వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని: ఐదు ప్రతిజ్ఠలతో మోడీ ప్రసంగం సాగిందిలా, తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: యావత్ భారత దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను వైభవంగా జరుపుకుంటోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఇంటి మీదా మువ్వన్నెల పతాకం సగర్వంగా ఎగురుతోంది. ఈ 75 సంవత్సరాల్లో సాధించిన ప్రగతిని దేశ ప్రజలు గుర్తు చేసుకుంటోన్నారు. ఎందరో త్యాగధనులు, మహనీయులను మరొక్కసారి స్మరించుకుంటోన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం 7 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.

ఇదే ఆమె తొలి ప్రసంగం. సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎర్ర కోట వేదికగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పూర్తి కానున్నందున అందరి దృష్టీ ఆయన ప్రసంగం మీదే నిలిచింది. జెండా ఎగురవేసిన అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగం ప్రారంభించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ మీ కోసం..

Recommended Video

    కామన్వెల్త్ గేమ్స్ 2022 బృందానికి ప్రధాని మోదీ ఆతిథ్యం *National | Telugu OneIndia
    Independence Day 2022 Celebrations LIVE Updates In Telugu: PM Narendra Speech from Red Fort.

    Newest First Oldest First
    3:32 PM, 15 Aug

    పశ్చిమ బెంగాల్: 176 బెటాలియన్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ (BGB) సిబ్బంది స్వాతంత్య్ర దినోత్సవం రోజున భారతదేశం-బంగ్లాదేశ్ సరిహద్దులోని ఫుల్బరి వద్ద స్వీట్లు మార్చుకున్నారు.
    3:31 PM, 15 Aug

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బెంగళూరులో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై, మొదాసాలో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ జాతీయ జెండాను ఎగురవేశారు.
    3:29 PM, 15 Aug

    శ్రీనగర్‌లోని లాల్ చౌక్‌లో మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల బృందం స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంది.
    3:28 PM, 15 Aug

    ఢిల్లీలోని తన నివాసంలో మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
    3:28 PM, 15 Aug

    ఈ రోజు మనం ఎదుర్కొంటున్న రెండు పెద్ద సవాళ్లు - అవినీతి, పరివార్‌వాదం లేదా బంధుప్రీతి' అని ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించినప్పుడు.. "ఈ విషయాలపై నేను వ్యాఖ్యానించను. అందరికీ స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
    3:26 PM, 15 Aug

    నిజమైన స్వాతంత్య్రం పొందినదేశం భారత్ అని.. పాకిస్థాన్ కు స్వాతంత్య్రం రాలేదని పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
    3:24 PM, 15 Aug

    లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఢిల్లీలోని తన నివాసంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని 2022 జరుపుకున్నారు.
    2:52 PM, 15 Aug

    అస్సాంలో లక్ష చిన్న చిన్న కేసులను ఉపసంహరించుకుంటామని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం హిమంత ప్రకటించారు.
    2:51 PM, 15 Aug

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ జాతీయ జెండాను ఎగురవేశారు.
    2:51 PM, 15 Aug

    ఇద్దరు డ్రోన్ ఔత్సాహికులు సౌరవ్ సింగ్, పవన్ పాండే ఈ రోజు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ కింద తయారు చేసిన తమ స్వీయ-నిర్మిత హెక్సాకాప్టర్‌ను ఉపయోగించి హర్యానాలోని గ్రీన్ డ్రోన్ జోన్‌లో 3 మీటర్ల వెడల్పు & 2 మీటర్ల పొడవు గల జాతీయ జెండాను ఎగురవేశారు. జెండాతో 30 నిమిషాలకు పైగా డ్రోన్ ఎగిరింది.
    2:47 PM, 15 Aug

    చెన్నైలోని సెయింట్ జార్జ్ ఫోర్ట్‌లో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
    2:46 PM, 15 Aug

    జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీలో జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
    2:18 PM, 15 Aug

    ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతదేశానికి శుభాకాంక్షలు తెలిపారు.
    2:17 PM, 15 Aug

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా భారతదేశం సాధించిన విజయాలను ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ప్రశంసించారు.
    2:15 PM, 15 Aug

    ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు. ఆర్మీ చీఫ్, జనరల్ మనోజ్ పాండే, ఇండియన్ నేవీ చీఫ్, అడ్మిరల్ ఆర్ హరి కుమార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి హాజరయ్యారు.
    2:14 PM, 15 Aug

    దిగువ న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించేందుకు సోషల్ మీడియా పోస్టులతో సహా లక్ష చిన్న కేసులను అస్సాం ప్రభుత్వం ఉపసంహరించుకుంటుంది: గౌహతిలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ
    2:14 PM, 15 Aug

    పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన స్వాతంత్య దినోత్సవ వేడుకల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ పాల్గొన్నారు.
    1:31 PM, 15 Aug

    పంజాబ్ | స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద సరిహద్దు భద్రతా దళం, పాకిస్థాన్ రేంజర్లు స్వీట్లు పంచుకున్నారు.
    1:30 PM, 15 Aug

    ఉత్తరప్రదేశ్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీరట్‌లోని ఔఘర్‌నాథ్ మందిర్‌లో ప్రత్యేక అలంకరణలు, ప్రార్థనలు.
    1:04 PM, 15 Aug

    స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.
    12:40 PM, 15 Aug

    తిరువనంతపురంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కేరళ సీఎం పినరయి విజయన్ జాతీయ జెండాను ఎగురవేశారు.
    12:30 PM, 15 Aug

    కోల్‌కతాలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జానపద కళాకారులతో కలిసి నృత్యం చేస్తున్న పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.
    12:23 PM, 15 Aug

    ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జాతీయ జెండాను ఎగురవేశారు.
    12:08 PM, 15 Aug

    రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన భార్య నీతా అంబానీ, మనవడు పృథ్వీ అంబానీతో కలిసి స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు.
    11:53 AM, 15 Aug

    జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.
    11:49 AM, 15 Aug

    స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
    11:44 AM, 15 Aug

    స్వాతంత్య్ర దినోత్సవం రోజున జమ్మూకాశ్మీర్ ఆర్ఎస్ పురాలోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద BSF దళాలు, పాకిస్తాన్ రేంజర్స్ మధ్య స్వీట్లు పంచుకున్నారు.
    11:43 AM, 15 Aug

    జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శ్రీనగర్‌లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
    11:41 AM, 15 Aug

    ఐటీబీపీ జవాన్లు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న దృశ్యం.
    11:24 AM, 15 Aug

    ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఐఎన్‌ఎస్ సుమేధ జాతీయ జెండాను ఎగురవేశారు.
    READ MORE

    English summary
    Independence Day 2022 Celebrations LIVE Updates In Telugu: PM Narendra Speech from Red Fort.
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X