వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంటువ్యాధిగా 'హెచ్ఐవి': ఇండియాలోను!, ఐరాస ఆసక్తికర విషయాలు..

ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ ద్వారా ఐరాస ఈ వివరాలు వెల్లడించింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హెచ్ఐవి వ్యాధికి సంబంధించి ఐక్య రాజ్య సమితి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. భారత్, చైనా సహా మరో 10దేశాల్లో హెచ్ఐవి అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతోందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలపై జరిపిన విశ్లేషణ ద్వారా ఐరాస ఈ వివరాలు వెల్లడించింది.

ఐరాస వెల్లడించిన దేశాల్లో.. భారత్, చైనా, ఇండోనేషియా, పాకిస్తాన్, వియాత్నం, మయన్మార్, పపువా న్యూ గినియా, ఫిలిప్పీన్స్, తైలాండ్, మలేషియా ఉన్నాయి. ఈ దేశాల్లో హెచ్ఐవి ఎక్కువగా అంటు వ్యాధిగానే ప్రబలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల హెచ్ఐవి సోకిన బాధితుల్లో 95శాతం ఈ 10దేశాలకు చెందినవారేనని ఐరాస చెప్పింది.

India, China, Pakistan among 10 nations accounting for 95% of HIV infections: UN report

ఇంజక్షన్స్ తో డ్రగ్స్ తీసుకోవడం, ట్రాన్స్ జెండర్స్ తో లైంగిక చర్యలకు పాల్పడటం వంటివి దీనికి కారణమని ఐరాస పేర్కొంది. కాగా, గత 6ఏళ్లలో హెచ్ఐవి బారినపడేవారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 13శాతం తగ్గిందని తెలిపింది. 'భారత్ లోని 26నగరాల్లో జరిపిన సర్వేలో 46శాతం మంది డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకోవడం వల్లే హెచ్ఐవి బాధితులుగా మారుతున్నారని' పేర్కొనడం గమనార్హం. ఇక గతంతో పోలిస్తే ఎయిడ్స్ బాధితుల మరణాలు కూడా తగ్గినట్లు సర్వేలో వెల్లడైంది.

English summary
India, China and Pakistan are among the 10 countries that accounted for more than 95 per cent of all new HIV infections in the Asia and the Pacific region in 2016, according to a UN report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X