వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అణుబాంబులు ప్రయోగించం .. కానీ పరిస్ధితులు ప్రభావం చేస్తే తప్ప అని రాజ్‌నాథ్ కామెంట్

|
Google Oneindia TeluguNews

జైపూర్ : అణు బాంబులు ఉపయోగించబోమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం చెప్పలేమని కామెంట్ చేశారు. రాజస్థాన్ జైసల్మేర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చానీయాంశమయ్యాయి. కశ్మీర్ విభజనతో నెలకొన్న ఉత్కంఠతో రాజ్‌నాథ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

అణ్వస్త్రాలు వినియోగంచొద్దని భారతదేశ విధానమని చెప్పారు. దీనికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. అయితే భవిష్యత్‌లో ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు. దీంతో రాజ్‌నాథ్ కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. భారత్‌ను అణ్వస్త్ర శక్తిగా మార్చాలని అప్పటి ప్రధాని అటల్ బీహరి వాజ్ పేయి భావించారని పేర్కొన్నారు. అందుకోసమే పోఖ్రాన్‌లో ప్రయోగించామని పేర్కొన్నారు. రాజస్థాన్‌లోని జై సల్మేర్‌లో ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొని ట్వీట్ చేశారు.

India adhered to nuclear no first use, says Rajnath Singh. Then, a twist

వాజ్ పేయి ప్రథమ వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు. వాజ్ పేయికి రాజ్ నాథ్ నివాళులర్పించారు. భారత్ బాధ్యతాయుత అణ్వస్త్ర శక్తిగా అవతరించడం దేశంలోని ప్రతిపౌరుడు గర్వించదగ్గ విషయమన్నారు. దీనికి వాజ్‌పేయికి దేశం ఎప్పుడూ రుణపడి ఉంటుందన్నారు. 1998లో వాజ్ పేయి ప్రధాని బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల్లో పోఖ్రాన్‌లో భూగర్భ అణు పరీక్షలు నిర్వహించారు.

English summary
Defence minister Rajnath Singh said on Friday India stood by its current “no first use policy” on nuclear weapons but its stance may see a shift in the future. Rajnath Singh tweeted his remarks during his visit to Rajasthan’s Pokhran, which is the site of two nuclear tests by India in 1974 and 1998. Former prime minister Atal Bihari Vajpayee was at the helm of the Bharatiya Janata Party (BJP) government when the second round of test was held. “Pokhran is the area which witnessed Atal Ji’s firm resolve to make India a nuclear power and yet remain firmly committed to the doctrine of ‘No First Use’. India has strictly adhered to this doctrine. What happens in future depends on the circumstances,” the defence minister tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X