వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రం నెత్తిన మరో పిడుగు.. తగ్గిన ట్యాక్స్ కలెక్షన్స్.. 20 ఏళ్లలో తొలిసారిగా..

|
Google Oneindia TeluguNews

గడిచిన రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనివిధంగా తొలిసారి ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ ఆదాయపు పన్ను,కార్పోరేట్ పన్ను ఆదాయం గణనీయంగా పడిపోనుందని సీనియర్ ట్యాక్స్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థికమందగమనం, పారిశ్రామికవేత్తలకు పన్ను రాయితీ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణమని భావిస్తున్నారు.

ట్యాక్స్ వసూళ్లు తగ్గడానికి కారణమేంటి..

ట్యాక్స్ వసూళ్లు తగ్గడానికి కారణమేంటి..

ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 31 నాటికి ప్రత్యక్ష పన్నుల ఆదాయం రూ.13.5లక్షల కోట్లు సమకూరాలని మోదీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. గతంతో పోలిస్తే 17శాతం ఎక్కువ ఆదాయాన్ని లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే మార్కెట్‌లో పడిపోయిన డిమాండ్ రీత్యా చాలా కంపెనీల బిజినెస్ తగ్గిపోయింది. దీంతో చాలావరకు కంపెనీలు పెట్టుబడులను తగ్గించుకోవడం,ఉద్యోగాలకు కోత పెట్టడం చేస్తున్నాయి. ఫలితంగా ట్యాక్స్ వసూళ్లు తగ్గిపోవడమే గాక.. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 5శాతం వృద్దిని మాత్రమే అంచనా వేయాలని ప్రభుత్వాన్ని ప్రేరేపిస్తున్నాయి. గడిచిన 11 ఏళ్లలో ఇదే అతి తక్కువ ఆర్థిక వృద్ది రేటు కావడం గమనార్హం.

గతేడాది కంటే తక్కువ వసూళ్లు..

గతేడాది కంటే తక్కువ వసూళ్లు..

జనవరి 23వ తేదీ నాటికి ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వసూలు చేసిన మొత్తం ట్యాక్స్ రూ.7.3లక్షల కోట్లు. గతేడాది ఇదే సమయానికి వసూలైన మొత్తం కంటే ఇది 5.5శాతం తక్కువని సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ ఒకరు చెప్పారు. మొదటి మూడు త్రైమాసికాలకు కంపెనీల నుంచి ముందే పన్ను వసూళ్లు చేపట్టిన తర్వాత.. సాధారణంగా చివరి మూడు నెలల్లో 30-35% వార్షిక ప్రత్యక్ష పన్ను వసూలు అవుతుందని డేటా చెబుతోంది. కానీ తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.11.5లక్షల కోట్లు తగ్గేలా ఉందని ఎనిమిది మంది సీనియర్ ట్యాక్స్ అధికారులు రాయిటర్స్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కొత్త అప్పులు చేయాల్సిందేనా..

కొత్త అప్పులు చేయాల్సిందేనా..


ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం సంగతి పక్కనపెడితే.. ఎన్నడూ లేని రీతిలో ట్యాక్స్ వసూళ్లు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10శాతం కంటే తక్కువ ట్యాక్స్ వసూళ్లతో ముగిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్టు ఢిల్లీకి చెందిన అధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా ప్రభుత్వ వ్యయంలో దాదాపు 80శాతం రెవెన్యూ పన్నుల రూపంలోనే అందుతుంది. కానీ ఈసారి పన్ను వసూళ్లు తగ్గిపోవడంతో.. ప్రభుత్వం కొత్తగా మరిన్ని అప్పులు చేసే అవకాశం ఉంది.

అధికారులు ఏమంటున్నారు..

అధికారులు ఏమంటున్నారు..

ఆర్థిక మందగమనం నేపథ్యంలో గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్పోరేట్ ట్యాక్స్‌ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం పన్ను వసూళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. పన్ను వసూళ్లు తగ్గడానికి అది కూడా ఓ ముఖ్య కారణమని చెబుతున్నారు. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించినట్టగా కాకుండా.. కనీసం గతేడాది వచ్చిన ఆదాయమైనా సమకూరితే బాగుంటుందని ట్యాక్స్ అధికారులు అభిప్రాయపడుతున్నారు.

English summary
India's corporate and income tax collection for the current year is likely to fall for the first time in at least two decades, over half a dozen senior tax officials told Reuters, amid a sharp fall in economic growth and cut in corporate tax rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X