వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

1 బిలియన్ డోస్ కంప్లీట్: మోడీ అభినందనలు.. బూస్టర్ డోసు‌పై పూనావాలా..?

|
Google Oneindia TeluguNews

కరోనాకు టీకాయే శ్రీ రామ రక్ష. అందుకే హెల్త్ వర్కర్స్‌ ఇంటికెళ్లి మరీ టీకా వేస్తున్నారు. దేశంలో 100 కోట్ల టీకాలు వేశారు. దేశంలో 1.3 బిలియన్ ప్రజలు టీకా వేసుకున్నారు. వీరిలో 30 శాతం మంది పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రధాని మోడీ రాం మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లారు. 100 కోట్ల టీకాలు వేసుకున్న సందర్భంగా అభినందనలు తెలియజేశారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో ఎక్కువ టీకాలు తీసుకున్నారు. 9 నెలల్లో వంద కోట్ల టీకాలు వేయడం రికార్డ్ అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. 75 శాతం మందికి ఫస్ట్ డోస్ పూర్తయ్యిందని.. 25 శాతం యువత వేసుకోవాల్సి ఉందన్నారు.

మైల్ స్టోన్

మైల్ స్టోన్


కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఇదో ఓ మైలురాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ అదర్‌ పూనావాలా అన్నారు. వచ్చే రెండు నెలల్లో దేశం మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బూస్టర్‌ డోస్‌పై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది ప్రారంభంలో అవసరం ఉన్న వారికి బూస్టర్‌ డోస్‌ వేసే అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు తగినన్ని డోసులు అందుబాటులో ఉంటాయన్నారు.

రెండు డోసులు

రెండు డోసులు

ప్రపంచ దేశాలకు, ప్రత్యేకించి ఆఫ్రికా దేశాలకు రెండు మోతాదులు టీకా అందాలని పూనావాలా పేర్కొన్నారు. ఆఫ్రికా అంతటా కనీసం మూడు శాతం టీకాలు అందలేదని, ఇక్కడ రెండు డోసుల తర్వాత బూస్టర్‌ డోస్‌పై మాట్లాడుతున్నారని తెలిపారు. వృద్ధులు, అవసరమైన వారికి బూస్టర్‌ డోసు తగినన్ని మోతాదులు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న వారు, యువత మాత్రం ప్రపంచం రెండు డోసులు పొందేవరకు వేచి ఉండాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి వేగంగా సాగుతుండడంతో రెండు మోతాదులకు తీసుకునే వారి సంఖ్య సంవత్సరం చివరినాటికి పెరుగుతుందన్నారు.

వైరస్ ఇంపాక్ట్

వైరస్ ఇంపాక్ట్

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. వైరస్‌ను జయించేందుకు రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనిపై ప్రకటన రాలేదు.

Recommended Video

Germany: Pilots Return To Work To Cover Tourism Demand
 పకడ్బందీగా..

పకడ్బందీగా..


ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు డిసెంబర్ వరకు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దానిని దాటేస్తే గానీ.. పరిస్థితి ఏంటో చెప్పలేమని ఒకవిధంగా వార్నింగ్ ఇస్తున్నారు.

English summary
India reached the one billion COVID-19 vaccinations milestone this morning. The government wants all of India's 944 million adults to get vaccinated this year
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X