• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

4వ శక్తిమంతమైన దేశంగా భారత్ - ‘ఆసియా-పసిఫిక్’లో అమెరికా-చైనా పోటాపోటీ - గేమ్ ఛేంజర్ కరోనా

|
Google Oneindia TeluguNews

ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భారత్ నాలుగో శక్తిమంతమైన దేశంగా నిలిచింది. ఇప్పటికీ అమెరికానే ఈ రీజియన్ లో శక్తిమంతమైన దేశంగా కొనసాగుతుండగా, రెండో పవర్ ఫుల్ దేశంగా ఉన్న చైనా అతి త్వరలోనే అమెరికాను తోసేసి మొదటి స్థానానికి చేరనుందని ప్రఖ్యాత అధ్యయన సంస్త 'లేవీ ఇనిస్టిట్యూట్' పేర్కొంది. సిడ్నీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే 'లేవీ ఇనిస్టిట్యూట్' తాజాగా 'ఆసియా పవర్ ఇండెక్స్ 2020' పేరుతో జరిపిన అధ్యయనం వివరాలను వెల్లడించింది. భారత్-చైనాకు సంబంధించి ఆసక్తికర విషయాలను పేర్కొన్నారు.

జై బాలయ్య: రూ.1.5 కోట్ల విరాళం - హైదరాబాద్ వరద బాధితులకు అండ - పాతబస్తీ వాసులకు బిర్యానీజై బాలయ్య: రూ.1.5 కోట్ల విరాళం - హైదరాబాద్ వరద బాధితులకు అండ - పాతబస్తీ వాసులకు బిర్యానీ

టాప్-10 పవర్ ఫుల్ దేశాలివే..

టాప్-10 పవర్ ఫుల్ దేశాలివే..

ఆసియా-పసిఫిక్ రీజియన్ లో మొత్తం 26 దేశాల ఆర్థిక స్థితిగతులు, దౌత్య సంబంధాలు, 21వ శతాబ్దంలో యుద్ధం, శాంతి తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. 82 శాతం స్కోరుతో అమెరికా ఫస్ట్ ర్యాంకులో, 76 శాతం స్కోరుతో చైనా రెండో స్థానంలో నిలిచాయి 41 స్కోరుతో జపాన్ 3వ ప్లేసులో నిలవగా, 40 పాయింట్లతో భారత్ నాలుగో ర్యాంకును పొందింది. రష్యా(34పాయింట్లు), ఆస్ట్రేలియా(32), సౌత్ కొరియా(32), సింగపూర్(27), థాయిలాండ్(21), మలేసియా 21పాయింట్లతో 10వ ర్యాంకులో నిలిచాయి.

కరోనానే గేమ్ ఛేంజర్..

కరోనానే గేమ్ ఛేంజర్..

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు అన్ని దేశాల ఆర్థిక స్థితిగతులు తారుమారయ్యాయని, కొవిడ్ నియంత్రణ, దాని పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించడంలో అమెరికా వైఫల్యం చైనాకు అనుకూలంగా మారబోతున్నదని లేవీ ఇనిస్టిట్యూట్ అంచనా వేసింది. బహుళవాణిజ్య విధానంలో ట్రంప్ తీసుకున్న తెంపరి నిర్ణయాలు, పలు ఒప్పందాలు, కూటముల నుంచి వైదొలగడానికి తోడు కరోనా ఎఫెక్ట్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ 2424కుగానీ గాడినపడబోడదని, ఆలోగా చైనా మొదటి స్థానానికి చేరి, ఏషియా-పసిఫిక్ రీజియన్ లో మోస్ట్ పవర్ ఫుల్ దేశంగా నిలుస్తుందని అధ్యయన సంస్థ తెలిపింది. కరోనా పుట్టుకకు కారణమంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, మహమ్మారి కొనసాగిన కాలంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకున్న ఏకైక దేశం చైనాయే అని, కరోనా కాలంలో మిగతా దేశాల ఎకానమీ పాతాళం వైపునకు, చైనా మాత్రం పైపైకి ప్రయాణించడం గమనార్హమని ఏజెన్సీ పేర్కొంది.

