వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాను నమ్మని భారత్: మళ్లీ సరిహద్దు వివాదాల జోలికి పోకుండా పక్కా ప్లాన్‌: కాస్సేపట్లో చర్చలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లఢక్ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద మూడు నెలలుగా కొనసాగుతోన్న ఉద్రిక్త పరిస్థితులను పూర్తిగా చల్లార్చే దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. సరిహద్దు వివాదంపై చైనాతో మరోసారి చర్చలకు సిద్ధపడింది. ఈ రెండు దేశాల మధ్య లెప్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల భేటీ కాస్సేపట్లో ఆరంభం కాబోతోంది. లఢక్‌లో భారత భూభాగంపై గల ఛుసుల్ బోర్డర్ ఆర్మీ పర్సనల్స్ మీటింగ్ పాయింట్ వద్ద ఈ ఉదయం 11 గంటలకు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి.

సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం వైపే భారత్ ముందు నుంచీ మొగ్గు చూపుతూ వస్తోంది. మరోసారి చర్చల్లో పాల్గొనాలంటూ భారత ఆర్మీ అధికారులు ప్రతిపాదనలను పంపించారు. దీనికి చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) అధికారులు అంగీకరించారు. భారత్ తరఫున లెప్టినెంట్ జనరల్ హర్వీందర్ సింగ్ చర్చల్లో పాల్గొనబోతున్నా. ఇప్పటిదాకా మూడుసార్లు నిర్వహించిన చర్చలకు భారత్ తరఫున ప్రాతినిథ్యాన్ని వహించింది ఆయనే.

 India China Standoff: Next round of Lt Gen-level talks between India and China today

ప్రస్తుతం వాస్తవాధీన రేఖ వద్ద గానీ, గాల్వన్ వ్యాలీ ప్రాంతంలో గానీ ఇదివరకు ఉన్న స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు లేవు. దీనికి ప్రధాన కారణం.. చైనా వెనకడుగు వేయడమే. వాస్తవాధీన రేఖ సమీపంలో వివాదాస్పద ప్రాంతాలను చైనా సైనికులు ఖాళీ చేశారు. వాస్తవాధీన రేఖ నుంచి సుమారు రెండుకిలోమీటర్ల దూరం మేరకు వెనక్కి వెళ్లారు. యుద్ధ సామాగ్రిని సైతం వెనక్కి తరలించారు. తాత్కాలిక శిబిరాలను తొలగించారు.

గవర్నర్ కోటాలో మండలికి ఆ ఇద్దరు వైసీపీ నేతలు? మర్రి రాజశేఖర్‌తో పాటు పశ్చిమ నేత పేరు ఖాయం?గవర్నర్ కోటాలో మండలికి ఆ ఇద్దరు వైసీపీ నేతలు? మర్రి రాజశేఖర్‌తో పాటు పశ్చిమ నేత పేరు ఖాయం?

ఫలితంగా- సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం నియంత్రణలో ఉన్నాయే గానీ పూర్తిగా చల్లార లేదు. ఈ పరిస్థితుల్లో భారత ఆర్మీ అధికారులు మరోసారి చైనా సైన్యాధికారులతో చర్చలకు సిద్ధపడ్డారు. తన సైనిక బలగాలను ఉపసంహరించుకున్నప్పటికీ.. చైనాను నమ్మట్లేదు భారత్. ఎప్పుడు? ఎలా ప్రవర్తిస్తుందోననే అనుమానాలు భారత్ అధికారుల్లో వ్యక్తమౌతున్నాయి.

Recommended Video

Google Will Invest $10 Billion In India, Says Sundar Pichai || Oneindia Telugu

వాస్తవాధీన రేఖను ఖాళీ చేసి రెండు కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లినప్పటి తరువాత చైనా సైనికులు సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొచ్చుకుని రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయట్లేదని, అయినప్పటికీ.. వారిని నమ్మలేమనే అధికారులు చెబుతున్నారు. మున్ముందు ఎలాంటి దుందుడకు చర్యలకు చైనా పాల్పడని విధంగా కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఇవే తరహా డిమాండ్లను చైనా సైనికుల ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది.

English summary
The Indian and Chinese military are scheduled to hold their fourth round of Lt General-level talks on Tuesday with an aim to finalise modalities for the next phase of de-escalation and disengagement of troops in eastern Ladakh, government sources said on Monday. The meeting is set to be held in Chushul on the Indian side of the Line of Actual Control (LAC) in eastern Ladakh, they said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X