• search
  • Live TV
విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
LIVE

ఎర్రకోట నుంచి చైనాకు గట్టి హెచ్చరికలు చేసిన ప్రధాని మోడీ

|

ఆగష్టు 15.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు. గత 73 సంవత్సరాలుగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. కానీ ఈ సారి మాత్రం ఆ ఘనమైన వేడుకలు సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు కారణం కరోనావైరస్. ఈ మహమ్మారితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలపై చాలా రాష్ట్రాలు ఆంక్షలు విధించాయి. ఎప్పుడూ కొన్ని వేల మంది మధ్య ఘనంగా సాగే స్వాతంత్ర్య వేడుకలు.. ఈసారి మాత్రం ఆ జోష్ మాయమవుతోంది.

చాలా పరిమితి సంఖ్యలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ ప్రతి భారతీయుడు స్వాతంత్ర్యం కోసం పోరాడి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఆ త్యాగమూర్తులను స్మరించుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి మినిట్-టూ-మినిట్ లైవ్ అప్‌డేట్స్ మీకోసం...

India Celebrates 74th Independence day amid Coronavirus Live updates

Newest First Oldest First
7:02 PM, 15 Aug
అట్టారీ-వాఘా సరిహద్దు వద్ద కొనసాగుతోన్న బీటింగ్ రిట్రీట్
7:01 PM, 15 Aug
రాష్ట్రపతి ఎట్‌హోం కార్యక్రమానికి హాజరైన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్
7:00 PM, 15 Aug
ఢిల్లీ
రాష్ట్రపతి ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
2:13 PM, 15 Aug
గోవా
గోవాలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్
2:12 PM, 15 Aug
బీహార్
పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం నితీష్ కుమార్
2:12 PM, 15 Aug
హైదరాబాదు
మదీనా సర్కిల్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ
2:10 PM, 15 Aug
అస్సాం
గౌహతిలోని జడ్జెస్ ఫీల్డ్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అస్సాం ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్
2:09 PM, 15 Aug
ప్రధాని మోడీ చెప్పిన ఆత్మనిర్భర్ ఎంతగానో ఆలోచింపజేసింది. ఆత్మనిర్భర్‌లో బంగ్లాదేశ్‌ కూడా భాగస్వామి అయ్యేందుకు ప్రయత్నిస్తాం: భారత్‌లో బంగ్లాదేశ్ హైకమిషనర్ మొహ్మద్ ఇమ్రాన్
11:45 AM, 15 Aug
హైదరాబాదు
హైదరాబాదు
హైదరాబాదులోని తన నివాసంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
10:58 AM, 15 Aug
తెలంగాణ అసెంబ్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాక జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులు అర్పించిన స్పీకర్ పోచారం
10:44 AM, 15 Aug
ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన సీఎం అరవింద్ కేజ్రీవాల్
10:43 AM, 15 Aug
ఉత్తర్ ప్రదేశ్
లక్నోలో జాతీయ జెండాను ఎగురవేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్
10:42 AM, 15 Aug
తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా
10:41 AM, 15 Aug
అమృత్‌సర్
గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 65,002 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాగా 996 మంది మృతి చెందారు
అమృత్‌సర్‌లోని అటారీ-వాఘా సరిహద్దులో జాతీయ జెండాను ఎగురవేసిన ఐటీబీపీ చీఫ్ దేస్వాల్
10:38 AM, 15 Aug
చత్తీస్‌గఢ్
చత్తీస్‌గడ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం భూపేష్ భగేల్
10:37 AM, 15 Aug
జమ్మూ కశ్మీర్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన లెఫ్ట్‌నెంట్ జనరల్ మనోజ్ సిన్హా
10:36 AM, 15 Aug
ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
10:35 AM, 15 Aug
ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేసిన మాజీ కేంద్రమంత్రి బీజేపీ కురవృద్ధులు ఎల్‌కే అద్వానీ
10:12 AM, 15 Aug
హైదరాబాదు జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
9:59 AM, 15 Aug
అవినీతి వల్ల ప్రజలకు అందాల్సిన ఫలాలు అందకుండా పోతాయి. అందుకే రివర్స్ టెండరింగ్, జ్యుడీషియల్ ప్రివ్యూ తీసుకొచ్చాం: సీఎం జగన్
9:58 AM, 15 Aug
బీసీల కోసం శాశ్వత కమిషన్ వేసి చట్టం చేశాం:సీఎం జగన్
9:58 AM, 15 Aug
129 హామీల్లో 83 హామీలను పూర్తి చేశాం: సీఎం జగన్
9:57 AM, 15 Aug
14 నెలల సమయంలో నేరుగా ప్రజల ఖాతాల్లోకి రూ.59వేల కోట్లు డబ్బులను బదిలీ చేశాం:సీఎం జగన్
9:56 AM, 15 Aug
మేనిఫెస్టోలో లేకున్నప్పటికీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో 30 పథకాలను అమలు చేస్తున్నాం: సీఎం జగన్
9:56 AM, 15 Aug
ప్రభుత్వంలో ఔట్‌సోర్సింగ్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేశాం:సీఎం జగన్
9:55 AM, 15 Aug
ఎన్నికల మేనిఫెస్టోను బైబిల్‌‌గా ఖురాన్‌గా, భగవద్గీతగా చూస్తున్నాం: సీఎం జగన్
9:54 AM, 15 Aug
గత ప్రభుత్వం చెల్లించని బకాయిలను కూడా చెల్లించాం: సీఎం జగన్
9:54 AM, 15 Aug
కేబినెట్‌లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెద్ద పీట వేశాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇలా లేదు: సీఎం జగన్
9:53 AM, 15 Aug
రైతులకు శాశ్వత ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం:సీఎం జగన్
9:53 AM, 15 Aug
జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తిచేస్తాం:సీఎం జగన్
READ MORE

English summary
India celebrates its 74th Independence day but due to Coroavirus pandemic restrictions have been imposed by govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X