వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప‌గ్ర‌హాల‌ను సైతం కూల్చే శ‌క్తి భార‌త్ సొంతం..!అంత‌రిక్ష రంగంలో వినూత్న అడుగు అన్న ప్ర‌ధాని..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైద‌రాబాద్ : అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే నాల్గో స్థానాన్ని భారత్ కైవ‌సం చేసుకుంద‌ని ప్రధాని నరేంద్రమోడీ తెలిపారు. ఢిల్లీలో ప్రధాని దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. మిషన్ శక్తి విజయవంతం అవడంపై స్పందించారు. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ఆపరేషన్ అని తెలిపారు. మన శాస్త్రజ్ఞులు అంతరిక్షంలో ఎల్ఈఓ శాటిలైట్ ను కూల్చివేశారని తెలిపారు. ఏ శాట్‌.. ఆర్బిట్‌ శాటిలైట్‌ను కేవలం 3 నిమిషాల్లోనే కూల్చేసింది. భారత అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలురాయి. యుద్ధ వాతావరణం ఏర్పరచడం మన ఉద్దేశం కాదని తెలిపారు. భారత్ శాంతిని కోరుకుంటోందని పేర్కొన్నారు. భారత్ స్పేస్ పవర్ గా అవతరించిందన్నారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత స్పేస్ పవర్ గా భారత్ ఏర్పడిందన్నారు. ప్రపంచంలోనే స్పేస్ పవర్ గా మారిన నాల్గో దేశం భారత్ అని పేర్కొన్నారు. ఈ మిషన్ అంతిమ లక్ష్యం భారత్ ను సురక్షితంగా ఉంచడం, అభివృద్ధి చేయడమేనని తెలిపారు.

India has the power of tearing satellites ..! New step into satellite field says Modi..!!

దేశంలోని మేధావుల‌ను, విధ్యావంతులను చూసి గర్వపడుతున్నానని మోదీ తెలిపారు. మిషన్ శక్తిని విజయవంతంగా పూర్తి చేసిన శాస్త్రజ్ఞులకు అభినందనలు తెలిపారు. ఓ శాటిలైట్‌ను పేల్చే ప‌రీక్షను భార‌త్‌ నిర్వహించ‌డం ఇదే మొద‌టిసారి. ప్రస్తుతం అగ్ర దేశాలు స్పేస్ ఫోర్స్‌ను సిద్ధం చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంల భార‌త్.. యాంటి శాటిలైట్లన నిర్మించ‌డం అత్యవ‌సరం. అంత‌రిక్ష ఆయుధాలు భ‌విష్యత్తులో ఎక్కువ‌గా వాడే అవకాశాలు ఉంటాయ‌ని, దాన్ని దృష్టిలో పెట్టుకుని మిష‌న్ శ‌క్తిని చేప‌ట్టారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత‌రిక్ష యుద్ధం కోసం భార‌త్ సిద్ధంగా ఉంద‌న్న సంకేతాన్ని కూడా మోదీ వినిపించారు. ఇప్పటి వ‌ర‌కు శ‌త్రు దేశాల శాటిలైట్లను పేల్చే స‌త్తా కేవ‌లం అమెరికా, ర‌ష్యా, చైనా దేశాల‌కు మాత్రమే ఉంది. ఇప్పుడు ఆ జాబితాలో ఇండియా చేరింది. ఇవాళ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు 300 కిలోమీట‌ర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్‌ను పేల్చి శ‌కాన్ని లిఖించి న‌ట్టు ప్ర‌ధాని అభివ‌ర్ణించారు.

English summary
Prime Minister Narendra Modi said India took the fourth position in the world of space. In Delhi, the Prime Minister spoke to the people of the country. The mission has responded to the power of success. Mission strength is the most difficult operation he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X