 భారత్-చైనా పవర్ ఫైట్

భారత్-చైనా పవర్ ఫైట్

ఆసియా పవర్ ఇండెక్స్ లో జపాన్ తరువాత నాలుగో స్థానంలో ఉన్న భారత్.. కరోనావైరస్ కారణంగా తీవ్రంగా దెబ్బతినిందని,సైనిక వ్యూహాలలో మాత్రం ఇండియా.. చైనాను దెబ్బకొట్టగలిగిందని అధ్యయన సంస్థ తెలిపింది. ఏజెన్సీ తెలిపింది. అయితే, భారత్ లాంటి పొరుగు దేశాలకు షాకిస్తూ ఈ దశాబ్దం ముగిసేలోగా చైనా పవర్ ఫుల్ దేశంగా ఎదుగుతుందని, 2030నాటికి చైనా ఆర్థిక వృద్ధిలో కేవలం 40 శాతం మాత్రమే భారత్ సాధించగలదని అధ్యయన సంస్థ పేర్కొంది.

ట్రంప్ గెలుపు చైనాకు ప్లస్

ట్రంప్ గెలుపు చైనాకు ప్లస్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లేనని రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేస్తోన్న ఆరోపణ వాస్తవంలో పూర్తి రివర్స్ గా ఉన్నట్లు ‘లేవీ ఇనిస్టిట్యూట్' అధ్యయనంలో తేలిసింది. ఇష్టారీతిగా వాణిజ్య ఒప్పందాల నుంచి వైదొలుగుతోన్న ట్రంప్ మళ్లీ గెలిస్తే.. అమెరికా అవసరం లేకుండానే ఆర్థిక, ఇతర కార్యకలాపాలు నిర్వహించుకోవడాన్ని ఆసియా దేశాలు అలవాటు చేసుకుంటాయి. ఇది పరోక్షంగా చైనాకు ప్లస్ అవుతుంది. ఒకవేళ జోబైడెన్ గెలిస్తే.. ఆసియాలోని మెజార్టీ దేశాలు అమెరికాతో వ్యాపారం చేయడానికి మరింత ఆసక్తి చూపుతాయి. అంటే బైడెన్ నెగ్గితే చైనా సూపర్ పవర్ గా ఎదగడంలో కచ్చితంగా ఆలస్యం నెలకొనే అవకాశాలున్నాయి.

 భారత్‌కు ఆ సత్తా ఉన్నా..

భారత్‌కు ఆ సత్తా ఉన్నా..


ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత శక్తిమంతమైన దేశంగా అవతరించేందుకు భారత్ కు పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని, అయితే ఆ దిశగా భారత్ ఆర్థిక, అభివృద్ధి సవాళ్లతోపాటు దేశీయంగా పేదరికాన్ని నిర్మూలించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాల్సి ఉంటుందని, అదే సమయంలో దౌత్యనీతిని మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరత ఏర్పడుతుందని ‘లేవీ ఇనిస్టిట్యూట్' పేర్కొంది.

కరోనాపై కేంద్రం షాకింగ్ ప్రకటన - వైరస్ సామూహిక వ్యాప్తి నిజమే - కేరళపై హర్షవర్ధన్ విమర్శలుకరోనాపై కేంద్రం షాకింగ్ ప్రకటన - వైరస్ సామూహిక వ్యాప్తి నిజమే - కేరళపై హర్షవర్ధన్ విమర్శలు

English summary
India, the fourth most powerful nation on the index after Japan, lost economic growth potential in the pandemic and is also ceding strategic ground to Beijing. China is closing in on the US as the most powerful country influencing the Asia-Pacific, as America's handling of the Covid-19 pandemic tarnishes its reputation, a study showed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X