వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వ్యవసాయంలో విదేశీ పెట్టుబడులు - భారత్ పరిష్కారాల భూమి - ఇన్వెస్ట్ ఇండియా స‌ద‌స్సులో ప్రధాని మోదీ

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి భూగోళాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ.. దానికి పరిష్కార మార్గాలను కనిపెట్టే దిశగా భారత్ కీలక అడుగులు వేసిందని, ఫార్మా రంగంలో అగ్రగామిగా తోటి దేశాలకు పెద్ద ఎత్తున సాయం అందించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వ్యాపార, వాణిజ్యాల్లోనూ అన్ని దేశాలతో కలిసి పయనిస్తామని, బలమైన ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ లోకి విదేశీ పెట్టుబడులను(ఎఫ్‌డీఐలను) సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు. కెనడాలో జరుగుతోన్న ఇన్వెస్ట్ ఇండియా స‌ద‌స్సులో గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ప్రసంగించారు.

ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్ప్రపంచంలోనే పవర్‌ఫుల్ ఆయుధం - మన బతుకుల్ని మార్చేది అదే - స్కూల్ పిల్లాడిలా సీఎం జగన్

కెనడాలో జరుగుతోన్న ఇన్వెస్ట్ ఇండియా సదస్సులో బ్యాంకులు, బీహా, ఏవియేషన్, ఇన్వెస్ట్ మెంట్, ఎలక్ట్రానిక్స్, తయారీ తదితర రంగాలకు చెందిన ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులు, కన్సల్టెంట్ సంస్థలు, పలు యూనివర్సిటీల ప్రతినిధులు పాల్గొనగా, వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. భారత్ లో విదేశీ పెట్టుబడులకు గల అవకాశాలను ప్రధాని మోదీ వివరించారు.

 India has emerged as a land of solutions: PM Modi at Invest India Conference in Canada

వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపార రంగాల్లో విదేశీ పెట్టుబడులకు భారత్ లాభదాయకమైన ఎంపిక అవుతుందని, ఎఫ్‌డీఐల ప్రవాహాన్ని పెంచేందుకే విధానాలను మరింత సరళతరం చేశామని, సావరిన్ వెల్త్, పెన్షన్ నిధుల కోసం స్నేహపూర్వకమైన పన్నుల విధానాన్ని అమలు చేస్తున్నామని, అదే సమయంలో బలమైన బాండ్ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టామని ప్రధాని మోదీ వివరించారు.

హాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్ - అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే - వేలిముద్రలతో నిందితుల లేఖహాత్రస్ కేసులో షాకింగ్ ట్విస్ట్ - అమ్మాయిని చంపింది తల్లీ, అన్నలే - వేలిముద్రలతో నిందితుల లేఖ

''ఈ ఏడాది మార్చి-జూన్ మధ్యకాలంలో భారత వ్యవసాయ ఎగుమతులు 23 శాతం పెరిగాయి. ఫార్మా రంగంలో ముందంజలో ఉన్న మేము.. ఇప్పటికే 150 దేశాలకు మందులు, వైద్య సామాగ్రిని సరఫరా చేశాం. కొవిడ్ మహమ్మారికి పరిష్కారం భారత్ లోనే తయారవుతుంది. ప్రజాస్వామిక, అలజడులు లేని దేశంగా భారత్ పెట్టుబడులకు ఎంతో అనుకూలం. కెనడా-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇద్దరి ఆసక్తులకు అనుగుణంగా ముందుకు వెళుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రావడం ద్వారా బంధం మరింత బలపడుతుంది'' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday presented India as a lucrative option for foreign investment on the agricultural, medical, educational and business front and said that India has emerged as a land of solutions. PM Modi was delivering the keynote address at the Invest India Conference in Canada via video conferencing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X