వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష మరణాలను దాటిన మూడవ దేశంగా భారత్ .. కొనసాగుతున్న కరోనా బీభత్సం

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . కోవిడ్ -19 కారణంగా అమెరికా, బ్రెజిల్ మరణాల తర్వాత ప్రపంచంలో అత్యధిక మరణాలను నమోదు చేసిన మూడవ దేశంగా భారత్ నిలిచింది. శుక్రవారం, దాదాపు 1,076 తాజా మరణాలు సంభవించాయి . దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాలు 1,00,800 కు చేరుకున్నాయి.భారతదేశం గత కొద్ది రోజుల నుండి 80,000 కేసులను నమోదు చేస్తుంది . ఏదేమైనా, తాజాగా గత 24 గంటల్లో నమోదైన రోజు వారీ కేసుల సంఖ్య 80,446 కాగా , భారతదేశం యొక్క మొత్తం కోవిడ్ -19 కేసులు తాజాగా 64,71,244 గా నమోదయ్యాయి . ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు ఇప్పటికీ 9.5 లక్షల వద్ద ఉన్నాయి .

కరోనా ప్రభావంతో తల్లక్రిందులైన జీవితం .. కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్కరోనా ప్రభావంతో తల్లక్రిందులైన జీవితం .. కూరగాయలు అమ్ముకుంటున్న డైరెక్టర్

కరోనా మరణాలలో అమెరికా , బ్రెజిల్ తర్వాత స్థానంలో భారత్

కరోనా మరణాలలో అమెరికా , బ్రెజిల్ తర్వాత స్థానంలో భారత్

అమెరికాలో మరణించిన వారి సంఖ్య భారతదేశంతో పోలిస్తే 2.1 లక్షలకు పైగా ఉంది, బ్రెజిల్ లో 1.4 లక్షలకు పైగా మరణాలు నమోదు అయ్యాయి . ఏదేమైనా, గత రెండు నెలల్లో, భారతదేశంలో ప్రపంచంలోనే అత్యధిక మరణాలు సంభవించాయి . అతితక్కువ కాలంలో ఎక్కువ మరణాలు సంభవించాయి . ఈ రెండు నెలల కాలంలో దేశంలో మరణించిన వారిలో దాదాపు 63% మంది ఉన్నారు. భారతదేశం సెప్టెంబరులో 33,255 కోవిడ్ -19 మరణాలను నివేదించింది, రోజువారీ సగటు 1,100 కంటే ఎక్కువగా ఉంది .

ఇండియా మరణాల రేటు 1.6 శాతం

ఇండియా మరణాల రేటు 1.6 శాతం

కరోనా కారణంగా అన్ని కోణాల నుండి చూస్తే తీవ్రంగా నష్టపోయిన 20 దేశాలలో భారతదేశం 18 వ స్థానంలో ఉంది. భారతదేశం యొక్క మరణాల రేటు 1.6 వద్ద ఉంది, ముఖ్యంగా యుఎస్ 2.8 శాతం , బ్రెజిల్ 3 శాతం , మెక్సికో 10.4 శాతం , యుకె 9.2 శాతం , మరియు పాకిస్తాన్ 2.1 గా ఉంది. రాబోయే పండుగ సీజన్ ఆరోగ్య అధికారులను ఆందోళనకు గురిచేస్తుంది. వచ్చేది శీతాకాలం కావటంతో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతాయన్న ఆందోళన కలుగుతుంది . భారతదేశం యొక్క పొరుగు దేశాలలో భారతదేశం కంటే తక్కువగా మరణాల రేటు ఉంది . బంగ్లాదేశ్ 1.4 శాతం , నేపాల్ 0.6 శాతం మరియు శ్రీలంక 0.4శాతం గా ఉంది.

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం .. కేరళలో కరోనా పంజా

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా బీభత్సం .. కేరళలో కరోనా పంజా

కేరళలో మహమ్మారి పంజా విసురుతుంది. కేరళ రాష్ట్రంలో ఒక్క శుక్రవారం 9,258 తాజా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో రోజువారీ సంఖ్య 9,000 కు పైగా నమోదు కావటం ఇదే మొదటిసారి. మహారాష్ట్ర వరుసగా ఆరో రోజు 20,000 కంటే తక్కువ కేసులు నమోదు చేస్తుంది. గత 24 గంటల్లో మొత్తం 15,591 కొత్త కేసులు నమోదయ్యాయి, రాష్ట్రంలో మొత్తం 14,16,513 కు చేరుకుంది, 424 మరణాలతో మొత్తం మరణాల సంఖ్య 37,480 కు చేరుకుంది.

Recommended Video

Top News : Ys Jagan About Volunteers | Trump Covid Positive | ITR Last Date | CSK Vs SRH

English summary
India has become the third country in the world after the US and Brazil to record 1 lakh deaths due to Covid-19. On Friday, nearly 1,076 fresh fatalities took the nationwide toll to over 1,00,800.However, in the past two months, India has reported the highest number of fatalities in the world, with nearly 63% of all deaths in the country coming during this period.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X