వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌తో బంధం వర్షం లాంటిది: మరోసారి బుద్ధి బయటపెట్టుకున్న చైనా

భారత్‌- చైనా మధ్య బంధం వర్షాకాలంలో కురిసే వాన లాంటిదని చైనా కాన్సులేట్‌ జనరల్‌ హెంగ్‌ జియూన్‌ అన్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబయి: భారత్‌- చైనా మధ్య బంధం వర్షాకాలంలో కురిసే వాన లాంటిదని చైనా కాన్సులేట్‌ జనరల్‌ హెంగ్‌ జియూన్‌ అన్నారు. పీపుల్స్‌ రిపబ్లిక్‌ చైనా 68వ వార్షికోత్సవం సందర్భంగా ముంబయిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

భారత్‌తో తమ బంధం వేర్వేరు సంవత్సరాల్లో నమోదయ్యే వర్షపాతం లాంటిదని హెంగ్‌ జియూన్‌ పోల్చారు. కొన్నిసార్లు మేఘాలు కమ్ముకుంటాయని డోక్లామ్ ఘటనను ఉద్దేశిస్తూ ఆయన వ్యాఖ్యానించారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒడుదొడుకులకు లోనైనప్పటికీ.. శాంతియుతంగా కలిసి పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గత మూడేళ్లలో ఇరు దేశాల మధ్య సంబంధాలు అనేక ఒత్తిళ్లకు లోనయ్యాయని, ఈ ఏడాది డోక్లామ్ వద్ద తీవ్ర ప్రతిష్టంభన నెలకొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

India-China relation like monsoon rain, says China Consule General

భారత్‌- చైనా- భూటాన్‌ కూడలి వద్ద చైనా దూకుడు ప్రదర్శించి రోడ్డు నిర్మాణం చేపట్టడంతో సుమారు 70 రోజులపాటు ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.

అవన్నీ పక్కనపెట్టి రెండు దేశాలు ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకు సాగాలని జియూన్‌ ఆకాంక్షించారు. అందుకోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. గమ్యం చేరేంతవరకు ఇరు దేశాధినేతలు ఒకే పడవలో ప్రయాణం చేయాలని కోరారు.

English summary
The relation between India and China is like the monsoon that rains differently every year, China's consul General Zheng Xiyuan has said. He was addressing a gathering here last evening in celebration of the 68th National Day of the People's Republic of China. "Relation between China and India is just like the monsoon season. There are different levels of rainfall in different years. And, sometimes you have clouds as well," he said, alluding to the Dokalam episode.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X