వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో డ్రాగన్ తోక జాడింపులు -భారత్, చైనా సైనిక కమాండర్ల మధ్య 12వ రౌండ్ చర్చలు నేడు

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంబడి ఉద్రిక్తతలు తగ్గించుకునే దిశగా రెండు దేశాలూ కీలక అడుగు వేశాయి. భారత్, చైనా సైనిక అధికారుల మధ్య 12 రౌండ్ చర్చలు ఇంకాసేపట్లో మొదలుకానున్నాయి. గాల్వాన్ లోయలో హింస తర్వాత సరిహద్దుల నుంచి బలగాల ఉపసంహరణకు ఒప్పందాలు కుదిరినా, డ్రాగన్ మళ్లీ తోక జాడిస్తుండటంతో దానికి చెక్ పెట్టే దిశగా భారత్ వ్యూహాలు సిద్ధం చేసింది..

షాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనంషాకింగ్: ముఖ్యమంత్రిపై మర్డర్ కేసు -భారత సైన్యానికీ ఆంక్షలు -అస్సాంపై మిజోరం సంచలనం

ఇండియన్ ఆర్మీ, చైనీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ)కు చెందిన కార్ప్స్ కమాండర్‌ స్థాయి అధికారులు శనివారం ఉదయం 10.30 గంటలకు చర్చలు ఆరంభిస్తారు. ఎల్ఏసీ వెంబడి చైనా భూభాగంలోని మోల్డో వద్ద ఈ చర్చలు జరుగుతాయి. తూర్పు లదాక్ లోని హాట్ స్ప్రింగ్స్, గోగ్రా పర్వతం నుంచి బలగాల పూర్తి ఉపసంహరణ పైనే ఇవాళ్టి చర్చల అజెండా ఉంటుందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

 India, China 12th Corps Commander-level meeting on Ladakh standoff begins today

సైనిక స్థాయిలో గతంలో జరిగిన చర్చలన్నీ సుదీర్ఘంగా 10 గంటలకుపైగా సాగిన నేపథ్యంలో ఇవాళ్టి చర్చల ఫలితం కూడా ఆలస్యంగానే వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా ఏప్రిల్‌ 9న ఇరు దేశాల సైనిక అధికారుల మధ్య 11వ విడత చర్చలు జరిగాయి. ఉద్రిక్తత నెలకొన్న ప్రాంతాల నుంచి బలగాల ఉపహరణే సరిహద్దు వివాదం పరిష్కారమని భారత్ వాదిస్తున్నది అయితే,

జగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామజగన్ బెయిల్ రద్దు: షాకింగ్ పాయింట్ -14 బదులు 25 ఎలా? -ఏ2 సాయిరెడ్డి కూడా జైలుకే: ఎంపీ రఘురామ

Recommended Video

Severe Flooding In China,100000 After Floods Leave 16 Dead | Oneindia Telugu

చర్చల్లో భారత్ వాదనకు సరేనంటూ తలూపి, ఒప్పందాలకు అంగీకారం కూడా తెలుపుతోన్న చైనా, క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. గతంలో తూర్పు లదాక్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఇప్పుడు ఉత్తరాఖండ్ సరిహద్దులో కవ్వింపులకు పాల్పడుతోన్న డ్రాగన్ సైన్యాలను నిలువరించే దిశగా భారత్ ప్రయత్నిస్తున్నది.

English summary
India and China will hold the 12th Corps Commander-level meet on the Ladakh standoff at 10.30 am today. The meeting held at Moldo on the Chinese side of the Line of Actual Control (LAC). The two sides are discussing disengagement from the Hot Springs and Gogra Heights areas in eastern Ladakh, Indian Army sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X