వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బారత్ అడుగులు అణు విద్యుత్‌లో ముందుకే..

పరిమితులు, అడ్డుగోడలు, అడ్డంకులు, అవరోధాలు, పరిమితులు ఎన్ని ఉన్నా అణు విద్యుత్ రంగంలో భారతదేశం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పరిమితులు, అడ్డుగోడలు, అడ్డంకులు, అవరోధాలు, పరిమితులు ఎన్ని ఉన్నా అణు విద్యుత్ రంగంలో భారతదేశం ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నది. భావి అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే కొత్తగా పది అణు రియాక్టర్లు స్థాపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయం పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే ఒక్కో రియాక్టర్ 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది.

భారతదేశంలో ప్రస్తుతం 3.19 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దీనిలో సింహభాగం ధర్మల్‌ విద్యుత్, కాగా, అణు విద్యుత్ వాటా 2.1 శాతం. దేశంలో మొత్తం 22 ప్లాంట్లలో 6,780 మెగావాట్ల అణు విద్యుత్ సామర్థ్యం ఉన్నది. తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో అణు విద్యుత్ యూనిట్లు ఉన్నాయి.

India Forward to nuclear power generation

నాలుగేళ్లలో అందుబాటులోకి 6700 మెగావాట్ల విద్యుత్

ఇవి కాక 2021 - 22 నాటికి అందుబాటులోకి వచ్చే విధంగా 6,700 మెగావాట్ల అణు విద్యుత్ ప్లాంట్లు నిర్మాణంలో ఉన్నాయి. వీటిని కూదంకుళం, కాక్రపర్‌, రాజస్థాన్‌ ఆటమిక్‌ పవర్‌ ప్లాంట్లలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే నిర్మాణంలో అణు రియాకర్టర్లకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన 10 రియాక్టర్లు అదనం. కొత్త ప్రాజెక్టులను బనస్వారా (రాజస్థాన్‌), చుట్కా (మధ్యప్రదేశ్‌), కైగా (కర్నాటక), గోరఖ్‌పూర్‌ (హర్యానా) లలో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల భారతదేశంలో ఒకేసారి చేపట్టిన అతి పెద్ధ అణు విద్యుత్ విస్తరణ కార్యక్రమం ఇదే. తాజా ప్రతిపాదిత రియాక్టర్లు ఉత్పత్తి ప్రారంభిస్తే దేశీయ అణు విద్యుత్ సామర్థ్యం 20 వేల మెగావాట్లను దాటి పోతున్నది.

ఇలా 31 దేశాల్లో అణు విద్యుత్ తయారీ

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అణుశక్తిని శాంతియుత అవసరాలకు ఉపయోగించాలనే ఆలోచన వివిధ దేశాలకు వచ్చింది. తత్ఫలితంగా తొలి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం 1950లో ప్రారంభమైంది. ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో 440 వాణిజ్య ప్రాతిపదికన నడిచే అణు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 3.90 లక్షల మెగావాట్లు. వివిధ దేశాల్లో మరో 60 అణు రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నాయి.

11 శాతం ప్రపంచ అవసరాలు తీరుస్తున్న అణు విద్యుత్

అణు విద్యుత్ కేంద్రాల ద్వారా 11 శాతం ప్రపంచ విద్యుత్ అవసరాలు తీరుస్తున్నాయి. పలు దేశాలు అణు విద్యుత్ ఉత్పత్తిపైనే ఆధార పడి ఉన్నాయి. బెల్జియం, చెక్‌ రిపబ్లిక్‌, హంగరీ, స్వీడన్‌, స్విట్జార్లాండ్‌, ఫిన్లాండ్‌, ఉక్రెయిన్‌ దేశాలు ఈ కోవలోవే. అమెరికా, బ్రిటన్, స్పెయిన్‌, రష్యా, రుమేనియా దేశాల్లో వినియోగిస్తున్న అణు విద్యుత్ ఐదో వంతు ఉంటుంది. అణు విద్యుత్‌లో తక్కువ యూనిట్‌ విద్యుత్ ధర, స్థిరమైన సరఫరా, కాల్యుష్యం లేకపోవటం ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. ప్రమాదాల భయం, తగినంత సాంకేతిక పరిజ్ఞానం లేమి, పరికరాల లభ్యత లేకపోవడం, ప్రధాన సమస్యలుగా ఉన్నాయి.

నాలుగు అత్యాధునిక రియాక్టర్లు నిర్మిస్తున్న అమరికా

అమెరికా తాజాగా అత్యాధునిక నాలుగు 'ఏపీ 1000' శ్రేణి రియాక్టర్లను అమెరికా నిర్మిస్తోంది. ఈ తరహా యూనిట్లలో అధిక వినియోగ సామర్థ్యాన్ని సాధించవచ్చు. అమెరికాలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో అణు విద్యుత్ వాటా భవిష్యత్‌లో తగ్గిపోతుంది. 2016 లో ఇది 20 శాతం ఉంది. కానీ ఇది 2050 నాటికి 11 శాతానికి తగ్గిపోతుందని అంచనా. సహజవాయువు ఆధారిత విద్యుత్, పునరుత్పాదక విద్యుత్ తయారీ యూనిట్లు అధికంగా అందుబాటులోకి వస్తుండటం దీనికి ప్రధాన కారణం.

