వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో 400మిలియన్లకుపైగా ఇంటర్నెట్ యూజర్లు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డిసెంబర్ 2015 నాటికి భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 402 మిలియన్లకు చేరుకోనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 49శాతం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరగడం గమనార్హం. ‘ఇండియాలో ఇంటర్నెట్-2015' పేరుతో ది ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), ఐఎంఆర్‌బి ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఓ నివేదికను విడుదల చేశాయి.

ఇండియాలో వినియోగదారుల సంఖ్య పదేళ్లకుపైగా కాలంలో 10 మిలియన్ల నుంచి 100 మిలియన్లకు చేరుకోగా, గత మూడేళ్లలోనే 100 నుంచి 200 మిలియన్లకు చేరుకుంది. ఆ తర్వాత ఏడాది కాలంలోనే ఈ సంఖ్య 300 నుంచి 400 మిలియన్లకు చేరింది. ప్రస్తుత భారతదేశంలో ఇంటర్నెట్ అనేది ప్రతీ ఒక్కరికీ ప్రధాన సాధనంగా మారింది. ఇది డిజిటల్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఓ సూచికగా చెప్పుకోవచ్చు.

India to cross 400 million internet users by Dec 2015: IAMAI Report

మొత్తంగా ఇంటర్నెట్ యూజర్లు

2015 అక్టోబర్‌లో 375 మిలియన్ల ఇంటర్నెట్ వినియోగదారులు భారతదేశంలో ఉన్నారు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో ఇంటర్నెట్ యూజర్లు ఎక్కువగా ఉన్న తృతీయ దేశంగా కొనసాగుతోంది. అయితే ఈ డిసెంబర్ నాటికి ఇంటర్నెట్ యూజర్లు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ద్వితీయ స్థానంలో ఉన్న అమెరికాను అధిగమించే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం 600మిలియన్ల ఇంటర్నెట్ యూజర్లతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంటర్నెట్ యూజర్ల పెరిగితే చైనా తర్వాతి స్థానం భారతదేశందే.

నివేదిక ప్రకారం.. 71శాతం పురుషులు, 29శాతం మహిళలు భారతదేశంలో ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఈ శాతంలో పురుషులు 50శాతంలో పెరుగుతుండగా, మహిళలు 46శాతంతో పెరుగుతున్నారు. నగరాల్లో చూసుకున్నట్లయితే ఇంటర్నెట్ యూజర్లలో పురుషులు, మహిళలు 62:46శాతంగా ఉంది. ఇంటర్నెట్ యూజర్లలో పురుషుల్లో 39శాతం పెరుగుదల కనిపించగా, మహిళల్లో 28శాతం పెరుగుదల కనిపిస్తోంది.

India to cross 400 million internet users by Dec 2015: IAMAI Report

గ్రామీణ ఇంటర్నెట్ యూజర్లలో 88శాతం పురుషులే ఉన్నారు. 61శాతంతో మహిళా యూజర్ల పెరుగుదల ఉండగా, 79శాతంతో పురుషులు పెరుగుదల ఉంది. 18-30ఏళ్ల వారే గ్రామీణ ప్రాంతాల్లో 75శాతం ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. మిగితా 11శాతం మంది 18ఏళ్ల లోపువారు, 8శాతం మంది 31-45ఏళ్ల వయస్సుల వారు వినియోగిస్తున్నారు.

32శాతం మంది యూజర్లలో కాలేజీకి వెళ్లే విద్యార్థులే 26శాతం ఉన్నారు. నాన్ వర్కింగ్ వుమెన్లలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య ఎక్కువ పెరుగుదల నమోదవుతోంది. గతేడాడి ఈ పెరుగుదల 97శాతంగా ఉంది. పాఠశాలకు వెళ్లే అమ్మాయిల్లో 36శాతం, కళాశాలకు వెళ్లే అమ్మాయిల్లో 26శాతం పెరుగుదల నమోదైంది.

India to cross 400 million internet users by Dec 2015: IAMAI Report

దేశంలోని పట్టణ ప్రాంతాలకు చెందిన ప్రజలు రోజువారీగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. అక్టోబర్ 2015నాటికి 69శాతం రోజువారీగా ఉపయోగిస్తున్నారు. గతేడాదితో పోల్చుకుంటూ 60శాతం పెరుగుదల కనిపిస్తోంది. కళాశాలకు వెళ్లే విద్యార్థులు, యువకులే అధికంగా ఇంటర్నెట్ ఉపయోగిస్తుండటం గమనార్హం.

కాగా, 75శాతం వర్కింగ్ వుమెన్ రోజూ ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు. రోజువారీగా ఉపయోగిస్తున్న వారిలో 37శాతం పురుష వినియోగదారులుండగా, 23శాతం మహిళా వినియోదారులున్నారు. 75శాతం స్త్రీ, పురుషులిద్దరూ వారంలో కనీసం ఒక్కసారైన ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు.

పట్టణ భారతదేశంలో 65శాతం మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారులు పెరిగిపోయారు. గతేడాది కంటే 65శాతం పెరుగుదల నమోదు చేసి 197 మిలియన్లకు చేరుకుంది ఈ అక్టోబర్ నాటికి. గతేడాది కంటే 99శాతం పెరుగుదలతో అక్టోబర్ చివరినాటికి ఈ సంఖ్య 80మిలియన్లకు చేరుకుంది. గ్రామీణ భారత వినియోగదరులను చూసుకున్నట్లయితే డిసెంబర్ 2015 నాటికి 87 మిలియన్లకు చేరుకుంటుండగా, 2016 జూన్ నాటికి 109 మిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది.

India to cross 400 million internet users by Dec 2015: IAMAI Report

35నగరాల్లో ఈ సర్వేను నిర్వహించారు. ఆసక్తికరంగా 11.4మిలియన్ల మంది ఇంటర్నెట్ వినియోగించేందుకు విముఖత చూపుతున్నారు. వారిలో 2/3శాతం మంది వచ్చే ఏడాదిలోగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగించే అవకాశం ఉంది.

English summary
The number of Internet users in India is expected to reach 402 million by December 2015, registering a growth of 49% over last year, according to a report ‘Internet in India 2015’, jointly published by the Internet and Mobile Association of India (IAMAI) and IMRB International, today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X