• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

India China Border Issue: ఇండియా టార్గెట్ గా చైనా హ్యాకర్లు .. సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ హెచ్చరిక

|

ఇండియా చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత సైన్యం మృతి చెందిన ఘటనపై భగ్గుమన్న ఇండియా చైనాకు గుణపాఠం నేర్పాలని తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇక ఇదే సమయంలో చైనా సైన్యం కూడా మృతిచెందిన కారణంగా చైనీయులు కూడా భారతదేశానికి ఒక గుణపాఠం నేర్పాలని ఆలోచిస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

India China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరుIndia China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరు

చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతదేశం పై విరుచుకు పడే అవకాశం

చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతదేశం పై విరుచుకు పడే అవకాశం

చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతదేశం పై విరుచుకు పడే పరిస్థితి ఉందని, భారతీయ పత్రిక, మీడియా సంస్థలు, వెబ్ సైట్లు, రక్షణ వ్యవస్థ తో పాటు, ప్రభుత్వ వెబ్సైట్లు, టెలికాం మరియు స్మార్ట్ ఫోన్లు, ఫార్మాలోని పలు సంస్థలను టార్గెట్ గా చేసుకుని హ్యాకర్స్ రెచ్చిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ, చైనా మీడియా హ్యాకింగ్ కమ్యూనిటీలు భారతీయ మీడియా, ఫార్మా టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకొని ప్రణాళికలు రూపొందిస్తున్నామని సైబర్ ఇంటెలిజెన్స్ సంస్థ సైఫిర్మా నివేదిక పేర్కొంది.

 చైనీస్ సైబర్ గ్రూపు ప్రపంచంలోనే అతి పెద్దది.. 3,14,000మంది ఉన్నట్టు అంచనా

చైనీస్ సైబర్ గ్రూపు ప్రపంచంలోనే అతి పెద్దది.. 3,14,000మంది ఉన్నట్టు అంచనా

గత తొమ్మిది రోజుల్లో లద్దాఖ్ లోని వాస్తవాధీనరేఖ వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీలు ఇండియాను టార్గెట్ చేసి ,ఇండియా కు చుక్కలు చూపించాలని వారు చేసిన సంభాషణలను గుర్తించామని సైఫిర్మా వ్యవస్థాపకుడు కుమార్ రితేష్ చెప్పారు. చైనీస్ సైబర్ గ్రూపు ప్రపంచంలోనే అతి పెద్దదని, చైనీస్ హ్యాకింగ్ కమ్యూనిటీ కోసం దాదాపు మూడు లక్షల పద్నాలుగు వేల మంది పని చేస్తున్నారని అనుమానిస్తున్నట్లు గా వివరించారు. ఇక అమెరికా, జపాన్, దక్షిణ కొరియా, ఇండియా మరియు ఇతర ఆగ్నేయ ఆసియా దేశాలపై దాడి చేయడానికి ఇవి పనిచేస్తున్నాయని, ముఖ్యంగా భౌగోళిక రాజకీయ జెండా కింద ఈ కమ్యూనిటీలు పనిచేస్తాయని పేర్కొన్నారు.

 తమ దేశానికి ప్రయోజనం చేకూర్చే కీలక సమాచారం హ్యాకింగ్

తమ దేశానికి ప్రయోజనం చేకూర్చే కీలక సమాచారం హ్యాకింగ్

ఒక చైనీస్ హ్యాకింగ్ గ్రూపులలో దాదాపు 93 శాతం మందికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లేదా చైనా బాహ్య వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిధులు సమకూరుస్తుంది అని ఆయన పేర్కొన్నారు. చైనా యొక్క విదేశాంగ భద్రతా మంత్రిత్వశాఖ నిధులు సమకూర్చిన ఏపీటీ3, యూఎస్ మరియు హాంగ్ కాంగ్ లక్ష్యంగా చేసుకొని ఇటీవల ప్రచారానికి బాధ్యత వహిస్తోందని అన్నారు. ప్రభుత్వం కోసం ఇటువంటి ప్రచారాలను నిర్వహించడమే కాకుండా, భారత దేశంతో సహా ఇతర దేశాల నుండి ఈ సంస్థకు ప్రయోజనం చేకూర్చే సమాచారాన్ని హ్యాక్ చేయడానికి చైనా సంస్థలతో కలిసి ఈ ఏజెన్సీలు పనిచేస్తాయని గుర్తించినట్లుగా ఆయన చెప్పారు.

