వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్తగా జమ్మూ కాశ్మీర్, లడఖ్: అధికారిక భారతదేశ చిత్రపటాలు ఇవే..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మనుగడలోకి వచ్చాయి. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అధికారికంగా ఈ రెండు ప్రాంతాల, దేశ చిత్రపటాలను విడుదల చేసింది.

అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్అర్ధరాత్రి నుంచి కొత్త చరిత్ర: రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూకాశ్మీర్, లడఖ్

అక్టోబర్ 31 నుంచి..

అక్టోబర్ 31 నుంచి..

కార్గిల్, లేహ్ జిల్లాలతో కూడిన లడఖ్ ప్రాంతం ఒక కేంద్రపాలిత ప్రాంతం కాగా, ఇక మిగితా జమ్మూకాశ్మీర్ అంతా కూడా రెండో కేంద్రపాలిత ప్రాంతం. 1947 నుంచి ఒకే రాష్ట్రంగా ఉన్న జమ్మూకాశ్మీర్ గత బుధవారం అర్ధరాత్రి 12గంటలు దాటిన తర్వాత అంటే గురువారం(అక్టోబర్ 31) నుంచి రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవరించాయి.

పునర్విభజన..

పునర్విభజన..

1947 నాటి నుంచి జమ్మూకాశ్మీర్‌లో కథువా, జమ్మూ, ఉధంపూర్, రియాసి, అనంతనాగ్, బారాముల్లా, పూంఛ్, మిర్పూర్, ముజఫరాబాద్, లేహ్, లడఖ్, గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్హాస్, ట్రైబల్ టెరిటోరీ జిల్లాలుగా ఉన్నాయి. 2019లో జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని పునర్విభజన చేసిన ప్రభుత్వం 14 జిల్లాలను 28 జిల్లాలుగా మార్చింది.

కొత్త జిల్లాలు..

కొత్త జిల్లాలు..

ఇక కొత్త జిల్లాల విషయానికొస్తే.. కుప్వారా, బందిపుర, గందర్బల్, శ్రీనగర్, బుద్గాం, పుల్వామా, షుపియాన్, కుల్గాం, రాజౌరి, రాంబన్, దొడ, కిష్టివర్, సాంబ, కార్గిల్ ఉన్నాయి.

కార్గిల్ జిల్లా లేహ్, లడఖ్‌ల నుంచి ఏర్పడింది. . జమ్మూకాశ్మీర్ పునర్విభజన ప్రకారం లేహ్ జిల్లా లడఖ్ ప్రాంతంలోనే ఉంది. గిల్గిత్, గిల్గిత్ వజరాత్, చిల్మాస్, ట్రైబల్ టెరిటోరి ప్రాంతాలు ఇందులోనే ఉన్నాయి.

పార్లమెంటులో ప్రకటన

పార్లమెంటులో ప్రకటన

జమ్మూకాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా అక్టోబర్ 31న ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ చిత్రపటాలను రూపొందించింది సర్వే జనరల్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో జమ్మూకాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొడుుతన్నట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో హోంమంత్రి అమిత్ షా.. జమ్మూకాశ్మీర్ పునర్విభజనపై పార్లమెంటులో ప్రకటన చేశారు. జమ్మూకాశ్మీర్ ప్రజల ప్రయోజనాలనుదృష్టిలో పెట్టుకునే ఈ నిర్నయం తీసకున్నామని చెప్పారు. దీంతో దేశంలో 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి. ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూకాశ్మీర్ పునర్విభజన బిల్లకు పార్లమెంటు ఆమోదం లభించిన విషయం తెలిసిందే.

English summary
The government has released the maps of newly created Union Territories (UTs) of Jammu and Kashmir, and Ladakh and the map of India depicting these UTs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X