వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్‌కు ఉజ్వల భవిష్యత్తు.. అవకాశం లభిస్తే పెట్టుబడులకు రెడీ: వారెన్‌ బఫెట్‌

స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో లెజండరీగా పేర్కొనే వారెన్‌ బఫెట్‌ భారత్‌ను అపార అవకాశాలున్న మార్కెట్‌గా అభివర్ణించారు. పెట్టుబడులకు అవకాశం కనిపిస్తే వెంటనే భారత్‌ వచ్చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడుల్లో లెజండరీగా పేర్కొనే వారెన్‌ బఫెట్‌ భారత్‌ను అపార అవకాశాలున్న మార్కెట్‌గా అభివర్ణించారు. అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నారు. పెట్టుబడులకు చక్కని అవకాశం కనిపిస్తే వెంటనే భారత్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

''భారత్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఓ అద్భుతమైన కంపెనీ ఉంటే చెప్పండి. రేపటికల్లా అక్కడే ఉంటాను'' అంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మార్కెట్‌ పట్ల కాకుండా కంపెనీ వ్యాపారాలపై దృష్టి పెట్టాలంటూ బఫెట్‌ ఇన్వెస్టర్లకు ఓ సక్సెస్‌ మంత్రాన్ని బోధించారు.

buffet

భవిష్యత్తు అద్భుతం...

''భారత్‌లో భవిష్యత్‌ తరం అంతా ఇప్పటి కంటే మరింత గొప్పగా జీవించగలుగుతారు. మేథో సామర్థ్యాల దృష్ట్యా భారత్‌కు అద్భుతమైన భవిష్యత్తు ఉంది'' అని బఫెట్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఐఐటీ నిపుణుల గురించి ఆయన మాట్లాడారు. భారత్‌లోని ఐఐటీ ఇంజనీర్లను మాత్రమే తాను నియమించుకుంటానంటూ లోగడ మైక్రోసాఫ్ట్‌ యజమాని బిల్‌ గేట్స్‌ చెప్పిన మాటలను గుర్తు చేశారు. ''ఎవరైనా సరే విస్మరించడానికి వీల్లేని భారీ అవకాశాలున్న బ్రహ్మాండమైన మార్కెట్‌ భారత్‌..'' అని చెప్పారు.

గూగుల్‌, అమేజాన్‌ మిస్సయ్యా...

బఫెట్‌ గతంలో పెట్టుబడులకు సంబంధించి తాను చేసిన తప్పులపై పశ్చాత్తాపం చెందారు. ఐబీఎంకు బదులు గూగుల్‌ లేదా అమేజాన్‌లో పెట్టుబడులు పెట్టాల్సిందంటూ బెర్క్‌షైర్‌ హ్యాత్‌వే 53వ వార్షిక సమావేశంలో పేర్కొన్నారు. బెర్క్‌షైర్‌ బీమా విభాగం.. 'గీకో' ప్రకటనల ప్రదర్శనకు గూగుల్‌ ఒక్కో క్లిక్‌కు 10, 11 డాలర్ల చార్జీ వసూలు చేసినప్పుడే అందులో పెట్టుబడులు పెడితే బాగుండేదన్నారు.

టెక్నాలజీ స్టాక్స్‌ను విస్మరించడంపైనా విచారం వ్యక్తం చేశారు. వాటి విలువను మొదట్లోనే గుర్తించలేకపోయినట్టు చెప్పారు. అజిత్‌ జైన్‌ బెర్క్‌షైర్‌ కి తన కంటే ఎక్కువే ఆదాయాన్ని తెచ్చి పెట్టారని.. ఆయన కంపెనీని వీడినా, రిటైర్‌ అయినా ఆయన స్థానాన్ని మరెవరూ భర్తీ చేయలేరని బఫెట్ వ్యాఖ్యానించారు.

English summary
India just got a ringing endorsement from the world's most famous investor. "I think the potential for India is incredible," Warren Buffett said in an interview with Indian news channel ET Now on Monday, describing the South Asian nation as a "huge, enormous market." The Berkshire Hathaway chairman, also known as the Oracle of Omaha, said he'd immediately "hop on a plane" to India if the right investment opportunity came up. "If you tell me a wonderful company in India that might be available for sale, I'll be there tomorrow," he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X