వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రతీకారం: విరుచుకుపడిన భారత్-12మంది పాక్ సైనికుల హతం

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని సైనిక పోస్టులపై 120 ఎంఎం మోర్టార్లు, మిషన్‌గన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 12మంది పాక్‌ జవాన్లు హతమయ్యారు.

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: పాకిస్థాన్ ముష్కర మూకలు జరిపిన పైశాచిక దాడికి ప్రతీకారంగా భారత సైన్యం బుధవారం తీవ్రస్థాయిలో దాడులు జరిపింది. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని సైనిక పోస్టులపై 120 ఎంఎం మోర్టార్లు, మిషన్‌గన్లతో విరుచుకుపడింది. భారీ స్థాయిలో గుళ్ల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 12మంది పాక్‌ జవాన్లు హతమయ్యారు. వీరిలో కెప్టెన్‌ స్థాయి అధికారి కూడా ఉన్నాడు.

పాక్‌ బలగాలు మంగళవారం జరిపిన కాల్పుల్లో ముగ్గురు భారత జవాన్లు మరణించారు. వారిలో ఒకరి మృతదేహాన్ని ముక్కలుముక్కలుగా నరకడాన్ని భారతసైన్యం తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలోనే దెబ్బకుదెబ్బ తీసింది. అయితే భారత కాల్పుల్లో తమ సైనికులు ముగ్గురే మరణించారని పాక్‌ ప్రకటించింది. మరో పదిమంది సాధారణ పౌరులు మరణించారని పేర్కొంది.

భారత సైన్యం ప్రయోగించిన షెల్స్‌ ఓ ప్రయివేట్‌ బస్సు, అంబులెన్స్‌పై పడ్డాయని ఈ ఘటనలో పదిమంది మరణించారని పేర్కొంది. కవ్వింపు చర్యలు లేకుండానే భారత బలగాలు కాల్పులకు దిగాయని ఆరోపించింది.

India fire assault on LoC kills 12 Pakistanis, DGMOs speak

వారి ఉల్లంఘనకు ఇదే నిదర్శనమని చెప్పారు. తాము ధీటుగా తిప్పికొట్టామని, తమ సైన్యం జరిపిన కాల్పుల్లో ఏడుగురు భారత జవాన్లు మరణించారని చెప్పింది. అయితే దీనిని భారత సైన్యం ధ్రువీకరించలేదు. కాగా పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కూడా భారత బలగాలు ఏకపక్షంగా కాల్పులకు దిగిందని ఆరోపించారు.

అమరులకు ఘన నివాళి

పాక్‌ సైనికుల కాల్పుల్లో మంగళవారం వీరమరణం జవాన్లు మనోజ్‌ కుమార్‌ కుశ్వాహ, ప్రభుసింగ్‌, శశాంక్‌ కుమార్‌ సింగ్‌లకు సైన్యం ఘన నివాళులర్పించింది. బాదామీబాగ్‌ కంటోన్మెంట్‌లో సైనిక ఉన్నతాధికారులంతా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.
అంత్యక్రియల నిమిత్తం వారి పార్థివదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలపై భారత్‌, పాక్‌ సైనిక కార్యకలాపాల డైరెక్టర్‌ జనరల్‌(డీజీఎంవో)లు బుధవారం హాట్‌లైన్‌ ద్వారా మాట్లాడుకున్నారు. భారత బలగాల కాల్పుల్లో సాధారణ పౌరులు మృత్యువాతపడ్డారంటూ పాక్‌ డీజీఎంవో.. మనదేశ డీజీఎంవో దృష్టికి తీసుకొచ్చారు. అయితే, పాక్‌ దళాలు కాల్పులకు తెగబడిన ప్రాంతాల్లోనే తాము ఎదురుకాల్పులకు దిగినట్లు స్పష్టం చేశారు. మచ్చిల్‌ సెక్టార్‌లో ముగ్గురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ ఢిల్లీలో బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మన సైన్యంపై నమ్మకముంచాలంటూ ప్రజలకు హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు.

English summary
A day after it promised “heavy retribution” for the killing of three of its soldiers — one of the bodies was mutilated — by Pakistanis who crossed the Line of Control in the Machil sector of north Kashmir, the Indian Army launched a fire assault Wednesday against Pakistani posts at different points along the LoC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X