వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుల్ భూషణ్‌కు కాన్సులర్ యాక్సెస్: పాక్ ఆఫర్‌ను అంగీకరించిన భారత్, నేడే భేటీ

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: పాకిస్థాన్ చెరలో బందీగా ఉన్న భారత నావికా దళ విశ్రాంత అధికారి కుల్ భూషణ్ జాదవ్ కు రాయబార అనుమతి(కాన్సులర్ యాక్సెస్) పాకిస్థాన్ ఆదివారం సంసిద్ధత వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అప్పుడు పాకిస్థాన్ ఆఫర్‌ను తిరస్కరించిన భారత్.. సోమవారం మనసు మార్చుకుని అంగీకారం తెలిపింది.

రేపే కుల్‌భూషన్ జాదవ్‌కు కాన్సులేట్ యాక్సెస్... నిబంధనలతో కూడిన యాక్సెస్‌ను అంగీకరించమన్న భారత్రేపే కుల్‌భూషన్ జాదవ్‌కు కాన్సులేట్ యాక్సెస్... నిబంధనలతో కూడిన యాక్సెస్‌ను అంగీకరించమన్న భారత్

ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పేరా1(బీ) ప్రకారం.. కుల్ భూషణ్ జాదవ్ కు కాన్సులర్ అనుమతి జారీ చేశామని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ సైన్యం 2014లో కుల్ భూషణ్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక, అతడికి మరణశిక్ష కూడా విధించింది పాక్ మిలిటరీ కోర్టు సిద్ధమైంది.

India accepts Pakistan offer of consular access to Kulbhushan Jadhav; hopes for free, fair meet

ఈ క్రమంలో భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో పాక్ మిలిటరీ కోర్టు విధించిన మరణ శిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం నిలిపివేసింది. అంతేగాక, పాక్ వ్యవహారాన్ని తప్పుబట్టింది. వియన్నా ఒప్పందం ప్రకారం కుల్ భూషణ్ కు కాన్సులర్ అనుమతి ఇవ్వాల్సిందేనని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం కుల్ భూషణ్ కు కాన్సులర్ యాక్సెస్ ఇస్తున్నామంటూ పాకిస్థాన్ ప్రకటించింది. మొదట ఆంక్షలు లేకుండా అనుమతివ్వాలని కోరిన భారత్.. తర్వాత కాన్సులర్ యాక్సెస్‌కి అంగీకరిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. సోమవారం మధ్యాహ్నం 12గంటల నుంచి రెండు గంటలపాటు భారత అధికారులు జాదవ్ ను కలవనున్నారు.

ఐసీజే ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని పాక్ స్వేచ్ఛగా సాగనిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ అభిప్రాయపడింది. భారత డిప్యూటీ హైకమిషనర్ గౌరవ్ అహ్లూవాలియా.. కుల్ భూషణ్ ను సోమవారం కలవనున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

English summary
India has accepted Pakistan offer for consular access to detained former navy officer Kulbhushan Jadhav on Monday. Indian officials are likely to meet Kulbhushan Jadhav today for two hours starting 12 pm
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X