వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అజిత్ దోవల్ రహస్య మంతనాలు -భారత్, పాకిస్తాన్ సైన్యాల కీలక నిర్ణయం -ఇకపై సరిహద్దులో..

|
Google Oneindia TeluguNews

చరిత్రపొడవునా కలిసుండి, 1947లో రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య నిత్యం తగవులు, తరచూ కాల్పులు, మూడు సార్లు యుద్ధాలు కూడా తలెత్తిన సంగతి తెలిసిందే. కార్గిల్ యుద్ధం తర్వాత సరిహద్దులో శాంతి స్థాపనే ధ్యేయంగా రెండు దేశాల మధ్య 2003లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందానికి తూట్లు పొడుతూ పాక్ బలగాలూ ఇప్పటికీ కాల్పులకు తెగబడుతుండటం, భారత బలగాలు సైతం ధీటుగా జవాబిస్తుండటం పరిపాటిగా మారింది. అయితే, బుధవారం రాత్రి నుంచి మాత్రం సరిహద్దు వెంబడి పరిస్థితులు అకస్మాత్తుగా మారిపోయాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రహస్యంగా జరిపిన మంతనాలు ఫలించాయి..

మోదీ సర్కార్ మరో సంచలనం -న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలకు కళ్లెం -24 గంటల్లో తొలగించాలిమోదీ సర్కార్ మరో సంచలనం -న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా, ఓటీటీలకు కళ్లెం -24 గంటల్లో తొలగించాలి

భారత్-పాక్ కీలక అంగీకారం..

భారత్-పాక్ కీలక అంగీకారం..

దాయాదులుగా ఉన్న భారత్, పాకిస్తాన్ దేశాలు మరోమారు శాంతి బాటను పట్టాయి. రెండు దేశాల సైన్యాలు గురువారం ఓ సంచలన నిర్ణయానికి వచ్చాయి. జమ్మూకాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి ఇకనుంచి కాల్పులు జరుపుకోకూడదని పరస్పర అంగీకారానికి వచ్చాయి. అలాగే, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కూడా ఎలాంటి ఉద్రిక్తతలకు తావు ఇవ్వరాదని నిర్ణయించుకున్నాయి. ఎల్ఓసీ వెంబడి తరచూ కాల్పులు జరుగుతోన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక ప్రకటన కూడా జారీ అయింది..

అధికారిక ప్రకటన..

అధికారిక ప్రకటన..

''ఇరు దేశాలు పరస్పరం ప్రయోజనం పొందడానికి, స్థిరమైన శాంతిని సాధించాలన్న ఆసక్తితో ఈ నిర్ణయం తీసుకున్నాం. హింసకు దారితీసే పరిస్థితుల వల్ల తరుచూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. దీంతో డీజీఎస్‌ఎంవో స్థాయిలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.'' అని ఇరు దేశాల అధికారులు గురువారం ఒక ప్రకటన చేశారు. తాజాగా కుదిరిన అంగీకారంతో ఈనెల 24(బుధవారం) అర్ధరాత్రి నుంచి సరిహద్దుకు రెండు వైపులా కాల్పులు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ పరస్పర అంగీకారం ద్వారా నియంత్రణ రేఖ వెంబడి హింస తగ్గుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, పరస్పర అంగీకారం కుదిరినప్పటికీ, నియంత్రణ రేఖ వెంబడి మాత్రం భారత్ బలగాలను మోహరించే ఉంటాయని, అక్రమ చొరబాట్లను నియంత్రించడానికే మోహరింపు కొనసాగింస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా,

 అజిత్ దోవల్ రహస్య మంతనాలు..

అజిత్ దోవల్ రహస్య మంతనాలు..

ముంబై ఉగ్రదాడులతో దెబ్బ తిన్న భారత్, పాక్ సంబంధాలు.. ఉరి ఉగ్రదాడి, పుల్వామా దాడి తర్వాత పూర్తిగా క్షీణించాయి. పాకిస్తాన్ కు కల్పించిన అన్ని ప్రయారిటీలను రద్దు చేసిన భారత్.. అంతర్జాతీయంగా దాని తీరును ఎండగట్టింది. ఈక్రమంలో సరిహద్దు వద్ద హింస నానాటికీ తీవ్రతరం అవుతూ వచచింది. ఈ నేపథ్యంలో హింసను నివారించే దిశగా, 2003నాటి కాల్పుల విరమణ ఒప్పందం పక్కాగా అమలయ్యేలా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. పాకిస్తాన్ తో రహస్య మతనాలు చేశారని, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భద్రతా సలహాదారు మొయీద్ యూసుఫ్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపారని, ఆయన కృషి వల్లే రెండు దేశాల సైన్యాలు గురువారం నాటి ప్రకటనను వెలువరించాయిని తెలుస్తోంది. దోవల్ సీక్రెట్ టాక్స్ ముచ్చట ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, విదేశాంగ మంత్రి జైశంకర్‌ లాంటి అతి కొద్ది మందికే తెలుసని ఢిల్లీ వర్గాలు పేర్కొన్నాయి.

చీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీచీకట్లో ఉంచి పూజలు.. దెబ్బతిన్న పేగులు, లివర్ -ఘట్‌కేసర్ బీఫార్మసీ విద్యార్థిని ఉదంతంలో మిస్టరీ

English summary
India and Pakistan’s militaries Thursday announced that they have agreed to stop firing along the Line of Control (LoC) in Jammu and Kashmir and other areas with effect from the midnight of February 24-25. NSA Doval led secret back-channels talks with Pak for months before DGMO pact
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X