వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌పై విషం కక్కుతోన్న చైనా: పెద్ద నేరం: ఆ మాటలు విని ఇక్కడిదాకా తెచ్చుకుందట

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌తో సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని యుద్ధానికి సమాయాత్తమౌతోన్న చైనా చర్యను ఆ దేశ మీడియా సమర్థించుకుంటోంది. చైనా చర్య సరైనదేనని మ్యాప్‌లతో సహా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తోంది. సరిహద్ద గొడవల విషయంలో భారత్ అనుసరిస్తోన్న వైఖరిని ఏ మాత్రం సమర్థించలేమని పేర్కొంటోంది. దీనికి గల సమగ్ర కారణాలను వివరిస్తోంది. సరిహద్దు వివాదానికి మరింత ఆజ్యం పోసేలా, ఉద్రిక్త వాతావరణాన్ని ఎగదోసేలా ఆ కథనాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

చైనాపై కొత్త స్ట్రాటజీ: టైమ్, ప్లేస్ ఫిక్స్: చర్చల్లో పాల్గొనబోయేది వీరే: భారీ బ్యాక్‌గ్రౌండ్చైనాపై కొత్త స్ట్రాటజీ: టైమ్, ప్లేస్ ఫిక్స్: చర్చల్లో పాల్గొనబోయేది వీరే: భారీ బ్యాక్‌గ్రౌండ్

 అమెరికాతో జట్టు కట్టడమే..

అమెరికాతో జట్టు కట్టడమే..

అమెరికాతో జట్టు కట్టడం వల్లే భారత్ ఈ పరిస్థితికి చేరిందంటూ చైనా మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడి మాటలు విని.. గోటితో పోయే దానికి గొడ్డలిదాకా తెచ్చుకుందంటూ వ్యాఖ్యానిస్తున్నాయి. చైనాతో సత్సంబంధాల కోసం భారత్ ఏనాడూ ప్రయత్నించలేదని చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు పరీక్షలు అనే పేరుతో చైనా డెయిలీ ప్రత్యేకంగా ఎడిటోరియల్‌ను ప్రచురించింది. సరిహద్దు వివాదాలను కేంద్రబిందువుగా చేసుకుని తలెత్తిన ఈ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం ఏ దేశానికి కూడా మేలు చేయదని పేర్కొంది.

అమెరికా జోక్యం వల్లే

అమెరికా జోక్యం వల్లే

సరిహద్దు వివాదాల విషయంలో అమెరికా జోక్యం చేసుకోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయంటూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు సహాయం చేయడానికి ముందుకు రాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది చైనా మీడియా. ఈ విషయంలో భారత్.. అమెరికాకు వ్యతిరేకంగా ఒకటో రెండో కఠిన నిర్ణయాలను తీసుకోక తప్పని పరిస్థితిని తన చేతులారా కల్పించుకున్నట్టయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

సీపీసీ మౌత్ పీస్ సైతం..

సీపీసీ మౌత్ పీస్ సైతం..

చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి మౌత్‌పీస్‌గా గుర్తింపు పొందిన గ్లోబల్ టైమ్స్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. న్యూఢిల్లీ.. వాషింగ్టన్‌తో చేతులు కలపకుండా ఉండాల్సిందని పేర్కొంది. అమెరికా సహకారాన్ని భారత్ ఇప్పటికైనా కోరకపోవడమే మంచిదని అంచనా వేసింది. అమెరికాతో చైనాకు ఉన్న దౌత్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయని, ఈ రెండు దేశాల మధ్య వ్యతిరేక వాతావరణం నెలకొన్న పరిస్థితుల్లో భారత్‌కు సహకరించడానికి అమెరికా ముందుకు రావడం సరైన చర్యగా తాము భావించట్లేదని స్పష్టం చేసింది.

Recommended Video

India-China Border Isssue,Talks To Be Held In Chushul Today
జీ7 విస్తరణపైనా..

జీ7 విస్తరణపైనా..

జీ7ను విస్తరించడానికి డొనాల్డ్ ట్రంప్ పూనుకోవడం, భారత్‌కు చోటు కల్పించడానికి సన్నద్ధం కావడం కూడా చైనా మీడియా రుచించనట్టే కనిపిస్తోందా కథనాలను బట్టి చూస్తోంటే. జీ7 శిఖరాగ్ర సదస్సులో భారత్, ఆస్ట్రేలియా, రష్యాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజుల కిందటే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికోసం ఈ నెలలో నిర్వహించాల్సి ఉన్న జీ7 శిఖరాగ్ర సదస్సును సైతం సెప్టెంబర్‌కు వాయిదా వేసింది. ఇది కూడా చైనాకు మంట ఎక్కించిందనే అభిప్రాయాలను ఆ దేశ మీడియా వ్యక్తం చేసింది.

English summary
An analysis of editorials and opinion pieces of China Daily, the largest English newspaper in the country, and People’s Daily, the Communist Party mouthpiece, shows that between them just one editorial has been published since May 5, when fistfights between Indian and Chinese troops later snowballed into a face-offs at multiple locations in the region.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X