వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయి

|
Google Oneindia TeluguNews

ఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆజ్యంపోసేలా ఉంది. ఇప్పటికే యుద్ధం వస్తుందన్నంతగా రెండు దేశాలు ఒకరిపై ఒకరు దాడులకు ప్రయత్నిస్తుండగా... ఐక్యరాజ్యసమితి ఒక నివేదిక విడుదల చేసింది. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఏవి అనేదానిపై ఐక్యరాజ్యసమితి ఓ నివేదిక విడుదల చేసింది.

India far behind Pakistan in global list of Happiest Nations, ranks 140th

ప్రపంచంలో సంతోషకరమైన దేశాల్లో భారత్ స్థానం పడిపోయింది. ఇప్పుడు భారత్‌ కంటే పాకిస్తానే ముందంజలో ఉన్నట్లు సంచలన నివేదిక విడుదల చేసింది ఐక్యరాజ్య సమితి. ఇందులో భారత‌దేశం 140 స్థానంలో నిలిచింది. అంటే 2018లో భారత్‌లో సంతోషంగా ఉన్న ప్రజలు 2019లో అంత సుఖసంతోషాలతో ఉండటం లేదనే విషయాన్ని తేటతెల్లం చేసింది నివేదిక. ఇక ఈ విషయంలో పాకిస్తాన్‌లోనే చాలామంది సంతోషంగా ఉన్నట్లు రిపోర్టు పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత సంతోషమైన దేశాల్లో మరోసారి ఫిన్‌లాండ్ దేశం ప్రథమ స్థానంలో నిలిచింది. వరుసగా రెండో సారి తొలిస్థానం దక్కించుకుంది ఫిన్‌లాండ్.

మిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవానుమిలటరీ క్యాంపులో కాల్పులు: ముగ్గురు జవాన్లను కాల్చి చంపిన మరో జవాను

ఇక సంతోషంగా ఉండేందుకు ఆరు అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక తయారు చేయడం జరిగింది. ఇందులో సంపాదన, స్వతంత్రత, విశ్వాసం, ఆరోగ్యకరమైన జీవితం, సామాజిక మద్దతులాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నివేదిక రూపొందించారు. రిపోర్టు ప్రకారం ప్రపంచంలో అత్యంత సుఖ సంతోషాలుగా ఉన్న దేశాల సంఖ్య పడిపోతూ వచ్చిందని నివేదిక వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి రిపోర్టు ప్రకారం భారత్‌కు 140వ స్థానం దక్కింది. గతేడాది 133 స్థానంలో భారత్ ఉన్నింది. ఇలాంటి రిపోర్టును ఒకటి విడుదల చేయడం ఐక్యరాజ్యసమితికి ఇది ఏడో సారి కావడం విశేషం.

ఇక అగ్రస్థానంలో ఫిన్‌లాండ్ నిలవగా... దానితర్వాత డెన్మార్క్, నార్వే, ఐస్‌ల్యాండ్, నెదర్లాండ్స్ దేశాలు ఉన్నాయి.ఇక ప్రపంచంలోనే అత్యంత సుఖ సంతోషాలున్న దేశాలుగా పాకిస్తాన్‌ 67 ర్యాంకు పొందగా... బంగ్లాదేశ్‌కు 125వ స్థానం లభించింది. మరోవైపు చైనా 93వ స్థానంలో నిలిచింది. ఇక ప్రపంచ దేశాల్లో సంతోషం లేకుండా ఉన్న దేశాల్లో ముందుగా దక్షిణ సూడాన్ ఉండగా ఆ తర్వాత సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ 155వస్థానం, అఫ్ఘానిస్తాన్ 154వ స్థానం, టాంజానియా 153వ స్థానం, రువాండా 152 స్థానాల్లో నిలిచాయి. ప్రపంచంలోనే అత్యధిక ధనిక దేశంగా పేరుగాంచిన అగ్రరాజ్యం అమెరికా 19వ స్థానంలో నిలిచింది.

English summary
Indians are not as happy in 2019 as they were in 2018 and the country figures at 140th place, seven spots down from last year, on this year's UN World Happiness Report released Wednesday which is topped by Finland for the second year in a row.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X