వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌ నుండి వెళ్లే సంఝౌతా ఎక్స్‌ప్రెస్ రద్దు...

|
Google Oneindia TeluguNews

పాకిస్థాన్ నుండి భారత్ వచ్చే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను పాకిస్థాన్ రద్దు చేయడంతో భారత దేశం కూడ ఢిల్లీ నుండి లాహోరు వెళ్లే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేసినట్టు భారత రైల్వే అధికారులు ఆదివారం సాయంత్రం ప్రకటించారు. కాగా పాకిస్తాన్ నుండి వచ్చే రైలును రద్దు చేయడంతో భారత అధికారులు అదే నిర్ణయాన్ని తీసుకున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

India cancelled the operation of Samjhauta Express from sunday

కాగా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేయడంతో పునర్విభజన చేపట్టడడంతో పాకిస్థాన్ గత మూడు రోజుల క్రితం లాహోర్ నుండి ఢిల్లీకి చేరుకునే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో థార్ ఎక్స్‌ప్రెస్‌ కూడ రద్దు చేశారు.ఇక ఈ రైలు సర్వీసు పాకిస్తాన్‌లోని ఖోక్రాపర్ నుంచి భారత్‌లోని మునాబా స్టేషన్ల మధ్య నడుస్తుంది. ఇక 1976 నుంచి వారానికి రెండు సార్లు ఢిల్లీ నుంచి లాహోర్‌కు నడిచే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ను గురువారం నిలిపివేసి... భారత్ నుంచి డ్రైవర్‌ మరియు గార్డులు వచ్చి రైలును ఇండియాకు తీసుకెళ్లాల్సిందిగా పాకిస్థాన్ రైల్వే మంత్రి రషీద్ ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు రవాణ సంబంధాలతో పాటు దేశ వ్యాపార, ద్వైపాక్షిక సంబంధాలను కూడ పున:పరీశీస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటించారు. అయితే పాకిస్థాన్ చేసిన ప్రకటనపై పునరాలోచించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఝప్తి చేసింది. కాని పాకిస్థాన్ కూడ భారత్ కశ్మీర్ పై తీసుకున్న నిర్ణయాలను సమీక్షించినప్పుడు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయాలపై సమీక్ష చేపడతామని పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రకటించింది. దీంతో రెండు దేశాల మధ్య పలు నిర్ణయాలు వెలువడుతున్నాయి.

English summary
India reportedly cancelled the operation of Samjhauta Express train service that runs between New Delhi and Lahore on Sunday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X