వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో టెన్షన్: చర్చలు సఫలం - బలగాల తరలింపు నిలిపివేతకు అంగీకారం - ఉమ్మడి ప్రకటన

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వెంబడి నాలుగు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్తతల్ని నివారించే క్రమంలో కీలక అడుగు పడింది. రెండు దేశాల సైనిక కార్ప్స్ కమాండర్ల మధ్య 13 గంటలపాటు సాగిన ఆరో దఫా చర్చలు చివరికి ఫలవంతమయ్యాయి. ఈ మేరకు అంగీకారం కుదిరిన అంశాలపై భారత్, చైనా ఉమ్మడి ప్రకటన చేశాయి. తొలిసారి సైనిక చర్చల్లో భాగం పంచుకున్న విదేశాంగ శాఖ ఈ మేరకు గురువారం కీలక అంశాలను వెల్లడించింది.

జగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారుజగన్ మౌనం బద్దలైతే ప్రళయమే - కోర్టులపై స్పీకర్ తమ్మినేని సంచలనం -చంద్రబాబును మూసేస్తారు

ఏకాభిప్రాయం కుదిరిన అంశాలివే..

ఏకాభిప్రాయం కుదిరిన అంశాలివే..

ఎల్ఏసీ వెంబడి తూర్పు లదాక్ లోని పాంగాంగ్ సరస్సుకు ఇరువైపులా, అటు దెప్సాంగ్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోనూ రెండు దేశాల మధ్య ఉద్రిక్తత కొనసాగుతుండటం తెలిసిందే. చైనాకు ధీటుగా వ్యవహరించిన భారత్.. డ్రాగన్ సైన్యాలకు సమాన స్థాయిలో బలగాలను మోహరించింది. పరిస్థితి జఠిలం అవుతున్నకొద్దీ రెండు వైపులా అదనపు బలగాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. అయితే, సోమవారం నాటి కార్ప్స్ కమాండర్ల స్థాయి చర్చల్లో.. ఇకపై లదాక్ లోని ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును తరలించకూడదని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. అలాగే, మాస్కో వేదికగా రెండు దేశాల విదేశాంగ శాఖల మంత్రులు కుదుర్చుకున్న ‘ఐదు సూత్రాల ఫార్ములా'ను క్షేత్రస్థాయిలో అమలు చేయాలనే అంగీకారానికి వచ్చాయి.

 భారత విదేశాంగ శాఖ ప్రకటన..

భారత విదేశాంగ శాఖ ప్రకటన..

‘‘సెప్టెంబర్ 21 న(సోమవారం) భారత్, చైనీస్ సీనియర్ కమాండర్ల మధ్య 6 వ రౌండ్ చర్చలు జరిగాయి. ఇందులో పలు కీలకమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. విదేశాంగ శాఖ మంత్రులు అంగీకరించిన ఫైవ్ పాయింట్ ఫార్ములాను గ్రౌండ్ లెవల్ లో అమలు చేసేందుకు అంగీకారం కుదిరింది. అపార్ధాలు, దురభిప్రాయాలు, వివాదాలకు తావు లేకుండా ఇకపైనా కమ్యూనికేషన్‌ కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో ఫ్రంట్ లైన్ కు అదనపు బలగాల తరలింపును నిలిపేయాలని డిసైడ్ అయ్యారు. పరిస్థితి మరింత జఠిలం కాకుండా, సరిహద్దులో సాధారణ పరిస్థితులు నెలకొనే దిశగా చర్యలు తీసుకోవాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి'' అని విదేశాంగ శాఖ తన ప్రకటనలో పేర్కొంది.

త్వరలో 7వ రౌడ్ చర్చలు..

త్వరలో 7వ రౌడ్ చర్చలు..

లెఫ్లినెంట్ జనరల్ స్థాయిలో సోమవరం నాటి 6వ రౌండ్ చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నేతృత్వం వహించగా, తొలిసారి విదేశాంగ శాఖ జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ సైతం సభ్యుడిగా వ్యవహరించారు. ఇక చైనా నుంచి వెస్ట్రన్ థియేటర్ కమాండ్ (సౌత్ జిన్జియాంగ్) కమాండర్ లియూ లిన్, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ భేటీలో కీలక అంగీకారాలు కుదిరిన దరిమిలా, వాటి అమలుపై సమీక్ష జరిపేందుకు, ఉద్రిక్తతలు పూర్తిగా తొలిగిపోయేలా మరిన్ని నిర్ణయాలు తీసుకునేందుకు లెఫ్టినెంట్ జనరల్స్ మధ్య 7వ రౌండ్ చర్చలు కూడా జరపాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. అదనంగా బలగాలను పంపకూడదని నిర్ణయించడం చర్చల్లో పురోగతే అయినప్పటికీ.. సరిహద్దు వెంబడి ఇప్పటికే మోహరించిన సైనికుల్ని వెనక్కి రప్పించే దిశగా ఎలాంటి అంగీకారం కుదరలేదు.

షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్షాకింగ్:పాకిస్తాన్ కుట్ర బట్టబయలు - పరోక్షయుద్ద సామాగ్రి పట్టివేత - భారీ ఖర్చుతో మనోళ్ల యాంటీ ప్లాన్

English summary
After marathon 13-hour talks between India and China at the Corps Commander level on Monday, both sides today released a joint statement saying that two countries had decided to stop sending more troops to the frontline in eastern Ladakh. The joint statement from India and China stated that both sides will enhance communication to avoid misunderstandings and also implement the five-point consensus reached by foreign ministers S Jaishankar and Wang Yi at the sidelines of the SCO summit in Moscow earlier this month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X