వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా బలమైన దేశమే కానీ, భారత్ ఏమీ తక్కువ కాదు: తేల్చేసిన బిపిన్ రావత్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చైనా బలమైన దేశం అయితే అవ్వొచ్చుకానీ, భారత్‌ బలహీనమైన దేశం కాదని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తేల్చిచెప్పారు. చైనా అన్ని విధాలా కట్టడి చేసే శక్తి తమకుందని స్పష్టం చేశారు.

తన భూభాగంలో దురాక్రమణకు దిగితే భారత్‌ సహించబోదని బిపిన్‌ రావత్‌ అన్నారు. భారత్‌ తూర్పు సరిహద్దులపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు.

India capable of handling China's assertiveness: Army Chief

తూర్పు సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న సరిహద్దు ఉల్లంఘనలను ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందన్నారు. చైనా ఇటీవల భారత సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.

భారత నిఘా నేత్రం కార్టోశాట్-2: పాక్‌కు ఇక వణుకేభారత నిఘా నేత్రం కార్టోశాట్-2: పాక్‌కు ఇక వణుకే

మన ప్రాంతంలో చైనా మన ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంటూ భారత పొరుగు దేశాలను మచ్చిక చేసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, భారత తన పొరుగు దేశాలను దూరం చేసుకోబోదని, చైనాకు అవి దగ్గర కాకుండా చూసుకుంటున్నదని ఆయన అన్నారు. అమెరికా హెచ్చరికలు పాకిస్థాన్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాల్సిందేని అన్నారు.

English summary
Asserting that China may be a powerful country but India is not a weak nation either, Army Chief General Bipin Rawat on Friday said India will not allow its territory to be invaded by anyone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X