వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు: బోలెడు శ్రీనివాస్‌లు, ఎంత పొడుగు పేర్లో

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నీదే పేరు అని అడిగితే తెలుగు ప్రాంతంలో శ్రీనివాస్ అని సాధారణంగా వినిపిస్తుంది. అలాగే ఉత్తరప్రదేశ్‌లో మొహ్మద్ లేదా రామ్ అని వినిపిస్తుంది. గుజరాత్‌లో గీతా బెన్ అంతే. రమేష్ పేరు విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వినిపిస్తుంది. దేశంలోని అతి పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో 13.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో కనీసం 1.2 కోట్ల మంది పేరులో రామ్ అని ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, శ్రీనివాస్ అనేది 600 భిన్నమైన పద్ధతుల్లో వినిపిస్తుంది. గుజరాత్‌లోని మహిళల్లో గీతా బెన్ అనే మొదటి పేరున్నవారు మూడు లక్షల మంది దాకా ఉన్నారు. బీహార్‌లోని మహిళల్లో సీత అనే మొదటి పేరున్న మహిళలు 3.27 లక్షల మంది దాకా ఉన్నారు. గీతా అనే మొదటి పేరున్న మహిళలు కూడా దాదాపు అంతే మంది ఉన్నారు. రమేష్ అనేది మొదటి పేరుగా దేశవ్యాప్తంగా కనిపిస్తుంది.

India elections: Big Data throws up interesting trivia

ప్రస్తుత ఎన్నికల్లో ఓ జాతీయ పార్టీ కోసం పనిచేసిన హైదరాబాద్‌కు చెందిన స్టార్ట్ అప్ ఓటర్ల పేర్లకు సంబంధించిన భారీ డాటాను సేకరించింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన మోడక్ అనలిటిక్స్ ఈ పేర్లకు సంబంధించిన డేటాను సేకరించి, నిల్వ చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంస్థకు దొరికిన అతి పెద్ద పేరు ఇ జానకి సత్య సూర్య విజయ దుర్గా మహేశ్వరి. ఈ వ్యక్తి సంగారెడ్డి నియోజకవర్గంలో ఉన్నారు. మరో అతి పెద్ద పేరు వెంకట సత్య సూర్యి మైత్రేయి కుమారి తోలేటి. ఈ ఓటరు నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు. రాష్ట్రానికి చెందిన 64 మంది ఓటర్ల వయస్సు జీరోగా ఉంది.

లక్ష్మి అనే పేరున్నవారు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 19.28 లక్షల మంది ఉన్నారు. గోవాలో పేరులో ఎక్కడో ఓ దగ్గర ఫెర్నాండెజ్ అనే పదం ఉన్నవారు 81 వేల మంది దాకా ఉన్నారు. మహారాష్ట్రలో శంకర్ (11.41 లక్షలు, పాటిల్ (24 లక్షలు) సర్వసాధారణం.

తాము ఓటర్లకు సంబంధించి కులం, లింగం, వయస్సు, ఆర్థిక స్థితిగతిలకు సంబంధించిన వివరాలను సేకరించినట్లు ఎన్నికల కమిషన్, జనాభా లెక్కల ఆధారంగా వాటిని సేకరించామని మోడక్ చీఫ్ అనలిటిక్స్ ఆఫీసర్ మిలింద్ చిట్గుపాకర్ బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.

తమ సంస్థ ఇక బ్యాంకింగ్, రిటైల్ పరిశ్రమలకు సంబంధించిన వివరాలను సేకరిస్తుందని మోడక్ అనలిటిక్స్ సహ వ్యవస్థాపకురాలు ఆర్తి జోషీ చెప్పారు.

English summary
When one billion people go for voting, you can certainly hope for interesting trivia. A Hyderabad-based start-up has used a variety of Big Data tools to mine the electorate as they worked for a national political party in the ongoing general elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X