• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చైనా నంబర్ 45... 8 నెలలకు బయటపెట్టిన లెఫ్టినెంట్ జనరల్... సరిహద్దులో ఇప్పటి పరిస్థితి ఇదీ...

|

గతేడాది జూన్‌లో తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాత్మక ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులవగా... చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఎక్కడా ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. చైనా జవాన్లే ఎక్కువగా మరణించారని భారత్ చెప్పినప్పటికీ.. డ్రాగన్ కంట్రీ నుంచి దీనిపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఆ హింసాత్మక ఘటన జరిగిన దాదాపు 8 నెలలకు మొదటిసారిగా లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి చైనా వైపు జరిగిన ప్రాణనష్టంపై ఆసక్తికర వివరాలు వెల్లడించారు.

45 మంది చైనా జవాన్లు మృతి

45 మంది చైనా జవాన్లు మృతి

గాల్వన్ లోయలో చోటు చేసుకున్న ఆ హింసాత్మక ఘటనలో 45 మంది చైనా జవాన్లు మృతి చెందినట్లు లెఫ్టినెంట్ జనరల్ వైకే జోషి తెలిపారు. ఈ దాడి ద్వారా చైనా తమ జవాన్లను పోగొట్టుకున్నదే తప్ప సాధించిందేమీ లేదన్నారు. ప్రస్తుతం తూర్పు లదాఖ్‌లోని ప్యాంగాంగ్ త్సో సరస్సు ప్రాంతంలో సైన్యం ఉపసంహరణ ప్రక్రియ సాఫీగా సాగుతోందన్నారు. ఫిబ్రవరి 10న ఈ ప్రక్రియ మొదలైందని... మొత్తం నాలుగు దశల్లో ఇది పూర్తవుతుందని చెప్పారు.

మొత్తం నాలుగు దశల్లో...

మొత్తం నాలుగు దశల్లో...

మొదటి దశలో సాయుధ బలగాలు,మెకానికల్ రెజిమెంట్‌‌ను అక్కడినుంచి ఉపసంహరించుకోవడం జరిగిందన్నారు. ఆ తర్వాత రెండో దశ,మూడో దశల్లో ప్యాంగాంగ్ త్సో సరస్సుకు దక్షిణ,ఉత్తర భాగాన ఉన్న సైన్యాన్ని వెనక్కి రప్పించడం జరుగుతుందన్నారు. చివరి నాలుగో దశలో రెజాంగ్ లా,రెచిన్ లా,కైలాష పర్వత ప్రాంతాల నుంచి సైన్యం ఉపసంహరణ ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని శాటిలైట్స్,యూఏవీ ద్వారా పర్యవేక్షిస్తున్నామని... కొన్నిచోట్ల కెమెరాలను సైతం ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు.

ఆ నిర్మాణాల తొలగింపు...

ఆ నిర్మాణాల తొలగింపు...

గతేడాది ఏప్రిల్‌కు ముందు ఫింగర్ 4 నుంచి ఫింగర్ 8 వరకూ చైనా చేపట్టిన నిర్మాణాలన్నింటినీ పూర్తిగా తొలగించబడుతున్నాయని జోషీ తెలిపారు. టెంట్లు,బంకర్లు,డగౌట్స్ ఇలా అన్నీ తొలగించేస్తున్నట్లు చెప్పారు. ప్యాంగాంగ్ త్సో ఉత్తర భాగాన భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందన్న వాదనలో నిజం లేదన్నారు. ఫింగర్ 8 భారత్ ఆధీనంలోనే ఉంటుందని... అక్కడి నుంచి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తమ సైన్యాన్ని ఉపసంహరించుకుంటోందని చెప్పారు. ఈ పరిధిలో ఇకపై చైనాకు సంబంధించి ఎలాంటి మిలటరీ కార్యకలాపాలు ఉండబోవన్నారు.

వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చిన భారత్..

వ్యూహాత్మకంగా ఒత్తిడి తెచ్చిన భారత్..

ఎట్టకేలకు సరిహద్దు ప్రతిష్ఠంభన ఒక కొలిక్కి రావడం భారత్‌కు కచ్చితంగా విన్-విన్ సిచ్యుయేషన్ అన్నారు. నిజానికి మొదట్లో చర్చల ద్వారా చైనా దారికి రాకపోవడంతో ఆర్మీ చీఫ్ నుంచి తనకు కొన్ని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ మేరకు చైనా పట్ల తాము కూడా దూకుడుగా వ్యవహరించామని... రెజాంగ్ లా,రెచిన్ లా,ప్యాంగాంగ్ దక్షిణ,ఉత్తర తీరాల్లోని వ్యూహాత్మక శిఖరాలపై పాగా వేయగలిగామని అన్నారు. దీంతో చైనా ఒత్తిడికి లోనైందని... ఎట్టకేలకు భారత్ అనుకున్నట్లుగా సైన్యం ఉపసంహరణ కొనసాగుతోందని తెలిపారు.

English summary
After nearly eight months since Chinese incursions in eastern Ladakh triggered a military standoff, India and China have initiated disengagement. Satellite images and other sources of information confirm the withdrawal of Chinese PLA troops from the buffer zone along the Line of Actual Control (LAC).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X