వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భద్రతా దళాల గొప్ప విజయం.. సజీవంగా పట్టుబడిన మరో కసబ్!

భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. లష్కరే తొయిబా ఉగ్రవాది మహ్మద్ అమిర్ సజీవంగా పట్టుబడ్డాడు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో దాడులు చేయాలని లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని ఈ ఉగ్రవాది చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. ఇతని బృందంలో నలుగురైదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తెలుస్తోంది. అమిర్ పాకిస్తాన్‌లోని ముల్తాన్‌ ప్రాంతానికి చెందినవాడు.

mohmmad-amir

ఈనెల 24న జమ్మూ కశ్మీరు పోలీసులు, భద్రతా దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఇతనిని పట్టుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని జమ్మూ-కశ్మీరులోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు నిర్వహించడమే లక్ష్యంగా లష్కరే తొయిబా కుట్ర పన్నుతోందని అమిర్ వెల్లడించినట్లు సమాచారం.

లష్కరే తొయిబా ఉగ్రవాది, అంతర్జాతీయ ఉగ్రవాది, ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ ఇటీవలే పాకిస్తాన్‌లో గృహ నిర్బంధం నుంచి విడుదలైన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే అతను మాట్లాడుతూ భారత ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోరాదని భద్రతా నిపుణులు చెబుతున్నారు.

English summary
Just a day after the ninth anniversary of the dastardly 26/11 Mumbai attack Republic TV has learnt that in an unprecedented breakthrough, India has captured a Pakistani terrorist who had crossed over into Kashmir. The terrorist's name is Mohammad Amir and he has been taken into questioning after being handed over to the National Investigation Agency (NIA). He hails from Multan in Pakistan and is a member of the Lashkar-e-Taiba. He was apprehended in a joint operation by the Army (47 RR) and the Jammu and Kashmir Police in Handwara four days ago. As per Republic TV sources, the terrorist has revealed the sinister plot of the Lashkar-e-Taiba — plans that involve carrying out attacks in other parts of the country. He is also said to have named fellow LeT operators who are a part of this design. India's capture of a living terrorist, the fifth since Kasab, comes against the backdrop of Pakistan releasing Hafiz Saeed from what was already a sham house arrest. Saeed, the mastermind behind the 26/11 attack, has immediately announced his intent to resume his jihadist ways.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X