వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే తొలిసారి డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా ఓ మహిళకు బాధ్యతలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) చీఫ్‌గా తొలిసారి ఓ మహిళ బాధ్యతలు చేపట్టారు. 1982 బ్యాచ్ యూటి క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ ఎమ్ సత్యవతిని డీజీసీఏ డైరెక్టర్ జనరల్‌గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

సత్యవతి ప్రస్తుతం పౌర విమానయాన మంత్రిత్వ శాఖలో అడిషనల్ సెక్రటరీగా, ఆర్ధిక సలహాదారుగా వ్వవహారిస్తున్నారు. సత్యవతికి మచ్చలేని వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు ఉండటంతోనే ఈ పదవి వరించింది.

India gets first woman DGCA

ప్రభాత్ కుమార్ స్థానంలో ఆమె డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు. డిప్యుటేషన్ పూర్తికావడంతో ప్రభాత్ కుమార్ తన ఉత్తరప్రదేశ్ క్యాడర్‌కు వెళ్లనున్నారు. సత్యవతి ముందున్న మొదటి ఛాలెంజ్ భారతీయ వైమానిక సేప్టీ ర్యాంకింగ్‌‌లో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావడం.

పేలవమైన నియంత్రణ పర్యవేక్షణ వల్ల గత ఏడాది జనవరిలో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత ఏవియేషన్ సేప్టీ ర్యాంకింగ్‌ను తగ్గించిన విషయం తెలిసిందే. దీంతో రెండో కేటగిరీ దేశాలైన బంగ్లాదేశ్, బార్బడోస్, ఘనా, కరేబియన్ ఐస్‌లాండ్ లాంటి దేశాల సరసన భారత్ చేరింది.

English summary
The government has appointed M Sathiyavathy, 1982 batch UT cadre IAS officer, as the DG till January 28, 2017 — making her the first woman director general of civil aviation (DGCA).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X