ఇండియన్ మీడియా సంస్థలు , టెలీ కంపెనీలు ,ఫార్మా టార్గెట్

ఇండియన్ మీడియా సంస్థలు , టెలీ కంపెనీలు ,ఫార్మా టార్గెట్

మాండరిన్ లో ఉన్న ఈ సైబర్ క్రిమినల్స్ భారతీయ ప్రెస్ మరియు మీడియా సంస్థలు, టెలీకమ్యూనికేషన్ కంపెనీలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ కంపెనీలు, రక్షణ సంస్థలతో సహా ప్రభుత్వ వెబ్సైట్లు, ఇండియన్ ఫార్మా కంపెనీలు, స్మార్ట్ ఫోన్లు, నిర్మాణ రంగం మరియు టైర్ కంపెనీలు చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయని రితేష్ అభిప్రాయపడ్డారు. సైబర్ నేరస్తులు వెబ్ అప్లికేషను బలహీనతను ఉపయోగించి వెబ్సైట్లను హ్యాక్ చేస్తారని, ప్రత్యేకమైన మాల్వేర్ ఉపయోగించి డేటాను హ్యాకర్ కు పంపిస్తారని ,హానికరమైన ఫిషింగ్ ప్రచారాన్ని ప్రారంభించటం చేస్తారని రితేష్ వివరించారు.

హ్యాకర్ల జాబితాలో ఉన్న కంపెనీలు ఇవే

హ్యాకర్ల జాబితాలో ఉన్న కంపెనీలు ఇవే


ఇక హ్యాకర్ల జాబితాలో ఉన్న కంపెనీలను చూసినట్లయితే జియో, ఎంఆర్ఎఫ్ టైర్లు, సన్ ఫార్మాస్యూటికల్స్, ఎయిర్టెల్, సిప్లా, ఇంటెక్స్ టెక్నాలజీస్, మైక్రోమ్యాక్స్, బిఎస్ఎన్ఎల్, అపోలో టైర్స్, మరియు ఎల్ అండ్ టి ఉన్నాయని పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు దాడి చేయగలిగిన ప్రభుత్వ వెబ్సైట్లని ఆయన తెలిపారు.

  India-Nepal Relations మీద Rajnath Singh కామెంట్లు,భారత భూ భాగాలతో ఉన్నNepal Map ను ఒప్పుకున్నట్టేనా?
  ఇండియాకి గుణపాఠం చెప్పాలని చర్చిస్తున్న చైనీస్ హ్యాకర్లు

  ఇండియాకి గుణపాఠం చెప్పాలని చర్చిస్తున్న చైనీస్ హ్యాకర్లు

  ఇండియా చైనా సరిహద్దు వద్ద ఇటీవల నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో చైనీస్ హ్యాకర్లు రెచ్చిపోయే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరికల నేపధ్యంలో ఇండియా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఇక మీడియా సంస్థల జాబితాను చూసినట్లయితే బ్లాక్ వెబ్ ఫోరంలో పలు ప్రధానమైన మీడియా సంస్థల పేర్లే ఉండటం గమనార్హం. ఏదేమైనప్పటికీ చైనా తన దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాకు గుణపాఠం నేర్పించాలని, వెబ్ సైట్ లను హ్యాక్ చేసి ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాలని చూస్తుందని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

  English summary
  The Chinese hacking communities are discussing ways to 'teach India a lesson' and are primarily targeting Indian press and media outlets, government websites including defence, and companies in telecom, smartphones and pharma, among other sectors
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X