• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భారతీయులు గర్వించేలా ఘనత .. 400 బిలియన్ డాలర్లకు చేరిన దేశీయ ఎగుమతులు ! : ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

భారతదేశం అన్ని రంగాల్లో చరవేగంగా వృద్ధి చెందుతోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన్ కీ బాత్ 87వ ఎపిసోడ్ లో ఆయన ప్రసంగించారు. అందరి సహకారంతో దేశాన్ని అభివృద్ధి వైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకెళ్తోందన్నారు. కలలు కంటే సంకల్పాలు పెద్దవిగా ఉన్నప్పుడు దేశం గొప్ప ప్రగతిని సాధిస్తుంది. పరిష్కారాల కోసం అహూరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ తీర్మానాలు కూడా ఫలిస్తామని పేర్కొన్నారు. భారతీయులు గర్వించే విధంగా ఒక ఘనతను సాధించామని చెప్పారు

రూ. 30 లక్షల కోట్లకు చేరిన ఎగుమతులు

రూ. 30 లక్షల కోట్లకు చేరిన ఎగుమతులు

గతంలో ఎన్నడూ లేని విధంగా భారత దేశం నుంచి ఎగుమతులు పెరిగాయని ప్రధాని మోదీ తెలిపారు. 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని , అంటే 30 లక్షల కోట్ల రూపాయలను చేరుకుందని వెల్లడించారు. ఒకప్పుడు భారతదేశం నుంచి 100 బిలియన్ల డాలర్లు, కొన్ని సార్లు 150 బిలియన్లు, మరికొన్ని సార్లు 200 బిలియన్ డాలర్లు ఉందేవని పేర్కొన్నారు. కానీ నేడు భారతదేశం 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ప్రధాని చెప్పారు. దేశంలోని చిన్న వ్యాపారవేత్తల విజయం మనల్ని గర్వించేలా చేయడం సంతోషంగా ఉందన్నారు.

ప్రభుత్వానికే నేరుగా ఉత్పత్తుల విక్రయం

ప్రభుత్వానికే నేరుగా ఉత్పత్తుల విక్రయం

దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్న వ్యాపారవేత్తలు, చిన్న దుకాణదారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారని ప్రధాని మోదీ తెలిపారు.

ఇంతకు ముందు పెద్ద వ్యక్తులు మాత్రమే ప్రభుత్వానికి తమ ఉత్పత్తులను విక్రయించగలరని విశ్వసించేవారు. కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన " E మార్కెట్ ప్లేస్ పోర్టల్ "దీన్ని మార్చేసిందన్నారు . ఇది నూతన భారతదేశ స్పూర్తిని తెలియజేస్తోందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. మన దేశ ఉత్పత్తుల ప్రతిష్ఠను మరింత పెంచుకుందామని పిలుపునిచ్చారు.

రైతులు, యువకులకు మోదీ ప్రశంసలు

రైతులు, యువకులకు మోదీ ప్రశంసలు

గత ఏడాది కాలంలో "జీఈఎమ్ పోర్టల్" ద్వారా దాదాపు లక్ష కోట్ల రూపాయల కంటే విలువైన వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేసిందని ప్రధాని మోదీ వెల్లడించారు. ఈ సందర్భంగా రైతులు, యువకులు, ఎంఎస్ఎంఈలను ప్రధాని ప్రశంసించారు. ఇది భారతదేశ సామర్థ్యాన్ని సూచిస్తుందన్నారు. దీనిని బట్టి ప్రపంచ వ్యాప్తంగా భారతీయ వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని అర్థమౌతోందన్నారు. "మేక్ ఇన్ ఇండియా" ఉత్పత్తుల జాబితా మన రైతులు, తయారీదారులు, పరిశ్రమల సామర్థ్యం , వారి కృషి చాలా గొప్పదన్నారు. మన దేశ ఎగుమతులు ఇతర దేశాలతో పాటు డెన్మార్క్, దక్షిణ కొరియా, లండన్, కెన్యా, వంటి దేశాలను సరఫరా కూడా చేస్తున్నామన్నారు.

రూ.1.40 లక్షల కోట్లకు చేరిన ఆయుష్ పరిశ్రమ

రూ.1.40 లక్షల కోట్లకు చేరిన ఆయుష్ పరిశ్రమ

ఆరేళ్ల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు రూ. 22వేల కోట్లు ఉండేది.. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు రూ. 1.40 లక్షల కోట్లకు చేరిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయని చెప్పారు. పద్మశ్రీ, 126 ఏళ్ల బాబా శివానంద్‌కి యోగా పట్ల మక్కువ ఆరోగ్యకరమైన జీవనశైలి పట్ల అంకితభావం మనందరికీ స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

నీటి సంరక్షణకు నడుం బిగిద్దాం..

నీటి సంరక్షణకు నడుం బిగిద్దాం..

దేశంలో నీటిని సంరక్షించేందుకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. నీటి యోధులుగా మారడానికి ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు. మురుగు నీటిని రీసైక్లింగ్ చేయడంపై దృష్టి పెట్టాలి.. ఆ నీటిని మొక్కలు, ఇతర తోటపని కార్యకలాపాలకు ఉపయోగించవచ్చన్నారు.

తాను నీటి కొరత అతిపెద్ద సమస్యగా ఉన్న గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చానని చెప్పారు. గుజరాత్ ప్రజలు నీటి భావులను పునరుద్ధరించారు. తద్వారా భూగర్భ జలమట్టం పెరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. "జలమందిర్ పథకం" మెట్ల బావుల రక్షణలో మఖ్యమైన పాత్ర పోషించిందని చెప్పారు. ఏప్రిల్ లో మహాత్మపూలే, బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారని మోదీ అన్నారు.

English summary
Indians should be proud of domestic exports worth over $ 400 billion!: Prime Minister Modi in 'Man Ki Baat'Prime Minister Modi's Mann Ki Baat speech: We have achieved the export target of Rs 30 lakh crore
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X