వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌లో ఆ మూడు కరోనా వ్యాక్సిన్లు... ఇప్పుడు ఏ దశలో ఉన్నాయి... కీలక అప్‌డేట్...

|
Google Oneindia TeluguNews

భారత్‌లో ఆక్స్‌ఫర్డ్ ఆస్ట్రజెనెకా,రష్యా స్పుత్నిక్ వి,భారత్ బయోటెక్ వ్యాక్సిన్ క్యాండిడేట్స్ రెండో దశ,మూడో దశ ప్రయోగాలు వచ్చే వారం మొదలవుతాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన జెన్నర్ ఇనిస్టిట్యూట్ అభివృద్ది చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇప్పుడు అన్నింటికంటే ముందు వరుసలో ఉన్నది. బ్రిటీష్-స్వీడిష్ ఫార్మా కంపెనీతో కలిసి ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సంయుక్తంగా దీన్ని అభివృద్ది చేసింది. కమర్షియల్‌గా కోవిషీల్డ్‌ అని పిలవబడుతున్న ఈ వ్యాక్సిన్ ప్రస్తుతం భారత్‌లోని పలు మెడికల్ ఇనిస్టిట్యూషన్స్‌లో రెండో దశ ట్రయల్స్‌లో ఉంది. నిజానికి సెప్టెంబర్ మొదటివారంలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ మొదలుకావాల్సి ఉన్నా... అనుకోని కారణాలతో వాయిదా పడక తప్పలేదు.

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన భారత్ కోవాక్సిన్ రెండో దశ ప్రయోగాలు కూడా త్వరలోనే మొదలుకానున్నాయి. ఇందుకోసం మంగళవారమే భారత్ బయోటెక్ అధికారిక నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దేశీయంగా అభివృద్ది చేసిన ఈ వ్యాక్సిన్ మొదటి దశ ప్రయోగాలు ఇంకా జరుగుతున్నాయని... త్వరలోనే రెండో దశ ప్రయోగాలకు ప్లాన్ చేస్తున్నామని కంపెనీ అధికారులు వెల్లడించారు.

India gears up for phase 3 trials of Oxford, Russian candidates

ఇక ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన రష్యా స్పుత్నిక్ వి హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ వచ్చే నెల నుంచి మొదలుకానున్నాయి. ఈ విషయాన్ని ఇటు భారత ప్రభుత్వ వర్గాలతో పాటు అటు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధికారులు ధ్రువీకరించారు.

భారత వ్యాక్సిన్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ హెడ్ వీకే పాల్ దీనిపై మాట్లాడుతూ... స్పుత్నిక్ వి వ్యాక్సిన్ తయారీ కోసం రష్యా ఇప్పటికే భారత్‌ను సంప్రదించిందని చెప్పారు. అలాగే భారత్‌లో మూడో దశ ట్రయల్స్ నిర్వహణ గురించి కూడా కోరిందన్నారు. రష్యాతో ఉన్న మిత్రుత్వం రీత్యా భారత్ వైపు నుంచి సానుకూల స్పందన ఉందన్నారు. ఇప్పటికే భారత్‌కు చెందిన పలు కంపెనీలు రష్యాతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చాయన్నారు. మరికొన్ని కంపెనీలు సంప్రదింపులు జరుపుతున్నాయన్నారు.

వలంటీర్లపై ట్రయల్స్‌కు ముందు మిగతా వ్యాక్సిన్ల లాగే రష్యా స్పుత్నిక్ వి కూడా వ్యాక్సిన్ ప్రోటోకాల్‌ ప్రకారం తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాల్సిందే అన్నారు.

English summary
The Health Ministry on Tuesday said that while Phase 2-3 trials for the Oxford and Bharat Biotech vaccine candidates will begin as early as next week, India will also be starting trials for Russia's Sputnik V vaccine.Currently, three companies are conducting phase 2-3 human trials of Covid vaccines in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X