వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ... రంజన్‌గోగోయ్‌ని అభినందించారంటూ... బంగ్లా మీడియాలో ప్రచారం... ఖండించిన భారత్...

|
Google Oneindia TeluguNews

అయోధ్య తీర్పు వెలువడిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ చీఫ్ జస్టీస్ రంజన్ గోగోయ్‌కి శుభాకాంక్షలు చెప్పారంటూ బంగ్లాదేశ్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అయితే ఇవి తప్పుడు వార్తలు అంటూ భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నారంటూ బంగ్లాదేశ్‌లో భారత హై కమిషన్ ఓ లేఖ విడుదల చేసింది.

ఈ నేపథ్యంలోనే భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రావిశ్‌కుమార్ స్పందించారు. అయోధ్య తీర్పు విషయంలో ప్రధాని మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అభినందించారని బంగ్లాదేశ్ మీడియాల వస్తున్న వార్తలు అవాస్తవం అని అన్నారు. ఇవి భారత్ మరియు బంగ్లాదేశ్‌ల మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీసేందుకు చర్యలుగా ఆయన అభివర్ణించారు. వీటీ ద్వార అల్లర్లను రెచ్చగొట్టేందుకు కొంతమంది వ్యక్తులు తప్పుడు వార్తలను ప్రసారం చేయిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలోనే వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.

 India has strongly condemns fake reports in Bangladesh

ఈ నెల తొమ్మిదిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ రంజన్ గోగోయ్ నేతృత్వంలోని అయిదుగు సభ్యుల బృందం అయోధ్యపై తీర్పును వెలువరిస్తూ...వివాదస్పద భూమి రామజన్మ న్యాస్ కు దక్కుతుందని తీర్పు వెలువరించింది. దీంతో మసీదు నిర్మాణానికి అయిదెకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే... తీర్పుపై భారత్‌లో కూడ తీర్పుపై పెద్దగా నిరసనలు లేకుండా కొనసాగాయి. మెజారీటి హిందువులకు అనుకూలంగా తీర్పు రావడంతో పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకున్నారు. అయితే ముస్లిం పర్సనల్ లా బోర్డు మాత్రం తీర్పుపై అంసతృప్తిని వ్యక్తం చేసింది.

English summary
India has strongly condemns fake reports in Bangladesh of PM congratulating Chief Justice of India Ranjan Gogoi over Ayodhya verdict,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X