ఎనిమిదేళ్లలో 30.5 గిగావాట్ల అణు విద్యుత్ రష్యా లక్ష్యం

రష్యా 2025 నాటికి అణు విద్యుత్ సామర్థ్యాన్ని 30.5 గిగావాట్లకు పెంచుకోవాలని ప్రణాళిక రూపొందిస్తున్నది. అందుకోసం అంతర్జాతీయ శ్రేణి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన తేలికపాటి రియాక్టర్లను వినియోగిస్తోంది. రియాక్టర్ల ఎగుమతి, నిర్మాణం, సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాల్లో రష్యా అగ్రగామిగా ఉున్నది. ప్రస్తుతం మూడు రియాకర్టు నిర్మిస్తున్న దక్షిణ కొరియా మరో ఎనిమిది రియాక్టర్లు నిర్మించాలనే ఆలోచన ఆ దేశానికి ఉంది. రియాక్టర్ల డిజైన్‌పై విస్తృత స్థాయి పరిశోధనలు దక్షిణ కొరియాలో సాగుతున్నాయి. ఇప్పటికే అణు విద్యుత్ కేంద్రాలను నిర్వహిస్తున్న దేశాలే కాక కొత్తగా ఈ జాబితాలో టర్కీ, బెలారస్‌, పోలెండ్‌, యూఏఈ తదితర దేశాలు చేరనున్నాయి.

అణు విద్యుత్ వినియోగంలో ఫ్రాన్స్‌ టాప్

అణు విద్యుత్ అధికంగా వినియోగించే దేశాల్లో ఫ్రాన్స్‌దే అగ్రస్థానం. ఆ దేశంలోని 58 న్యూక్లియర్‌ రియాక్టర్లకు 63.2 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఫ్రాన్స్‌ విద్యుత్ అవసరాల్లో 75 శాతాన్ని అణువిద్యుత్ కేంద్రాలు తీరుస్తున్నాయి. దీన్ని వచ్చే ఎనిమిదేళ్లలో 50 శాతానికి తగ్గించాలని ఆ దేశం భావిస్తోంది. విద్యుత్ విదేశాలకు అధికంగా ఎగుమతి చేసే దేశాల్లో ఫ్రాన్స్‌ ముందు ఉన్నది. అణు విద్యుత్ అతి తక్కువ ఖర్చులో తయారు చేస్తున్న ఫలితంగా ఆ దేశానికి ఈ అవకాశం లభించింది. అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయటంలో, రియాక్టర్ల తయారీలో, అణు ఇంధన సంస్థలకు సేవలు అందించటంలో ఫ్రాన్స్ అగ్రగామిగా ఉంది.

ఆచితూచి అడుగులేస్తున్న జపాన్‌

అణు బాంబు దాడికి కకావికలమైన దేశం జపాన్‌. రెండో ప్రపంచ యుద్ధంలో నాగసాకి, హిరోషిమా నగరాలపై అమెరికా వేసిన అణు బాంబులతో దాదాపు లక్ష మంది చనిపోయారు. అయినా శాంతియుత అవసరాల కోసం అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునే విషయంలో జపాన్‌ వెనకడుగు వేయలేదు. జపాన్‌లోని 50కి పైగా అణు రియాక్టర్లు దేశంలోని 30 శాతం విద్యుత్ అవసరాలు తీరుస్తున్నాయి. మూతపడిన విద్యుత్ కేంద్రాలను తగిన మరమ్మతులతో తిరిగి తెరిచే ప్రయత్నాల్లో ఉంది.

అణు విద్యుత్‌లో భారత్ ఇలా..

అమెరికా విద్యుత్ సంస్థ 'జనరల్‌ ఎలక్ట్రిక్‌'తో 1964లో కుదుర్చుకున్న ఒప్పందంతో భారతదేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఒప్పందం ప్రకారం అప్పట్లో తారాపూర్‌లో రెండు అణు రియాక్టర్లు నిర్మించారు. 1971లో కెనడా సహకారంతో భారజల రియాక్టర్లను రాజస్థాన్‌లో నెలకొల్పారు. వాణిజ్య ప్రాతిపదికన అణువిద్యుత్ తయారు చేయాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1987లో భారత అణు విద్యుత్ సంస్థను ఏర్పాటుచేసింది.

అప్పటి నుంచి అణు విద్యుత్ గణనీయంగా పెంచుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించినా అంతర్జాతీయ ఆంక్షలు, నియంత్రణ నేపథ్యంలో సాధ్యం కాలేదు. అదే సమయంలో ధర్మల్‌, జలవిద్యుత్ విభాగాలు విస్తరించాయి. మరోపక్క కొంతకాలంగా ప్రభుత్వం సాంప్రదాయేతర ఇంధన వనరులపై దృష్టి సారించింది. ఒక్క సౌరవిద్యుత్ విభాగంలోనే 2020 నాటికి ఒక లక్ష మెగావాట్ల సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలనే లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకున్నది.

English summary
India has decided to hike nuclear power generation while it has build another 10 Nuclear Power reactors.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X