వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ విభజనపై పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు పావులు కదుపుతున్న భారత్

|
Google Oneindia TeluguNews

జమ్ము కశ్మీర్ విభజన అంశాపై పాకిస్థాన్‌ను ఒంటరి చేసేందుకు భారత ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కశ్మీర్‌ను విభజించడంతోపాటు ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఇప్పటికే పాకిస్థాన్ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. ఈనేపథ్యంలోనే భారత ప్రభుత్వం తీసుకున్న చారీత్రత్మాక నిర్ణయం పై ఎలాంటీ అవరోధాలు లేకుండా ముందు జాగ్రత్ర చర్యలు తీసుకుంటుంది.

ఇందులో భాగంగానే కశ్మీర్ విషయంపై పెద్దన్న పాత్ర పోషించేందుకు ముందుకు వస్తామని ప్రటకించింది. దీంతో పాకిస్థాన్ కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చీత్రికరించేందుకు చేసే ప్రయత్నాలను భారత్ తిప్పికొడుతోంది.మరోవైపు భారత్‌లో జరుగుతున్న పరిణామాలను క్షుణ్ణంగా పరీశీలిస్తున్న నేపథ్యంలోనే భారత విదేశాంగశాఖ.. ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా రాయబారులకు కశ్మీర్ పరిణామాలను తెలియజేసింది.

మరోవైపు కశ్మీర్ పరిణామాలపై యూఎన్ఓ దృష్టి సారించాలని పాకిస్థాన్ ఇప్పటికే కొరిన నేపథ్యంలోనే కశ్మీర్ పరిణామాలను యూఎన్ఓకు సైతం వివరించింది. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజనకు గల కారణాలను వివరించింది. ఈ చర్యలు కశ్మీర్‌లో సుపరిపాలనకు దోహం చేస్తాయని ఐక్యరాజ్యసమితికి భారత్ వివరించింది. దీంతో కశ్మీర్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి భారత్‌కు సూచించారు.

India briefs UN Security Council on scrapping of special status to J&K

కాగా ఇప్పటికే భారతదేశంలో జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు తెలుపుతున్నాయి. ఈ సంధర్భంగా కశ్మీర్ అంశం భారత అంతర్గత అంశంగా పేర్కోన్నాయి. ఈనేపథ్యంలో ఎల్‌వోసీ వెంట శాంతి సుస్థిరతలకు కృషి చేయాలని ఆమేరికా సూచించగా శ్రీలంక భారత నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపింది.

English summary
India briefed all current members of the UN Security Council –five permanent members and 10 non-permanent members
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X