• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉదృతమవుతున్న కేసులు..కేంద్ర వర్గాల్లో పెరుగుతున్న ఆందోళన..! జూన్ వరకూ లాక్‌డౌన్ తప్పదా..?

|

ఢిల్లీ/హైదరాబాద్ : గత నలభై రోజులుగా స్వీయ నియంత్రణ పాటిస్తు లాక్‌డౌన్ ఆంక్షలను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నా కరోనా కష్టాలు రెట్టింపవుతున్నాయి తప్ప తగ్గముఖం పట్టడంలేదు. కేసులు తగ్గుతాయోమోనని కేంద్రంతో పాటు రాష్ట్ర వర్గాల్లో ఆశాభావం నెలకొంది. వెన్నెల కోసం ఎదురు చూస్తున్న చెకోర పక్షిలా కేసుల తగ్గుముఖం కోసం ఎదురుచూసిన ప్రభుత్వాలకు, దేశ ప్రజలకు నిరాశ తప్పడం లేదు. కేసులు సంఖ్య గంటగంటకూ విస్తరిస్తూనే ఉన్నాయి. దీంతో కరోనా వైరస్ ను కట్టడి చేసి తీరుతామని కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.

  Lockdown Until June మరో రెండు నెలలు కరోనా మీద యుద్దం, లాక్‌డౌన్ జూన్ వరకు పొడగించే అవకాశం!!
  లాక్‌డౌన్ ఆంక్షల్లో కూడా పెరుగుతున్న కేసులు.. కలవరపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..

  లాక్‌డౌన్ ఆంక్షల్లో కూడా పెరుగుతున్న కేసులు.. కలవరపడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..

  భారత దేశంలో కరోనా పాజిటీవ్ కేసు సంఖ్య నానాటికీ విజృంభిస్తున్నాయి. మొదట పదులు, ఆ తర్వాత వందలు సంఖ్యలో పెరిగిపోయిన కేసులు ఇపుడు ఏకంగా వేలకు చేరుతున్నాయి. ఏకంగా ఒకే రోజు నమోదైన అత్యధిక కేసుల సంఖ్య తొలిసారి 2 వేలు దాటింది. గత 24 గంటల్లో 2487 కొత్త కేసులు నమోదవడం భారతదేశంలో భయంకర పరిస్థితిని గుర్తు చేస్తోంది. పెరుగుతున్న కేసుల సంఖ్యను చూస్తుంటే, యూరప్ లోని విదేశాలు గుర్తు వచ్చే పరిస్థితి నెలకొంది. కరోనా మహమ్మారి కరతాళ నృత్యంతో భారత్ లో వేగంగా కేసుల సంఖ్య 40 వేలు దాటిపోయింది. ఒక్క రోజులో 83 మంది కరోనా వైరస్ బారిన పడి చనిపోయారు. కేసుల తీవ్రత పెరగడం, మరణాలు పెరగడం, లాక్‌డౌన్ లో కూడా భారీగా కేసులు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

  విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న పాజిటీవ్ కేసుల సంఖ్య..

  విజృంభిస్తున్న కరోనా.. పెరుగుతున్న పాజిటీవ్ కేసుల సంఖ్య..

  కరోనా విజృంభనతో పరిస్థితి ప్రమాదకరంగా మారినట్లు కేంద్ర వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తిలో మూడవ స్థానంలో ఉంది. అక్కడ 12296 కేసులున్నాయి. అంటే దేశంలో నమోదైన కేసుల్లో మూడో వంతు ఆ రాష్ట్రాం ఇతర ప్రాంతాలను వణికిస్తున్నాయి. గుజరాత్ లో ఐదు వేలు, ఢిల్లీలో నాలుగు వేల కేసులున్నాయి. దక్షిణ భారతదేశంలోనే కేసులు కాస్త అదుపులో ఉన్నాయి. మొదటి లాక్‌డౌన్ తో కేసులు పూర్తిగా తగ్గిపోతాయని దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఆశించారు. అంతే కాకుండా దేశ ప్రజలకు కరోనా మహమ్మారి గురించి తీసుకోవాల్సిన మరిన్ని ముందు జాగ్రత్తల గురించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేసారు.

  కేంద్రం ప్రభుత్వం చేయనున్న మూడో ప్రకటన.. స్వీయ నియంత్రణలోనూ వ్యాప్తి చెందుతున్న కరోనా..

  కేంద్రం ప్రభుత్వం చేయనున్న మూడో ప్రకటన.. స్వీయ నియంత్రణలోనూ వ్యాప్తి చెందుతున్న కరోనా..

  కానీ కరోనా వైరస్ నియంత్రణలో ప్రభుత్వ అంచనాలు తారుమారయ్యాయి. పాజిటీవ్ కేసల సంఖ్య తగ్గకపోగా గణనీయంగా పెరిగాయి. రెండవ సారి ప్రకటించిన లాక్‌డౌన్ ఆంక్షల్లో తగ్గాల్సిన కేసులు వినూత్నంగా పెరిగాయి. అంతే కాకుండా మూడో లాక్‌డౌన్ ప్రకటనకు ముందే కేసులు దారుణంగా విజృంభించాయి. అంటే ఇపుడే భారత్ లో కేసుల సంఖ్య తారా స్థాయికి వెళ్తున్నట్టు పెరుగుతున్న కేసులు నిర్ధారిస్తున్నాయి. మరి ఈ కేసుల ఉదృతి ఎన్నిరోజులు కొనసాగుతాయో అర్థం కాకుండా పరిణమించింది. అంతర్జాతీయంగా జరుగుతున్న కేసుల పరిణామం చూస్తుంటే ఇదే పరిస్థితి మరో రెండు వారాలు కొనసాగుతాయనే సంకేతాలు వెలువడుతున్నాయి.

  జూన్ వరకూ లాక్‌డౌన్.. సమాలోచనలో కేంద్ర సర్కార్..

  జూన్ వరకూ లాక్‌డౌన్.. సమాలోచనలో కేంద్ర సర్కార్..

  ఇదిలా ఉండగా మూడో లాక్ డౌన్ ముగిసే వరకు కూడా కరోనా పాజిటీవ్ కేసుల ఉదృతి తగ్గే అవకాశాలు కనిపించడం లేదు. కరోనా ఉదృత వ్యాప్తి నుంచి మళ్లీ కేసులు తగ్గి అంతా అదుపులోకి రావడానికి మరో మూడు వారాల సమయం పట్టొచ్చనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మే నెల చివరి వరకూ లాక్‌డౌన్ ఆంక్షలను పొడిగించాలనుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అది సాద్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. వాక్సీన్ కూడా కనిపెట్టలేని కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి రావాలంటే లాక్‌డౌన్ ఆంక్షలను జూన్ వరకు పొడగించే అవకాశం ఉందని స్పంష్టంగా నిర్ధారణవుతోంది. అంటే మరో రెండు నెలలు కరోనా మీద యుద్దం చేయక తప్పని పరిస్ధితులు నెలకొన్నాయన్న మాట.

  English summary
  There are concerns that it will take another three weeks for the cases to recur and the whole thing can be recovered from the corona outbreak. There is no possibility for central and state governments to extend the lockdown restrictions until the end of May. It is clear that the lockdown restrictions could be extended until June if the vaccine itself can be fully restrained by the unexplained corona epidemic.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X