వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్ ఇష్యూ : ట్రంప్‌పై భారత్ గుస్సా, మధ్యవర్తిత్వం వహించమని కోరలేదని వెల్లడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని భారత్ కోరిందని అమెరికా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను ఇండియా కొట్టిపారేసింది. పెద్దన్న అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు భారత విదేశాంగ ఒక ప్రకటనలో పేర్కొంది. అమెరికాలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ... ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కశ్మీర్ అంశంపై చర్చించేందుకు మధ్యవర్తిత్వం వహించాలని భారత ప్రధాని మోడీ కోరారని ట్రంప్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

India denies Trump Kashmir dispute claim

మీరు నిజంగా పాకిస్థాన్ హితం కోరేవాళ్లు అయితే భారత్‌తో చర్చలకు సిద్ధం కండి అని ఇమ్రాన్‌తో ట్రంప్ చెప్పారు. దీంతో కశ్మీరీల సమష్య పరిష్కరమవుతుందని పేర్కొన్నారు. అంతేకాదు ఎన్నాళ్ల నుంచి ఉన్న సమస్యను పరిష్కరించామనే తృప్తి తనకు ఉంటుందని కలరింగ్ ఇచ్చారు. చర్చల కోసం మధ్యవర్తిత్వం వహించేందుకు పాకిస్థాన్ పిలిస్తే ఆ దేశానికి వెళతానని ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే దీనికి ఇమ్రాన్ ఖాన్ కూడా అంగీకరించారు. దీంతో వందల కోట్ల మంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన భావించారు. అయితే ఇమ్రాన్, ట్రంప్ సమావేశం గురించి వైట్ హౌస్ ప్రకటనలో పేర్కొంది. కానీ అందులో కశ్మీర్ అంశం లేకపోవడం గమనార్హం.

ట్రంప్ ఆరోపణలను భారత్ ఖండించింది. కశ్మీర్ అంశంపై మధ్యవర్తిత్వం వహించాలని కోరలేదని స్పష్టంచేసింది. భారత్, పాకిస్థాన్‌కు సంబంధించిన అంశాలన్నింటినీ ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకుంటామని స్పస్టంచేసింది. ఇందుకోసం సరిహద్దు ఉగ్రవాద, సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్ ఉన్నాయని గుర్తుచేసింది. ట్రంప్ ప్రకటన తర్వాత ఏం జరిగిందనే అంశంపై వివరణ ఇవ్వాలని విపక్ష నేతలు ఒమర్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ట్రంప్ ఏం అంశం గురించి మాట్లాడారో ఆయనకు స్పష్టత ఉందా అని ప్రశ్నించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్.

English summary
"We have seen POTUS's remarks to the press that he is ready to mediate, if requested by India & Pakistan, on Kashmir issue. No such request has been made by PM narendramodi to US President. It has been India's consistent position that all outstanding issues with Pakistan are discussed only bilaterally. Any engagement with Pakistan would require an end to cross border terrorism. The Shimla Agreement & the Lahore Declaration provide the basis to resolve all issues between India & Pakistan bilaterally," the MEA spokesperson said on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X