వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత పోయెస్ గార్డెన్ ఇంటిలో ఐటీ దాడులు, ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు సీజ్, ఎందుకంటే !

జయలలిత ఇంటిలో ఐటీ శాఖ అధికారుల సోదాలు.ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు, డాక్యుమెంట్లు సీజ్, హై డ్రామా.శశికళ ఫ్యామిలీలో ఆందోళన, వివేక్ ఇంటిలో తాళం, దినకరన్ హంగామా !

|
Google Oneindia TeluguNews

Recommended Video

Poes Garden IT Raids | Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. మద్రాసు హైకోర్టు అనుమతితో ఐటీ శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో సోదాలు చేశారు.

చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్ష, ప్రభుత్వానికి పంగనామాలు, చీటింగ్ !చిన్నమ్మ శశికళ భర్త నటరాజన్ కు రెండేళ్లు జైలు శిక్ష, ప్రభుత్వానికి పంగనామాలు, చీటింగ్ !

శశికళ వదిన ఇళవరసి కుమారుడు, జాజ్ సినిమా సీఇవో, జయ టీవీ ఎండీకి ఫోన్ చేసిన ఆదాయపన్ను శాఖ అధికారులు పోయెస్ గార్డెన్ తాళాలు తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. వివేక్ పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం తాళాలు తీసుకుని వెళ్లి ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించాడు.

ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు సీజ్

ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్ లు సీజ్

వివేక్ దగ్గర తాళాలు తీసుకున్న ఆదాయపన్ను శాఖ అధికారులు వేదనిలయంలోకి వెళ్లి శశికళ గది, జయలలిత మేనేజర్ పున్ కుందరన్ గది, రికార్డుల గదుల్లో సోదాలు చేశారు. శశికళ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక ల్యాప్ టాప్, నాలుగు పెన్ డ్రైవ్ లు, డాక్యుమెంట్ల కోసం వేదనిలయంలో సోదాలు చేశామని, వాటిని సీజ్ చేశామని ఐటీ శాఖ అధికారులు చెప్పారు.

దినకరన్ అనుచరుల హంగామా

దినకరన్ అనుచరుల హంగామా

జయలలిత గదిలో సోదాలు చేశామని, చెయ్యలేదనే విషయంలో మాత్రం ఐటీ శాఖ అధికారులు క్లారిటీ ఇవ్వలేదు. పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారని తెలుసుకున్న టీటీవీ దినకరన్, ఆయన మద్దతు దారులు అక్కడికి చేరుకుని నానా హంగామా చేశారు.

పోలీసుల అదుపులో 40 మంది

పోలీసుల అదుపులో 40 మంది

పోయెస్ గార్డెన్ దగ్గర హంగామా చేసిన దాదాపు 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీవీ దినకరన్ వర్గం, పోలీసుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

అమ్మ అభిమానులు

అమ్మ అభిమానులు

అమ్మ జయలలిత అభిమానులు, అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు జయలలిత అభిమానులకు వేదనిలయంలో ఏమీ జరగడం లేదని వారికి నచ్చచెప్పారు.

అమ్మ ఆత్మ క్షమించదు

అమ్మ ఆత్మ క్షమించదు

జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయంలో ఐటీ దాడులు జరిగాయని, అమ్మ ఆత్మ మిమ్మల్ని క్షమించదని టీటీవీ దినకరన్ తమిళనాడు ప్రభుత్వం మీద మండిపడ్డారు. జయలలిత ఇంటిలో సోదాలు చెయ్యాల్సిన అవసరం ఏమిటని టీటీవీ దినకరన్ ఆదాయపన్ను శాఖ అధికారులను ప్రశ్నించారు.

English summary
It was a high voltage drama at Poes Garden, which houses the official residence of late chief minister J Jayalalithaa, late on Friday night, as income tax officials conducted searches at the posh bungalow, after obtaining warrant to do so.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X