వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా ప్రభావిత దేశాల్లో 11వ స్థానంలో భారత్ ..కేసుల్లో చైనాను దాటేసిన ఇండియా

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనావైరస్ కేసులు చైనా కరోనా కేసులను దాటేశాయి . డేటా ప్రకారం, భారతదేశంలో 85949 కేసులు ఉండగా, చైనాలో 82000 కేసులు మాత్రమే నమోదయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. ఎక్కువగా ప్రభావితమైన దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11 వ స్థానంలో ఉంది.

covid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులుcovid 19 India update : 24 గంటల్లో 3,967 కేసులు,100 మరణాలు .. 80 వేలు దాటిన కరోనా కేసులు

ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్నా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

ఇండియాలో లాక్ డౌన్ కొనసాగుతున్నా భారీగా పెరుగుతున్న కరోనా కేసులు

భారత దేశంలో లాక్ డౌన్ మూడవ దశలో ఉన్నప్పటికీ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపుల వల్లే భారతదేశ కేసులు నిరంతరం పెరుగుతున్నాయన్న భావన వ్యక్తం అవుతుంది . ఇక తాజాగా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ, మే 17 తర్వాత 4.0 లాక్డౌన్ యొక్క నాలుగో దశలోకి భారత్ ప్రవేశించనుందని, ఇది మునుపటి మూడు లాక్ డౌన్ లతో పోలిస్తే వాటికి భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు .

ఇండియాలో కేసుల్లో టాప్ లో మహారాష్ట్ర , ఢిల్లీ నాలుగో స్థానం

ఇండియాలో కేసుల్లో టాప్ లో మహారాష్ట్ర , ఢిల్లీ నాలుగో స్థానం

కేసులు పెరుగుతున్నప్పటికీ చాలా రాష్ట్రాలు ఆర్థిక మరియు పారిశ్రామిక కార్యకలాపాలపై సడలింపులతో ముందుకు సాగుతున్నాయి. లేదంటే ఇప్పటికే కుదేలైన ఆర్ధిక రంగం పాతాళంలో పడిపోయే ప్రమాదం ఉంది. కరోనా మాట అటుంచి ప్రజలు ఆకలి చావులకు గురవుతారన్న భావన వ్యక్తం అవుతుంది .ఇక కరోనా పాజిటివ్ అధికంగా ఉన్న రాష్ట్రాల్లో, మహారాష్ట్ర ఇప్పటికీ 29100 కేసులతో ముందంజలో ఉంది. లాక్డౌన్ మే చివరి వరకు పొడిగించాలని రాష్ట్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది . 10108 కేసులను నమోదు చేసిన తమిళనాడు రెండో స్థానంలో ,గుజరాత్ 9931 కేసులతో మూడవ స్థానంలో ఉండగా ఢిల్లీ 8895 కేసులతో నాలుగో స్థానంలో ఉంది.

Recommended Video

Rahul Gandhi Request To PM Modi
 చైనాలో తగ్గినా యాక్టివ్ కేసుల సంఖ్య .. ఆందోళన కరంగా ఇండియా పరిస్థితి

చైనాలో తగ్గినా యాక్టివ్ కేసుల సంఖ్య .. ఆందోళన కరంగా ఇండియా పరిస్థితి

ఇక చైనాలో చూస్తే యాక్టివ్ కరోనావైరస్ కేసుల సంఖ్య జనవరి తరువాత మొదటిసారిగా 100 కన్నా తక్కువకు పడిపోయిందని శుక్రవారం చైనా వెల్లడించింది . జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం, దేశంలో 91 యాక్టివ్ కరోనావైరస్ కేసులు ఉన్నాయి, ఇందులో 11 మంది రోగులు తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఈశాన్య ప్రావిన్స్ జిలిన్ లో నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో కూడా ఎలాంటి లక్షణాలు లేని కేసులు పెరిగాయి. ఏది ఏమైనా ప్రస్తుతం ఇండియాలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి .

English summary
coronavirus cases in India have soared past the official tally of its neighbour China. India has 85949 cases whereas reports say that China has over 82000 cases. India in 11th place in affected countries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X