వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాతో చర్చల్లో పురోగతి- సరిహద్దు ప్రతిష్టంభనకు త్వరలోనే తెర- కేంద్రం ఆశాభావం...

|
Google Oneindia TeluguNews

చైనాతో రెండు నెలల క్రితం చోటు చేసుకున్న గల్వాన్‌ ఘటన తర్వాత ఆ దేశంపై గుర్రుగా ఉన్న భారత్‌ చర్చలను మాత్రం కొనసాగిస్తోంది. దౌత్య మార్గాల్లోనే చైనాను అడ్డుకోగలమని బలంగా భావిస్తున్న కేంద్రం... ఇప్పటికే నాలుగు దఫాల చర్చలను పూర్తి చేసింది.. వీటిలో పురోగతి కనిపిస్తోందని, త్వరలో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇవి ఉపయోగపడతాయని అంచనా వేస్తోంది. తాజాగా చర్చల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తలేదనే విషయాన్ని కూడా ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా అంగీకరిస్తున్నాయి.

చైనా, పాక్‌ సరిహద్దుల్లో టెన్షన్‌ - తేజస్‌ స్క్వాడ్రన్‌ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?చైనా, పాక్‌ సరిహద్దుల్లో టెన్షన్‌ - తేజస్‌ స్క్వాడ్రన్‌ విమానాల మోహరింపులు.. ఏం జరుగుతోంది ?

చైనాతో చర్చల్లో పురోగతి...

చైనాతో చర్చల్లో పురోగతి...

కరోనా వైరస్‌ ప్రభావం మొదలయ్యాక భారత్‌ దాన్ని ఎదుర్కొనేందుకు బిజీగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో గుట్టుచప్పుడు కాకుండా లడఖ్‌ వద్ద వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో ఆక్రమణలకు తెరదీసిన చైనా.. ఆ తర్వాత గల్వాన్‌ ఘటనలో మరింత రెచ్చిపోయింది. ఓవైపు చర్చలు సాగుతున్న తరుణంలోనే డ్రాగన్‌ బలగాలు భారత్ సైనికులను పొట్టనబెట్టుకోవడంతో కేంద్రం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. కానీ చర్చల ప్రక్రియ మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. చైనా ఉత్పత్తుల నిషేధంతో పాటు అన్ని రకాలుగా ఒత్తిడి పెంచింది. అయితే దౌత్య చర్చల ద్వారా మాత్రమే ప్రతిష్టంభనకు తెరపడుతుందని ఇప్పటికీ కేంద్రం నమ్ముతోంది. దీంతో నాలుగు దఫాలుగా దౌత్య చర్చలు సాగించిన కేంద్రం... అందులో పురోగతి సాధించినట్లు భావిస్తోంది. వ్యూహాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాలు వైదొలిగేలా తాము ఒప్పించగలిగినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా వ్యాఖ్యానిస్తున్నాయి.

త్వరలో చైనా బలగాలు వెనక్కి...

త్వరలో చైనా బలగాలు వెనక్కి...


వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలకు తెరదించేందుకు ఇరుదేశాలు కలిసి డబ్య్లూసీసీ పేరుతో ఏర్పాటు చేసుకున్న దౌత్య చర్చలు ఇప్పటికే 18 రౌండ్లు పూర్తి చేసుకున్నాయి. ఇందులో భారత్‌, చైనా బలగాలు తమ తమ పరిధి దాటి ఎంతవరకూ వచ్చాయి, వాటిని ఎంత వరకూ నియంత్రించాలి, ఈ ప్రక్రియ ఎప్పటి కల్లా పూర్తి చేయాలన్న దానిపై అధికారులు చర్చలు జరిపారు. అయితే నిర్దిష్టంగా తెలియకపోయినా త్వరలోనే బలగాల ఉపసంహరణ ప్రక్రియ మరింత ముందుకు వెళ్లేలా చర్చలు సాగాయని అనధికార వర్గాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఓసారి చైనా బలగాలు వెనక్కి తగ్గితే ఇక వాస్తవాధీన రేఖ వద్ద ఉద్రిక్తతలు వాటంతట అవే తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తున్నారు.

Recommended Video

China's Sinopharm Covid-19 Vaccine To Be aAvailable At End Of 2020 || Oneindia Telugu
దౌత్యమే ప్రధానం...

దౌత్యమే ప్రధానం...


చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌ డ్రాగన్ దేశంపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకొస్తున్నా అంతిమంగా దౌత్యమే ప్రధానమని నమ్ముతోంది. గతంలో చైనాతో యుద్ధం సందర్భంగా కూడా దౌత్యం ద్వారానే పొరుగు దేశానికి అడ్డుకట్ట వేయగలిగామని, ఈసారి కూడా దౌత్య మార్గంలోనే పురోగతి సాధించాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అందుకే చైనాతో ఉద్రిక్తతలను సాధ్యమైనంత తగ్గించేలా పలు ప్రతిపాదనలకు భారత్‌ అంగీకరించినట్లు తెలుస్తోంది. అయితే వ్యూహత్మక రోడ్డు మార్గంపై మాత్రం వెనక్కి తగ్గబోమని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. చర్చల్లో మిగతా చోట్ల బలగాల ఉపసంహరణ ఎలా ఉన్నా రోడ్డు మార్గం నిర్మాణంపై మాత్రం చైనా ఎక్కువగా పట్టుబడుతోంది. దీంతో అది కాకుండా మిగతా విషయాలు మాట్లాడుకుందామని భారత్‌ ప్రతిపాదిస్తోంది. దీంతో మరిన్ని దఫాలుగా ఈ చర్చలు సాగే అవకాశముంది.

English summary
after four rounds of diplomatic talks with china, india is looking hopeful of progress in lac standoff. and dailogue is the only way forward to end the standoff.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X