వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇథియోపియా విమాన ప్రమాదం ఎఫెక్ట్: భారత్‌లో తక్షణమే బోయింగ్ 737 విమానాలకు బ్రేక్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: ఇథియోపియాలో బోయింగ్ 737 మ్యాక్స్ 8 జంబో విమానం కూలి 157 మంది మృతి చెందడంతో అలర్ట్ అయ్యింది భారత పౌరవిమానాయాన శాఖ. బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక అంతకుముందు ఈ మోడల్ విమానంను నడిపేవారికి అదనంగా కొన్ని సూచనలు చేసింది. ఆ తర్వాత రిస్క్ చేయకూడదని భావించి ఎట్టకేలకు విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఈ విమానాల్లో సాంకేతికంగా అన్ని మరమత్తులు జరిగాకే తిరిగి గాల్లోకి ఎగురుతాయని పౌరవిమానాయానశాఖ తెలిపింది.

India finally grounds Boeing 737 Max 8 planes with immediate effect

ప్రయాణికుల క్షేమం కంటే తమకేది ఎక్కువకాదని చెప్పిన పౌరవిమానాయాన సంస్థ ఈ మేరకు ఇతర దేశాలు, విమాన తయారీ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని డీజీసీఏ వెల్లడించింది. ఇక భారత్‌లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్ సంస్థలు బోయింగ్ 737 మ్యాక్స్ 8 మోడల్ విమానాలను నడుపుతున్నాయి. స్పైస్ జెట్ 12 విమానాలను నడుపుతుండగా... జెట్ ఎయిర్‌వేస్ విమానాయాన సంస్థ 5 విమానాలను నడుపుతోంది. జెట్‌ఎయిర్‌వేస్‌కు ఆర్థిక కష్టాలు వచ్చినందున ఈ విమానాలను ఇప్పటికే నిలిపివేయగా... స్పైస్ జెట్ మాత్రం ఇంకా ఈ విమానాలను నడుపుతోంది.

ఇదిలా ఉంటే స్పైస్ జెట్ మాత్రం ఈ బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాల పనితీరు బాగానే ఉందని చెబుతోంది. ఇప్పటి వరకు కొన్ని వేలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాయని ఎప్పుడూ ఇబ్బందులు తలెత్తలేదని స్పైస్ జెట్ ఎయిర్‌వేస్ సంస్థ వెల్లడించింది. ఇదిలా ఉంటే భారత్‌ కంటే ముందు చాలా దేశాలు ఈ తరహా మోడల్ విమానాలను నిషేధించాయి. ఇప్పటికే ఈ తరహా మోడల్‌కు ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్, లయన్ ఎయిర్ ఫ్లైట్ విమానాలు కూలిపోవడంతో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.మార్చి 12న బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు కూడా ఈ మోడల్ విమానాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

వైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండివైరల్ : తప్పిపోయిన తన బిడ్డ దొరకగానే ఈ చిరుత ఆనందం చూడండి

ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. విమానాలను మానవుడు నడపడం చాలా కష్టతరం అవుతోందని వ్యాఖ్యానించారు.ఇక విమానాలను నడిపేందుకు పైలట్లు అక్కర్లేదని చెప్పిన ఆయన ... ప్రముఖ యూనివర్శిటీ మసుచుషెట్స్‌కు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్తలు నడపగలరని అన్నారు. ఇదిలా ఉంటే బోయింగ్‌ విమానాల తయారీపై సస్పెన్స్ మెయింటెయిన్ చేస్తూ వస్తోంది యాజమాన్యం. విమానాల్లో ఎలాంటి ఇబ్బందులు లేవని అవి ఎగిరేందుకు సురక్షితంగానే ఉన్నాయని చెబుతోంది.

English summary
The Directorate General of Civil Aviation (DGCA) on Tuesday finally decided to ground the controversial Boeing 737 Max 8 aircraft after 157 people on board an Ethiopian flight were killed on Sunday.While DGCA had earlier issued additional safety guidelines for Indian airlines operating Boeing 7373 Max 8 aircraft, it has finally decided to ground the particular model immediately.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X