వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు చైనాతో మరో భేటీ: మారిన భారత్ వ్యూహం: ఆ అస్త్రాన్ని ప్రయోగించినున్న కేంద్రం: దోవల్ ఎంట్రీ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీరే రేఖ వివాదాన్ని కేంద్రబిందువుగా చేసుకుని భారత్‌పై మొన్నటిదాకా యుద్ధ సన్నాహాలు చేసిన చైనాను నియంత్రించే దిశగా భారత్ మరో కీలక అడుగు ముందుకు వేయబోతోంది. సరిహద్దు, వాస్తవాధీన రేఖ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటిదాకా మూడు విడతలుగా చైనాతో రక్షణ మంత్రిత్వ శాఖ పరంగా చర్చలను కొనసాగించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ తన వ్యూహాన్ని మార్చింది. డిప్లొమేటిక్ పద్ధతుల్లో చర్చల్లో పాల్గొనబోతోంది. దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకుని రావడానికి రంగం సిద్ధం చేస్తోంది.

పోలీసుల దూకుడు: వరుస ఎన్‌కౌంటర్లు.. మరో ఇద్దరి కాల్చివేత: ఆ గ్యాంగ్‌ను మట్టుబెట్టే దిశగాపోలీసుల దూకుడు: వరుస ఎన్‌కౌంటర్లు.. మరో ఇద్దరి కాల్చివేత: ఆ గ్యాంగ్‌ను మట్టుబెట్టే దిశగా

ఆర్మీ అధికారులతో చర్చలు కొలిక్కి రాని వేళ..

ఆర్మీ అధికారులతో చర్చలు కొలిక్కి రాని వేళ..

లఢక్‌ వద్ద వాస్తవాధీన రేఖ వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇప్పటికే మూడు దఫాలుగా భారత్-చైనా మధ్య చర్చలు కొనసాగిన విషయం తెలిసిందే. రెండు దేశాల సైన్యానికి చెందిన లెప్టినెంట్ కమాండర్ స్థాయి అధికారుల మధ్య చోటు చేసుకున్న ఈ చర్చల వల్ల ఎలాంటి ఫలితం రాలేదు. అదే సమయంలో ఉద్రిక్త పరిస్థితులు హైపిచ్‌కు చేరుకున్నాయి. అటు చైనా, ఇటు భారత్ వేలకొద్దీ సైనిక బలగాలను వాస్తవాధీన రేఖ వెంబడి మోహరించారు. యుద్ధ వాహనాలనూ తరలించారు. అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నారు.

చైనాపై రూటు మార్చి..

చైనాపై రూటు మార్చి..

అదే సమయంలో చైనా ఉన్నట్టుండి తన సైన్యాన్ని వెనక్కి రప్పించింది. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లిపోయారు చైనా సైనికులు. చైనా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో ఈ వివాదం ముగిసినట్టుగా భావించట్లేదు భారత్. ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. చైనా ఎలాంటి కుటిల రణనీతిని అనుసరించినా తిప్పి కొట్టడానికి సమాయాత్తమౌతోంది. అందుకే-ఈ సారి దౌత్య పరంగా భారత్‌పై ఒత్తిడిని తీసుకుని రాబోతోంది. ఇందులో భాగంగా- డ్రాగన్ కంట్రీతో మరోసారి చర్చలకు సిద్ధపడింది.

దౌత్యపరమైన ఒత్తిళ్ల కోసం..

దౌత్యపరమైన ఒత్తిళ్ల కోసం..

శుక్రవారం ఈ రెండు దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారుల మధ్య వర్చువల్ విధానంలో చర్చలు కొనసాగనున్నాయి. వర్చువల్ రూపంలో వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్ (డబ్ల్యూఎంసీసీ) స్థాయి సమావేశం ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. చైనాపై దౌత్యపరమైన ఒత్తిళను తీసుకుని రావడంలో భాగంగా డిప్లొమేటిక్ ఎంగేజ్‌మెంట్‌కు కేంద్రం శ్రీకారం చుట్టిందని అంటున్నారు. ఈ చర్చల్లో ఎవరెవరు పాల్గొంటారు? ప్రస్తావనకు వచ్చే ఇతర అంశాలేంటనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. చర్చలకు సంబంధించిన పూర్తి అజెండా సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది.

అజిత్ దోవల్ ఎంట్రీ..

అజిత్ దోవల్ ఎంట్రీ..

కేంద్ర ప్రభుత్వం మరోసారి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు. భారత్-చైనా మధ్య చోటు చేసుకునే చర్చలకు ఆయనను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా ఇప్పటికే ప్రకటించింది. ఈ హోదాలో ఆయన శుక్రవారం చోటు చేసుకునే చర్చల్లో పాల్గొంటారనే సమాచారం దేశ రాజధానిలో చక్కర్లు కొడుతోంది. చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్‌యీతో రెండు గంటల పాటు టెలిఫోన్‌లో సంభాషించిన తరువాతే.. చైనా సైనికులు గాల్వన్ వ్యాలీని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య మరోసారి కేంద్రం ఆయననే ఈ డిప్లొమేటిక్ ఎంగేజ్‌మెంట్ కోసం బరిలో దించవచ్చని సమాచారం.

English summary
India China diplomatic engagement another round of virtual meet of the Working Mechanism for Consultation and Coordination (WMCC) on border affairs to take place tomorrow, source said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X