చేసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్యాలెస్ గ్రౌండ్స్ లో కళ్యాణ పండపం దగ్గర రూ. ఒక కోటి ఖర్చు పెట్టి విజయ విఠల ఆలయం సెట్టింగ్ వేయించారని ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు రూ. 10 కోట్లు ఇచ్చారని, పెళ్లిలో భద్రత కల్పించడానికి బౌన్సర్లకు రూ. 30 లక్షలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications