వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: స్టేజీ-2 నుంచి స్టేజీ-3 మధ్య వైరస్, కొన్ని ప్రాంతాలు రెడ్ జోన్: ఎయిమ్స్ డైరెక్టర్

|
Google Oneindia TeluguNews

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండటం భయాందోళన కలిగిస్తోంది. వ్యాధి మరింత విస్తరించకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం మూడువారాల పాటు లాక్‌డౌన్ విధించినా.. పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో కరోనా స్టేజీ-2 లో ఉందని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని నిపుణులు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎయిమ్స్ డైరెక్టర్ మాత్రం దేశంలో వైరస్ స్టేజీ 2 నుంచి స్టేజీ 3 మధ్య ఉందని బాంబ్ పేల్చాడు.

Recommended Video

CoronaVirus Latest Updates | Helpline Number | Symptoms & Precautions

దేశంలో కరోనా వైరస్ స్టేజీ-2 నుంచి స్టేజీ-3 మధ్యలో ఉంది అని ఎయిమ్స్‌ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ఇందుకు కారణం సామాజిక దూరం పాటించకపోవడమే అని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్టేజీ 2లో ఉందని పేర్కొన్నారు. ఇందుకు కారణం.. అక్కడి సోషల్ డిస్టన్స్ మెయింటైన్ చేయడం అని వివరించారు.

India between Stage 2 and Stage 3 in coronavirus: aiims director

మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం వైరస్ విస్తరిస్తోందని చెప్పారు. వైరస్ సోకిన వారు ఆయా ప్రాంతాల్లో సంచరించడంతో వ్యాధి ప్రబలిందని పేర్కొన్నారు. అందుకోసమే కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించారని గుర్తుచేశారు. మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. స్టేజీ 3కి వైరస్ సోకిన తర్వాత అదుపు చేయడం అంతా ఈజీ కాదు. అందుకోసమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. కొన్ని చోట్ల రాత్రి సమయాల్లో కర్ఫ్యూ కూడా కొనసాగుతోంది.

English summary
"We are somewhere between stage 2 and stage 3. Most parts of the country are in Stage 2 while some hotspots have seen localised community transmission." aiims director said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X