వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నారులతో మోడీ కరచాలనం.. ప్రధానిగా భేషజాలు లేకుండా..! (వీడియో)

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు దేశమంతటా ఘనంగా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోటపై మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అంతకుముందు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. త్రివర్ణ పతాకం ఎగురవేసిన అనంతరం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ప్రసంగం తర్వాత ఆయన పిల్లల దగ్గరకు వెళ్లి ముచ్చటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

<strong>భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా</strong>భారత్‌కు అంతర్జాతీయంగా మంచిపేరు.. ఇండిపెండెన్స్ డే గ్రీటింగ్స్ తెలిపిన రష్యా

ఎర్రకోటలో జెండా ఆవిష్కరించిన అనంతరం పిల్లల దగ్గరకు వెళ్లారు మోడీ. వారితో ముచ్చటిస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆయనతో కరచాలనం చేసేందుకు పిల్లలు ఎగబడ్డారు. మోడీని దగ్గరగా చూస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఎప్పటిలాగానే ఈసారి కూడా ప్రసంగం తర్వాత పిల్లల్ని కలిశారు. కరచాలనం చేసేందుకు పిల్లలు ఎగబడ్డా కూడా ఓపికతో అందరినీ అప్యాయంగా పలకరిస్తూ ప్రతి ఒక్కరికి షేక్‌హ్యాండ్ ఇచ్చారు.

Independence Day celebrations at red fort PM Modi meets children

ముందు వరుసలో కూర్చున్న పిల్లలతో మోడీ మాట్లాడుతున్న సందర్భంలో కాస్తా దూరంలో ఉన్న మరికొంతమంది పిల్లలు ఆయనతో కరచాలనం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే చిరునవ్వుతో వారందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరితో అప్యాయంగా మాట్లాడే ప్రయత్నం చేశారు.

ఎర్రకోటపై ఇప్పటివరకు ప్రధానమంత్రి హోదాలో ఆరుసార్లు జెండా ఆవిష్కరించారు నరేంద్ర మోడీ. బీజేపీ నేతల్లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి రికార్డు తిరగరాశారు. గతంలో 1998 నుంచి 2003 వరకు వరుసగా ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేశారు వాజ్‌పేయి. అలా ఎర్రకోటపై ఆరుసార్లు త్రివర్ణ పతాకం ఎగురవేసిన బీజేపీ నేతల్లో మోడీ రెండో వ్యక్తిగా నిలిచారు.

English summary
Prime Minister Narendra Modi meets children at Red Fort on the occasion of 73rd Independence Day. Earlier, PM Modi addressed the nation from Red Fort. PM Modi announced that India will have a Chief of Defence Staff in order to strengthen the forces. He further urges fellow citizens to help improve the tourism sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X