వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూకేకి దగ్గరగా భారత్: కరోనా కొత్త కేసుల్లో రోజుకో రికార్డు..ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలకు పైగా కేసులు

|
Google Oneindia TeluguNews

ఇండియాలో కరోనా వైరస్ చాప క్రింద నీరులా విస్తరిస్తుంది. ఒక పక్క విపరీతంగా కరోనా కేసులు పెరుగుతుంటే ప్రభుత్వం అన్నిటికీ సడలింపులు ఇస్తుంది. ఇక ఈ పరిస్థితి ఇండియాలో ఆందోళనకు కారణం అవుతుంది.ప్రస్తుతం ప్రపంచంలోనే కరోనా కేసుల విషయంలో ఐదవ స్థానంలో ఉన్న భారత్ మరి కొద్ది రోజుల్లో టాప్ 4 కు చేరే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. విపరీతంగా పెరుగుతున్న కేసులతో భారత్ లో ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలు దాటినా కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షలు దాటినా కరోనా కేసులు

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మరింత పెరుగుతున్నాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా తాజాగా నిన్న 1,12,468 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 70,81,590కి చేరింది. అలాగే నిన్న 3375 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 4,05,074కి చేరింది. ఇక యూఎస్ లో కరోనా మరణ మృదంగం మోగిస్తూనే ఉంది. కరోనాతో అత్యంత ప్రభైతం అయిన దేశంగా యూఎస్ ఉంది. ఇకఇప్పుడు దారుణంగా పెరుగుతున్న కేసులతో ఇండియా రోజుకో స్థానం ముందుకు జరుగుతుంది.

యూకే కి సమీపంలో నాల్గవ స్థానానికి చేరేలా పెరుగుతున్న కేసులు

యూకే కి సమీపంలో నాల్గవ స్థానానికి చేరేలా పెరుగుతున్న కేసులు

కరోనా కేసుల విషయంలో ఇండియా రోజువారీ కొత్త కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది . గత కొన్ని రోజులుగా రోజుకు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నుండి ఇప్పుడు పదివేలకు పైగా కేసులు నమోదవుతున్న పరిస్థితికి ఇండియా చేరుకుంది. ప్రస్తుతం పెరుగుతున్న కేసుల ప్రకారం పరిశీలిస్తే, ఈ వారంలోనే మనకన్నా కాస్త ముందున్న ఇటలీ, స్పెయిన్ లను అధిగమించి ఐదవ స్థానానికి చేరుకుంది. ఇక త్వరలోనే యూకేను అధిగమించి 4వ స్థానానికి చేరుతుందని ఒక అంచనా. ప్రస్తుతం యూకే లో 2,86,194 కేసులు ఇప్పటివరకు నమోదు అయ్యాయి . తాజాగా నమోదైన కొత్త కేసులు 1326 . ఇక ఇండియాలో ఇప్పటికే 26 లక్షలకు చేరువలో కరోనా కేసులు ఉన్నాయి. పది వేలకు పైగా రోజూ కొత్త కేసులు నమోదు అవుతున్నాయి . ఇది ఇలా కొనసాగితే కచ్చితంగా ఇండియా త్వరలో యూకేని అధిగమిస్తుంది.

లాక్ డౌన్ సడలిస్తే కంట్రోల్ కష్టమే అన్న ప్రపంహ ఆరోగ్య సంస్థ సభ్యుడు

లాక్ డౌన్ సడలిస్తే కంట్రోల్ కష్టమే అన్న ప్రపంహ ఆరోగ్య సంస్థ సభ్యుడు

కరోనావైరస్ పరిస్థితి పరిశీలిస్తే, భారతదేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చినట్టు తెలుస్తుంది . ప్రపంచ ఆరోగ్య సంస్థ సభ్యుడు మైఖేల్ ర్యాన్ ప్రకారం, భారతదేశంలో కరోనావైరస్ కేసుల రెట్టింపు మూడు వారాలలో జరుగుతుందని ఒక అంచనాగా చెప్పారు . ఏదేమైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయిన ర్యాన్ మాట్లాడుతూ, కరోనా తీవ్రత భారత దేశం లాక్ డౌన్ అన్ లాక్ చేసే దిశగా కదులుతున్నప్పుడు మరింత పెరిగే ప్రమాదం ఉంది అని అంటున్నారు .

Recommended Video

Hyderabad Journalist Passed Away In Gandhi Hospital Due To Covid 19
ఇండియాలో పదివేలకు పైగా నమోదైన కొత్త కేసులు .. డేంజర్ బెల్స్ మోగిస్తున్న భారత్

ఇండియాలో పదివేలకు పైగా నమోదైన కొత్త కేసులు .. డేంజర్ బెల్స్ మోగిస్తున్న భారత్

భారతదేశం ఇటలీని దాటి , స్పెయిన్ ను దాటి మహమ్మారితో ప్రభావితమైన ఐదవ దేశంగా మారింది . ఇక ఇప్పటి వరకు చూస్తే ఇండియాలో కరోనా కేసులు 2,57,486 కు చేరుకున్నాయి. ఇక కొత్త కేసులను చూస్తే 10,884 కొత్త కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది . అంతేకాదు 1,26,418 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి . ఇక 1,23,848 మంది ఇప్పటి వరకు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అయ్యారు . 7,207 మంది ఇప్పటి వరకు ఇండియాలో కరోనా బారిన పది మరణించారు . ఇప్పటివరకు 46,66,386 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు .

English summary
In India, corona cases are on the rise, the government is giving relaxations on everything. India is currently ranked fifth in the world in corona cases and is threatening to reach the top 4 in the next few days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X