వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

India China Border Issue: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం ... చైనాపై నిరసనల హోరు

|
Google Oneindia TeluguNews

భారత్ చైనా బోర్డర్ టెన్షన్ తో భారత్ లో చైనాపై ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. డ్రాగన్ కంట్రీ గత కొద్ది రోజులుగా కవ్వింపు చర్యలకు పాల్పడడం తోపాటు 20 మంది భారత జవాన్ల ప్రాణం తీసింది. డ్రాగన్ కంట్రీ దాష్టీకానికి అసువులు బాసిన వీర జవాన్లకు నివాళి తెలుపుతున్న భారతీయులు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మలను దేశ వ్యాప్తంగా దహనం చేయడంతో పాటుగా, చైనీస్ వస్తువులను దహనం చేస్తూ తమ నిరసనలు తెలియజేస్తున్నారు.

India China Border Issue: జవాన్ల మృతితో భగ్గుమన్న భారత్ ... బాయ్ కాట్ చైనా అంటూ మరోసారి ఉద్యమంIndia China Border Issue: జవాన్ల మృతితో భగ్గుమన్న భారత్ ... బాయ్ కాట్ చైనా అంటూ మరోసారి ఉద్యమం

చైనాపై భారతీయుల ఆగ్రహం .. జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం

చైనాపై భారతీయుల ఆగ్రహం .. జిన్ పింగ్ దిష్టి బొమ్మలు దహనం

గాల్వన్ వ్యాలీలో భారత్-చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత సైన్యం ఒక కల్నల్ తో పాటు 20 మంది వీర మరణం పొందారు. భారత సైన్యాన్ని చిత్రహింసలకు గురి చేసి ప్రాణాలు తీశారు . ఈ క్రమంలో భారత ప్రజలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టిబొమ్మను దహనం చేయడం తో పాటుగా నిరసనలు తెలియజేస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ లో జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.

 వారణాశిలోనూ విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిరసన

వారణాశిలోనూ విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిరసన


అంతేకాదు చైనీస్‌కు చెందిన వస్తువులను కూడా తగలబెట్టి తమ నిరసన తెలియజేసి బ్యాన్ చైనా అంటూ నినాదాలు చేశారు. మరోవైపు వారణాసిలో కూడా విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంస్థ ఆధ్వర్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. దేశవ్యాప్తంగా అమరవీరుల జవానులకు నివాళులర్పిస్తున్న ప్రజలు చైనా పై ప్రతీకారం తీర్చుకోవాలని నినదిస్తున్నారు.

Recommended Video

Donald Trump Considering సస్పెండింగ్ H1B Visas
 నేపాల్ లోనూ దిష్టి బొమ్మ దహనాలు, బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదాలు

నేపాల్ లోనూ దిష్టి బొమ్మ దహనాలు, బ్యాన్ చైనా ప్రొడక్ట్స్ నినాదాలు

ఏదేమైనప్పటికీ తాజా పరిణామాల నేపథ్యంలో చైనా భారత్ బోర్డర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా సైన్యం దాడిని నిరసిస్తూదేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న వేళ ప్రభుత్వ స్పందనపై ఆసక్తి నెలకొంది. ఇక నేపాల్ లో కూడా చైనా వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు . జిన్ పింగ్ దిష్టి బొమ్మ దహనం చేశారు . అంతేకాదు చైనా వస్తువులను రోడ్లపైకి తీసుకువచ్చి తగులబెడుతున్నారు. చైనా వ్యతిరేక నినాదాలు చేశారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ చైనాకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.

English summary
Twenty Indian soldiers, including the Indian Army Colonel, were killed in clashes between India and China Army in the Galvan Valley. With this clash, indians in gujarath, varanasi , nepal etc ..people burnt china president jinping's effigies . demanded to ban on chinese products .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X