వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆగస్ట్ లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలో కరోనా బీభత్సం .... గత 24 గంటల్లో 61,537 కొత్త కేసులు

|
Google Oneindia TeluguNews

భారతదేశం కరోనా కు హాట్ స్పాట్ గా మారుతుంది . ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆగస్టులో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ -19 హాట్‌స్పాట్‌గా మారబోతుందని తాజా కేసులను బట్టి అర్ధం అవుతుంది .ఇప్పటివరకు ఆగస్టు నెలలో అత్యధికంగా కేసులను నమోదు చేసింది, ఇది యుఎస్ కంటే కొంచెం ఎక్కువ మరియు బ్రెజిల్ లో నమోదైన కేసుల కంటే చాలా ఎక్కువ.

ఆగస్ట్ లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే పెరుగుతున్న కేసులు

ఆగస్ట్ లో ప్రపంచంలోనే అత్యధికంగా ఇండియాలోనే పెరుగుతున్న కేసులు

ఆగస్టు మొదటి ఆరు రోజులలో కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో మూడవ అత్యధిక మరణాలు భారతదేశంలోనే జరిగాయి . తాజాగా కూడా కొత్త కేసులు 60,000 దాటాయి. గత 24 గంటల్లో మరణాలు 926 కు పెరిగాయి. ఇది ఇప్పటివరకు అత్యధిక సింగిల్-డే మరణాల సంఖ్య. రాష్ట్ర ప్రభుత్వాల నుండి సేకరించిన సమాచారం ప్రకారం.
ఆగస్టు మొదటి ఆరు రోజుల్లో భారత్‌లో 3,28,903 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. వరల్డ్ మీటర్ ప్రకారం, ఆగస్ట్ మొదటి వారంలో యుఎస్ లో కేసుల సంఖ్య 3,26,111 మరియు బ్రెజిల్లో 2,51,264 కేసులు నమోదు అయ్యాయి అంటే ఇండియాలోనే ఆగస్ట్ లో అత్యధిక కేసులు నమోదు అయ్యాయి అని తెలుస్తుంది.

కరోనా దారుణ స్థితికి చేరుకున్న మూడు దేశాలలో ఇండియా

కరోనా దారుణ స్థితికి చేరుకున్న మూడు దేశాలలో ఇండియా

ఆగస్టు నెలలో 2, 3, 5 మరియు 6 తేదీలలో భారతదేశపు రోజువారీ కేసులు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. భారతదేశం యొక్క కరోనా కేసులు 2 మిలియన్ (20 లక్షలు) మార్కును దాటిన పరిస్థితి కనిపిస్తుంది.ఇప్పటివరకు కరోనా దారుణ స్థితికి చేరుకున్న మూడు దేశాలలో ఇండియా ఉంది . అయితే, మరణాలలో, బ్రెజిల్ మరియు యుఎస్ రెండూ ఆగస్టులో ఇప్పటివరకు 6,000 కన్నా ఎక్కువ మరణాలను నమోదు చేయగా, భారతదేశం యొక్క మరణాల సంఖ్య 5,075 గా ఉంది .

Recommended Video

Andhra Pradesh Corona Updates : 10128 New Cases In AP || Oneindia Telugu
24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు

24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు

రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది . గడిచిన 24 గంటల్లో కొత్తగా 61,537 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు తెలుస్తుంది. అంతేకాక గత 24గంటల్లో 933 మంది మరణించారు. దీంతో కరోనా కేసుల సంఖ్య 20,88,612కు చేరింది. అదేవిధంగా కరోనా మృతులు 42,518కి పెరిగారు. ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 6,19,088 కేసులు యాక్టివ్‌గా ఉండగా, కరోనాబారిన పడిన మరో 14,27,006 మంది బాధితులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌బులిటెన్ విడుదల చేసింది.

మహారాష్ట్ర , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువగా కరోనా వ్యాప్తి

మహారాష్ట్ర , తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలో ఎక్కువగా కరోనా వ్యాప్తి

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టు ఐసీఎంఆర్‌ తెలిపింది. నిన్న ఒక్క రోజే 5,98,778 శాంపిల్స్‌ పరీక్షించినట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,33,87,171 శాంపిల్స్‌ను పరీక్షించారని సమాచారం. ఇండియాలో మహారాష్ట్ర మరియు ఆంధ్రప్రదేశ్ 10,000 కంటే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి.మహారాష్ట్ర 4,90,262 కేసులతో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది . ఇక రెండో స్థానంలో తమిళనాడు 2,85,024 కేసులతో ఉండగా .. మూడో స్థానంలో ఏపీ ఉంది. ఏపీలో 2,06,960 కరోనా కేసులు నమోదు అయ్యాయి .

English summary
India crossed the 20-lakh COVID-19 cases mark, becoming the third country in the world . India is emerging as the biggest Covid-19 hotspot in the world in August. The country has so far recorded the most number of fresh cases this month, slightly more than the US and substantially higher than infections reported in Brazil.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X