వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసహనమంటూ: రైటర్స్‌పై తస్లీమా నస్రీన్ ఘాటుగా

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారతదేశం... ఒక అసహన దేశమని, ఇక్కడ కొంతమంది అసహనవాదులు తిష్టవేసుకుని ఉన్నారని ప్రముఖ బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆదివారం కఠిన వ్యాఖ్యలు చేశారు. హిందూ ఛాందసవాదాన్ని, ముస్లిం విధానాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఒక ఉదంతాన్ని గుర్తు చేస్తూ... ప్రతీ సమాజంలోనూ కొంతమంది అసహనవాదులు ఉంటారని, అయితే వ్యక్తిగత అభిప్రాయాలను వెలిబుచ్చేందుకు ప్రతీ ఒక్కరికీ హక్కు ఉందని చెప్పారు. భారత్‌లో రచయితలకు పూర్తి స్వేచ్ఛ ఉందని చెప్పారు.

India a tolerant country, Taslima Nasreen says

విమర్శిస్తే అసహనమా: అన్సారీ

విమర్శించడం, ప్రశ్నించడాలపై సమాజంలో అసహనం కనిపిస్తోందనీ, ఆ కారణంవల్లనే కొందరిని దూరంగా పెట్టడం, హతమార్చడం వంటివి చోటు చేసుకుంటున్నాయని ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ వేరుగా ఢిల్లీలో అన్నారు. మన కుటుంబాల్లో కూడా ప్రశ్నించడాన్ని అంగీకరించలేమన్నారు. పిల్లలు ప్రశ్నిస్తే ఇంట్లో పెద్దలకు, బడిలో ఉపాధ్యాయులకూ కోపం వచ్చేస్తుందన్నారు.

హిందూ సంస్కృతే మన గుర్తింపు: భగవత్‌

హిందూ సంస్కృతే భారతదేశ గుర్తింపని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘ్‌చాలక్ మోహన్‌ భగవత్‌ బెంగళూరులో అన్నారు. అందుకే మన దేశానికి హిందూ దేశం అనే పేరొచ్చిందన్నారు. భారత్‌ అంటే ఏదో కొంత భూభాగం పేరు మాత్రమే కాదని అన్నారు.

English summary
India is a tolerant country with a few intolerant people and it is time to focus not just on Hindu fundamentalists but on Muslim fundamentalists as well, Bangladeshi author Taslima Nasreen said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X