వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా గుండెలో పిడుగు: ఎల్ఏసీ వద్ద సరికొత్త నిర్భయ్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ - నిశబ్ధ విధ్వంసం

|
Google Oneindia TeluguNews

భారత్, చైనా మధ్య వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) వద్ద యుద్ధసామాగ్రి మోహరింపు ముమ్మరంగా సాగుతోంది. మన భూభాగంలోని సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాక్ లోను టార్గెట్ చేస్తూ చైనా సైన్యం సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు(ఎస్ఏఎం) మోహరించడంతో భారత్ సైతం డ్రాగన్ కు ధీటుగా సమాధానమిచ్చేందుకు అత్యాధునిక, సరికొత్త 'నిర్భయ్ మిస్సైల్'ను సరిహద్దుకు తరలించింది. ఈ విషయాన్ని ఆర్మీ వర్గాలు సోమవారం ఖరారు చేశాయి. నిర్భయ్ తోపాటు ప్రఖ్యాత బ్రహ్మోస్, ఆకాశ్(సర్ఫేస్ టు ఎయిర్) మిస్సైళ్లను సైతం ఎల్ఏసీ వద్ద మోహరించారు.

Recommended Video

India-China Stand Off : China ను దెబ్బ తీసేలా LAC వద్ద Nirbhay Missile ‌ను మోహరించిన భారత్!

కొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశంకొండను పిండిచేసిన మహిళలు - 18నెలలు తొవ్వి ఊరికి నీళ్లు - హ్యాట్పాఫ్ చెబుతోన్న దేశం

నిశబ్ద విధ్వంసం..

నిశబ్ద విధ్వంసం..

పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) అభివృద్ధి చేసిన లాంగ్ రేజ్ సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ కి ‘నిశబ్ద విధ్వంసకురాలు' అని రక్షణ వర్గాలు పిలుచుకుంటాయి. అతి తక్కువ ఖర్చుతో రూపొందిన ఈ మిస్సైల్.. ‘సర్ఫేస్ టు సర్ఫేస్' టార్గెట్లను కచ్చిత్వంతో ఛేదించగలుగుతుంది. 6 మీటర్ల పొడవుండే నిర్బయ్ పరిధి గరిష్టంగా 1000 కిలోమీటర్లు. అంటే, టిబెట్ లోని చైనా సైనిక స్థావరాలను సైతం ఇది బూడిదచేయగలుగుతుంది. ధ్వని వేగం కన్నా తక్కువ వేగంతో అతి తక్కువ శబ్దంతో ప్రయాణించే ఈ మిస్సైల్.. నిర్దేశించిన టార్గెట్ వైపు కచ్చితంగా కదిలేలా రింగ్ లేజర్ గైరోస్కోప్, రేడియో ఆల్టిమీటర్ లను సైతం అమర్చారు.

హెర్డ్ ఇమ్యూనిటీకి దూరంగా భారత్ - కరోనాతో గుండెపైనా ప్రభావం: హర్షవర్ధన్ - 60లక్షలు దాటిన కేసులుహెర్డ్ ఇమ్యూనిటీకి దూరంగా భారత్ - కరోనాతో గుండెపైనా ప్రభావం: హర్షవర్ధన్ - 60లక్షలు దాటిన కేసులు

కీలక అడుగు..

కీలక అడుగు..

డీఆర్డీవో తయారు చేసి, ఏడేళ్ల పాటు వివిధ రకాల పరీక్షలు దాటుకువచ్చిన నిర్భర్ క్షిపణి.. సైన్యంలో చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. అదికూడా సరిహద్దు వెంబడి చైనా మిస్సైళ్లను మోహరించిన వేళ.. దానికి గట్టిగా బదులిచ్చేలా మనవాళ్లు నిర్భయ్ ని రంగంలోకి దింపారు. యుద్ధసన్నద్ధతలో నిర్భయ్ మోహరింపును కీలక అడుగుగా రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. భారత్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోనప్పటికీ, చైనా గనుక యుద్ధానికి కవ్విస్తే.. కఠినమైన చలి కాలంలోనూ పోరుకు అన్ని విధాలుగా సన్నద్ధంగా ఉన్నామని భారత ఆర్మీ ఇదివరకే ప్రకటించింది. అందులో భాగంగా గత వారమే భారత్.. టీ-90, టీ-72 రకం యుద్ధ ట్యాంకుల్ని ఎల్ఏసీ సమీపానికి తీసుకెళ్లింది. మైనస్ 40 డిగ్రీల చలిలోనూ సమర్థవంతంగా పనిచేసే బీఎంపీ-2 యుద్ధవాహకాలను సైతం సరిహద్దులకు తరలించారు.

13 చోట్ల చైనా పోస్టులు..

13 చోట్ల చైనా పోస్టులు..


మూడేళ్ల కిందట డోక్లాంలో రెండున్నర నెలలపాటు భారత్, చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తలు కొనసాగిన సంగతి తెలిసిందే. నాడు చేదు అనుభవాల్ని చవిచూసి చైనా.. ఆ తర్వాతి కాలంలో సరిహద్దు వెంబడి కొత్తగా 13 చోట్ల సైనిక స్థావరాలను నిర్మించింది. ఎల్ఏసీకి సమీపంగా డ్రాగన్ మరో మూడు ఎయిర్ బేస్ లను కూడా గడిచిన మూడేళ్లలోనే నిర్మించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు చైనా కదలికలను గమనిస్తోన్న భారత్.. చలికాలంలో డ్రాగన్ దురాగతాలకు, దురాక్రమణకు పాల్పడొచ్చనే అంచనాలతో యుద్ధానికి సన్నద్ధమవుతున్నది. చలికాలంలో లాజిస్టిక్స్ కు ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే ప్రపేర్ అయ్యామని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

English summary
In a major boost to India's long-range defence, the security forces have rolled out homegrown subsonic missile Nirbhay to counter China's missile deployment along the Line of Actual Control. The surface-to-surface missile has a reach of up to 1,000 km. The Nirbhay missile is capable of low-level stealth strike on targets. It means it is capable of flying between 100 metres to four km from ground and pick up the target before engaging it. The Nirbhay missile has been developed by the Defence Research and Development Organisation (DRDO). The missile has been in the testing for seven years. This is Nirbhay missile's first deployment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X